సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియ జేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని గవర్నర్ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో స్థానిక ఉత్పత్తు లను కొనుగోలు చేసి పండుగను జరుపుకో వాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ దీపావళి పండుగ మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు, కొత్త ఆలోచ నలు, కొత్త ఆదర్శాలను తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు. చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగ దీపావళి, తెలంగాణ ప్రజల జీవితాల్లో ప్రగతి కాంతులు నింపాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
గవర్నర్, సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Published Thu, Nov 4 2021 2:58 AM | Last Updated on Thu, Nov 4 2021 3:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment