dizziness
-
గిర్రున తిప్పే వర్టిగో!
కొందరు తమకు తరచూ తల తిరుగుతోందనీ, పడిపోతున్న ఫీలింగ్ ఉందని అంటుంటారు. ఇంగ్లిష్‌లో గిడ్డీనెస్, డిజ్జీనెస్గా మనం చెప్పుకునే లక్షణాలను కలిగించే ఆ వ్యాధినే వైద్యపరిభాషలో ‘వర్టిగో’ అంటారు. మనందరి జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా అనుభవించే ఈ కండిషన్‌పై అవగాహన కోసమే ఈ కథనం. కళ్లు తిరగడం / తల తిరగడం రూపంలో కనిపించే వర్టిగో పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ. వర్టిగో అనుభవాలు చిత్రవిచిత్రాలు... తల/కళ్లు తిరగడం (వర్టిగో) సమయంలో కలిగే అనుభూతులు వేర్వేరు రోగుల్లో వేర్వేరుగానూ, చిత్రవిచిత్రంగా ఉంటాయి.ఉదాహణకు... ►కొందరిలో గాల్లో అలా కొట్టుకుపోతున్నట్లుగా ఫీలవుతారు ►కొందరు తలకిందులుగా లోయలో/బావిలో పడిపోతున్నట్లుగా ఫీలవుతారు ►కొందరు భవనం పైనుంచి కిందికి పడిపోతున్నట్లు అనుభూతి చెందుతారు ►మంచంపై పడుకుని ఉంటే... కొందరిలో కాళ్లు ఉన్న భాగం పైకి లేచిపోతున్నట్లు ఫీలవుతారు ►కొందరు నిటారుగానే ఉన్నా... తాము ఒక కోణంలో ఒంగుతున్నట్లు భ్రమిస్తూ... చక్కగా/నిటారుగా అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు ►తమ చుట్టూ ఉన్న ఫొటోలూ, ఫ్యాన్లు, టీవీ, టేబుల్ వంటి వస్తువులు తమ చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది ►కొందరు రంగులరాట్నంలో తిరుగుతున్న అనుభూతి పొందుతారు. వర్టిగో ప్రధానంగా రెండు విధాలు... 1. పెరిఫెరల్ వర్టిగో 2. సెంట్రల్ వర్టిగో పెరిఫెరల్ వర్టిగో ఇది అంత ప్రమాదకరం కాదు. అయితే... దీన్లో కళ్లు తిరగడం తాలూకు తీవ్రత చాలా ఎక్కువ. ఒక్కోసారి దీనివల్ల తన ప్రాణం పోతుందేమో అన్నంతగా రోగి భయపడతాడు. చెవి లోపలి భాగం (ఇన్నర్ ఇయర్) నుంచి మెదడుకు సంకేతాలు చేరవేసే నరానికి దెబ్బ తగిలినా, దానికి ఇన్ఫెక్షన్ కలిగినా ఈ పెరిఫరల్ వర్టిగో కనిపించే అవకాశం ఉంది. లోపలి చెవిలో ఉండే భాగాన్ని ల్యాబిరింథ్ అంటారు. దీనికి ఏమాత్రం దెబ్బతగిలినా ఇలాంటి సమస్యే వస్తుంది. దాన్ని ‘ల్యాబిరింథైటిస్’ అంటారు. ఇక లోపలి చెవి నుంచి మెదడును కనెక్ట్ చేసే నరాన్ని వెస్టిబ్యులార్ నర్వ్ అంటారు. ఒకవేళ నరానికి ఏదైనా దెబ్బతగిలి ఇలాంటి అనుభూతి కలిగితే దాన్ని ‘న్యూరోనైటిస్’ అంటారు. లోపలి చెవిలో ఒకరకమైన ద్రవపదార్థం ఉంటుంది. ఒక్కోసారి ఆ ద్రవంలో ఏవైనా పార్టికల్స్ వచ్చినా పెరిఫెరల్ వర్టిగో కనిపిస్తుంది. దీన్నే ‘బినైన్ పొజీషనల్ వర్టిగో’ అని అంటారు. టినిటస్: కొందరిలో కళ్లు తిరిగే లక్షణంతో పాటు చెవిలో గుయ్... మనే శబ్దం వినిపిస్తుంది. పెరిఫెరల్ వర్టిగో చికిత్సనే ఈ సమస్యలోనూ తీసుకుంటే తగ్గిపోతుంది. సెంట్రల్ వర్టిగో... పెరిఫెరల్ వర్టిగోతో పోలిస్తే ఈ సెంట్రల్ వర్టిగో ఒకింత ప్రమాదకరం. అయితే సెంట్రల్ వర్టిగోలో కళ్లు తిరిగే తీవ్రత మాత్రం పెరిఫెరల్ వర్టిగోతో పోలిస్తే కాస్తంత తక్కువ. మెదడు లోపలి భాగాన్ని బ్రెయిన్ స్టెమ్ అంటారు. ఈ బ్రెయిన్ స్టెమ్‌కు రక్తప్రసరణ తగ్గినందువల్ల ‘సెంట్రల్ వర్టిగో’ వస్తుంది. సాధారణ ప్రజలకు ఏది పెరిఫెరల్ వర్టిగో, ఏది సెంట్రల్ వర్టిగో అని గుర్తుపట్టడం కష్టమే. అయినా కొన్ని లక్షణాలతో గుర్తుపట్టేందుకు అవకాశం ఉంది. చికిత్స: సమయానికి చికిత్స తీసుకుంటే వర్టిగో పూర్తిగా తగ్గుతుంది. జలుబు, ఇన్ఫెక్షన్ వంటివి వచ్చినప్పుడు అవి తగ్గేలా జాగ్రత్త తీసుకోవాలి. రోగికి కనిపించే వర్టిగోను డాక్టర్లు ‘సెంట్రల్ వర్టిగో’ అని భావిస్తే వెంటనే