సాక్షి,న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దివాళి మీ జీవితాల్లో వెలుగులు, సుఖసంతోషాలు నింపాలని ఆశిస్తునట్టు మోదీ ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మోదీ ఈ దీపావళిని ఉత్తరాఖండ్‌లో చైనా సరిహద్దు వద్ద భారత దళాలు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్‌లతో జరుపుకోనున్నారు. మరోవైపు రాష్ట్రపతి కోవింద్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అందచేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స‍్వరాజ్, రవిశంకర్ ప్రసాద్‌లు దివాళీ శుభాకాంక్షలు తెలిపారు.
పండుగ వేళ ప్రజల లోగిళ్లలో సుఖ శాంతులు వెల్లివిరియాలని, శాంతి సౌభాగ్యాలను ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు,సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతిఇంటా దీపావళి ఆనందాల కోటి కాంతులు నింపాలని వైఎస్ జగన్ అభిలషించారు.
Comments
Please login to add a commentAdd a comment