diwali greetings
-
రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
-
తెలంగాణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
-
గవర్నర్, సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియ జేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని గవర్నర్ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో స్థానిక ఉత్పత్తు లను కొనుగోలు చేసి పండుగను జరుపుకో వాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ దీపావళి పండుగ మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు, కొత్త ఆలోచ నలు, కొత్త ఆదర్శాలను తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు. చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగ దీపావళి, తెలంగాణ ప్రజల జీవితాల్లో ప్రగతి కాంతులు నింపాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. -
తెలుగువారందరికీ చెవిరెడ్డి దీపావళి శుభాకాంక్షలు
-
మో‘దివాళీ’ గ్రీటింగ్స్
సాక్షి,న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దివాళి మీ జీవితాల్లో వెలుగులు, సుఖసంతోషాలు నింపాలని ఆశిస్తునట్టు మోదీ ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మోదీ ఈ దీపావళిని ఉత్తరాఖండ్‌లో చైనా సరిహద్దు వద్ద భారత దళాలు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్‌లతో జరుపుకోనున్నారు. మరోవైపు రాష్ట్రపతి కోవింద్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అందచేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్‌లు దివాళీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ ప్రజల లోగిళ్లలో సుఖ శాంతులు వెల్లివిరియాలని, శాంతి సౌభాగ్యాలను ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు,సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతిఇంటా దీపావళి ఆనందాల కోటి కాంతులు నింపాలని వైఎస్ జగన్ అభిలషించారు. -
వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు
-
వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని వైఎస్ జగన్ ట్విట్ చేశారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల కోటి కాంతులు నింపాలని వైఎస్ జగన్ ఆక్షాంక్షించారు. May this Deepavali light up our lives and bring abundant joy and prosperity to you and your loved ones. — YS Jagan Mohan Reddy (@ysjagan) 29 October 2016 -
అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి
ప్రజలకు గవర్నర్ దీపావళి శుభాకాంక్షలు..రాజ్‌భవన్‌లో వేడుకలు హైదరాబాద్: దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు. దీపావళిని పురస్కరించుకుని శుక్రవారం రాజ్‌భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సరదాగా నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో గవర్నర్ దంపతులు పాల్గొని సందడి చేశారు. ఉద్యోగులు, వారి పిల్లలకు ఆటపాటల పోటీలు నిర్వహించారు. గవర్నర్ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి, ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పాల్గొన్నారు. -
'ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి'
-
ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి: వైఎస్ జగన్
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పర్వదినం సందర్భంగా అందరికి సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ఈ దీపావళి ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. -
సుఖశాంతులు వెల్లివిరియాలి: మోదీ
న్యూఢిల్లీ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. దీపకాంతులు పేదల జీవితాలను వెలిగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన ఫేస్బుక్ పేజీలో సందేశం పోస్ట్ చేశారు. 'మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మన జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలి. దీపావళి కాంతులు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి' అని మోదీ ఆకాంక్షించారు.