సీటీస్కాన్, ఎమ్మారై బ్రెయిన్, ఎమ్మార్ యాంజియో బ్రెయిన్ అనే పరీక్షలు చేసి బ్రెయిన్ స్టెమ్‌లో ఎక్కడ డ్యామేజీ ఉందో తెలుసుకుని వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. ►బ్యాలెన్స్‌ను మెరుగుపరిచే వ్యాయామాలు ►మాన్యువర్స్ ►ట్యూమర్స్ వంటివి ఉన్నప్పుడు శస్త్రచికిత్స ►మెడికల్ మేనేజ్మెంట్ ►కొన్ని సందర్భాల్లో మందులు వాడితే తగ్గిపోతుంది. వర్టిగోను నివారించుకోండిలా... ►సాధారణంగా బీపీ, షుగర్ ఉన్న వాళ్లలో సెంట్రల్ వర్టిగో వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. బీపీని క్రమం తప్పకుండా చెక్ చేయించుకొని, అదుపులో పెట్టుకోవాలి. శరీరంలో చక్కెర మోతాదులను క్రమం తప్పకుండా చెక్ చేయించుకుని పరగడుపు 100– భోజనం తర్వాత 160 కంటే ఎక్కువ ఉంటే తక్షణం డాక్టర్‌ను కలిసి దాన్ని అదుపులో ఉంచుకోడానికి మందులు తీసుకోవాలి. ►పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే సెంట్రల్ వర్టిగో వచ్చేందుకు అవకాశాలెక్కువ. అందుకే ఆ అలవాట్లుంటే వాటిని తక్షణం మానేయాలి. ►జీవన విధానాల్లో మార్పులు (లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్) చేసుకుని ఆరోగ్యకరమైన అలవాట్లను కలిగి ఉండాలి. రోజూ క్రమం తప్పకుండా నడక, వ్యాయామం చేయాలి. ►శరీరంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లు పాలు, మీగడ, వెన్న, నెయ్యి, స్వీట్స్ వంటి చాలా పరిమితంగా తీసుకోవాలి. ►ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ తాజా పళ్లు తినాలి. కారణాలు ►బినైన్ పొజిషనల్ ప్రాక్సిమల్ వర్టిగో. మీనియర్స్ డిసీజ్, మైగ్రేన్ వర్టిగో, తలకు గాయం కావడం కొన్ని మందులు వాడటం (ఓటో టాక్సిసిటీ)వల్ల, వెస్టిబ్యులార్ నరంలో ట్యూమర్లు, పక్షవాతం సెంట్రల్ వర్టిగోను ఇలా గుర్తుపట్టవచ్చు... ►కళ్లు తిరగడంతోపాటు మాట తడబడటం ►మింగడం కష్టం కావడం ఒకే వస్తువు రెండుగా కనిపించడం ►చూపు మసకబారడం ►మూతి వంకరపోవడం ►కాళ్లూ, చేతులు చచ్చుపడినట్లు అనిపించడం... ఇలాంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని సెంట్రల్ వర్టిగోగా గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. డాక్టర్ ఇ.సి. వినయ కుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఎయిమ్స్‌లో అటల్జీ
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, 93ఏళ్ల అటల్ బిహారీ వాజ్‌పేయి సోమవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయిని వైద్యుల సలహాతో వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్(ఆలిండియా ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లోని అత్యవసర చికిత్సావిభాగం(ఐసీయూ)లో చేర్పించారు. సాధారణ చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నా.. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, మూత్రనాళ ఇన్ఫెక్షన్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో తీసుకురాగానే డయాలసిస్ చేసిన వైద్యులు తర్వాత ఇన్ఫెక్షన్కు చికిత్సనందిస్తున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం వాజ్‌పేయి ఆరోగ్య బాధ్యతలను చూస్తోంది. ‘ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయన శరీరం వైద్యానికి స్పందిస్తోంది’ అని సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యులు తెలిపారు. పరామర్శించిన ప్రముఖులు 1984 నుంచి వాజ్‌పేయి ఒకే కిడ్నీతో పనిచేస్తుండగా ఇప్పుడు ఆ కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ సోకడంతోనే డయాలిసిస్ చేస్తున్నారు. గులేరియా మూడుదశాబ్దాల పాటు వాజ్‌పేయికి వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించారు. ఇప్పుడూ ఆయన నేతృత్వంలోనే వైద్యులు చికిత్సచేస్తున్నారు. ఆసుపత్రిలో వాజ్‌పేయిని ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, ఎంఎం జోషి, పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, హర్షవర్ధన్, పలువురు బీజేపీ ప్రముఖులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తదితరులు పరామర్శించారు. ‘మా అందరికీ స్ఫూర్తిప్రదాత అయిన వాజ్‌పేయీజీ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం’ అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. దాదాపు 50 నిమిషాల సేపు ఆసుపత్రిలో ఉన్న ప్రధాని మోదీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెల్సుకున్నారు. కుటుంబ సభ్యులతోనూ మోదీ మాట్లాడారు. అడ్వాణీ రాత్రి 9 గంటలకు తన దీర్ఘకాల సహచరుడిని చూసేందుకు ఎయిమ్స్ వచ్చారు. ఈ సందర్భంగా అడ్వాణీ కాస్త ఉద్విగ్నతకు లోనైనట్లు సమాచారం. నేడో రేపో డిశ్చార్జ్? ‘వాజ్‌పేయి ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ఉన్నతస్థాయి వైద్యబృందం ఆయనకు చికిత్సనందిస్తోంది. డాక్టర్ల సూచన మేరకు ఆయనను పర్యవేక్షణలో ఉంచారు. మంగళవారం ఉదయం వాజ్‌పేయిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది’ అని కేంద్ర మంత్రి విజయ్ గోయల్ వెల్లడించారు. పరామర్శించేందుకు ప్రముఖులు వస్తుండటంతో ఎయిమ్స్‌తోపాటు చుట్టుపక్క ప్రాంతాల్లో భద్రత పెంచారు. వాజ్‌పేయి ఆరోగ్యం బాగానే ఉందని బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. 1998–2004 వరకు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి.. 2009 తర్వాత ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ప్రజాజీవితానికి దూరంగా ఉన్నారు. అప్పటినుంచీ ఆయన ఢిల్లీలోని తన నివాసంలో చికిత్స పొందుతున్నారు. ఐదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న తొలి కాంగ్రెసేతర నేతగా వాజ్‌పేయి రికార్డు సృష్టించారు. ఎయిమ్స్‌లో మోదీకి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్న వాజ్‌పేయి బంధువు -
స్కాల్ప్ అంటే...?
మెడిక్షనరీ మనం మాడు భాగాన్ని ఇంగ్లిష్‌లో స్కాల్ప్ అని వ్యవహరిస్తుంటాం. ముక్కు, చెవి, నుదురులాగే అది కూడా ఆ భాగం పేరుగా చాలామంది అనుకుంటుంటారు. నిజానికి స్కాల్ప్ అనేది ఒక పదం కాదు. ఇంగ్లిష్‌లో ఐదుపదాల ముందు అక్షరాలను తీసుకొని ‘స్కాల్ప్’ అనే పదాన్ని రూపొందించారు. దీని స్పెల్లింగ్‌లోని ఐదు ఇంగ్లిష్ అక్షరాలూ ఇలా ఉంటాయి. ఎస్ అంటే స్కిన్ అనీ, సీ అంటే కనెక్టివ్ టిష్యూ అనీ, ఏ అంటే ఎపోన్యూరోటికా అనీ, ఎల్ అంటే లూజ్ ఏరియోలా అనీ, పీ అంటే పెరియాస్టియమ్ అనే మాటలను సూచిస్తాయి. ఇందులో మొదటిదైన స్కిన్ అంటే చర్మం నుంచి మొదలై పి అంటే పెరియాస్టియమ్ అనే పుర్రె ఎముక భాగం వరకు వరసగా ఉండే పొరలకు ఉన్న పేర్ల తాలూకు ఇంగ్లిష్ అక్షరాలతో స్కాల్ అనే పదాన్ని రూపొందించారు. -
బ్రాహ్మణికి బాబు పరామర్శ
బంజారాహిల్స్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి స్వల్ప అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈమేరకు బుధవారం ఉదయం చంద్రబాబు, బాలకృష్ణ ఆస్పత్రికి వచ్చి ఆమెను పరామర్శించారు. మంగళవారం ఉదయం మదీనాగూడ ఫామ్‌హౌస్‌లోని చంద్రబాబు నివాసంలో బ్రాహ్మణి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. నీరసించడం వల్ల కళ్లు తిరిగి కింద పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి చంద్రబాబు అసెంబ్లీ నుంచి నేరుగా అపోలోకు వచ్చి కోడలిని పరామర్శించారు. బుధవారం మళ్లీ ఆస్పత్రికి వచ్చిన ఆయన గంటసేపు అక్కడే గడిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. బ్రాహ్మణికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, గురువారం డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. -
డీవీ సుబ్బారావుకు అస్వస్థత
విశాఖపట్నం లీగల్ : ప్రముఖ న్యాయవాది, నగర మాజీ మేయర్,మాజీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా ఛైర్మన్ డి.వి.సుబ్బారావు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఆయన్ను కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని కేర్ హాస్పటల్లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. డీవీ గత కొంత కాలంగా శ్వాసకోశకు సంబంధించిన వ్యాధితో భాద పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం చికిత్స తీసుకున్నారు. సుబ్బారావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు న్యాయవాదులు,అభిమానులు హాస్పటల్ వద్దకు చేరుకున్నారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని సుబ్బారావు తనయుడు తెలిపారు. -
ఆరోగ్యంగానే ఉన్నా: దిలీప్‌కుమార్
ముంబై: తనకు అస్వస్థత అంటూ వస్తున్న వార్తలన్నీ వదంతులేనని బాలీవుడ్ దిగ్గజం దిలీప్‌కుమార్ (91) కొట్టిపారేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ సోషల్ సైట్స్‌లో ఊహాగానాలు హల్చల్ చేశాయి. దీంతో అజ్ఞాతం వీడిన దిలీప్...తన క్షేమం, ఆరోగ్యం కోరుకుంటున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై మౌత్‌షట్ డాట్ కామ్‌లో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కాగా, అమితాబ్ బచ్చన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. -
తల తిరగడం సమస్యతో బాధపడుతున్నారా?
జాగ్రత్త తల తిరగడం అనే సమస్య దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో అనుభవంలోకి వచ్చి ఉంటుంది. తల తిరగడానికి వర్టిగో, స్వల్ప తలనొప్పి, తల బరువు వంటి అనేక కారణాలుంటాయి. కారణం ఏదైనా సరే, తల తిరుగుతున్నప్పుడు వెంటనే ఏం చేయాలో చూద్దాం. తల తిరుగుతున్నట్లు అనిపించగానే ఉన్న చోటనే కూర్చోవాలి. కొంచెం నెమ్మదించిన తర్వాత తలను వలయాకారంగా తిప్పుతూ వ్యాయామం (నెక్ ఎక్సర్సైజ్) చేయాలి. ఈ వ్యాయామం ఎలాగంటే... తలను సవ్యదిశలో మూడుసార్లు, అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పాలి. కళ్లను కూడా సవ్యదిశలో, అపసవ్య దిశలో తిప్పాలి. ఇలా నాలుగైదు సార్లు చేసిన తర్వాత కళ్లను అరచేతులతో (వెలుతురు కళ్ల మీద ప్రసరించకుండా) ఒక నిమిషం పాటు మూసుకోవాలి. వాహనాన్ని నడుపుతున్నప్పుడు తల తిరిగినట్లనిపిస్తే తక్షణమే వాహనాన్ని పక్కకు తీసుకుని ఆపేయాలి. ఆ తర్వాత పైన చెప్పిన వ్యాయామాన్ని చేసి నెమ్మదించిన తర్వాత తిరిగి వాహనాన్ని నడపవచ్చు. తిరగడం తీవ్రంగా ఉంటే ఎవరినైనా సహాయానికి పిలుచుకుని డాక్టరును సంప్రదించాలి. తల తిరిగే సమస్య ఉన్నట్లుండి ఎప్పుడైనా కనిపించవచ్చు. కాబట్టి ఒకసారి ఈ లక్షణం అనుభవంలోకి వచ్చిన మధ్యవయస్కులు వ్యాయామం కోసం నడిచేటప్పుడు వాకింగ్ స్టిక్‌ను దగ్గరుంచుకోవాలి. తల తిరిగినప్పుడు కాఫీ, ఆల్కహాలు తీసుకోకూడదు. ఇవి పరిస్థితిని మరింత విషమింపచేస్తాయి.