DMC
-
ఏసీబీకి చిక్కిన మెప్మా డీఎంసీ
ఖమ్మంటౌన్: ఖమ్మం జిల్లా మెప్మా డీఎంసీ(డిస్ట్రిక్ట్ మెషిన్ కోఆర్డినేటర్) మన్నేపల్లి కమలశ్రీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కింది. మెప్మా రిసోర్స్ పర్సన్ (ఆర్పీ) నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం నగరంలోని మెప్మా కార్యాలయంలో తన సీటు వద్దనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. గత కొన్ని సంవత్సరాలుగా డీఎంసీపై అవినీతి, అక్రమాల ఆరోపణలు వస్తున్నాయి. ఆమె ఆగడాలు హెచ్చుమీరడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. నగరంలోని గొల్లగూడెం శాంతి సమాఖ్య సంఘానికి చెందిన ధనలక్ష్మి రిసోర్స్ పర్సన్‌గా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుండగా..ఆమె విద్యార్హత విషయంలో సదరు అధికారి లంచం డిమాండ్ చేయడంతో..విసిగి వేసారి ఏసీబీకి పట్టించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్పీలకు నెలకు రూ.4 వేలు గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించగా..కనీస విద్యార్హత పదో తరగతి చేసింది. ఈ క్రమంలో కొందరు ఆ మేరకు సర్టిఫికెట్లు లేనివారుండగా..ధనలక్ష్మి పదో తరగతి పాస్ కాకపోవడంతో గత కొంత కాలంగా ఆర్పీగా విధుల నుంచి తొలగిస్తానంటూ డీఎంసీ బెదిరింపులకు పాల్పడుతోంది. అయితే ప్రస్తుతం పనిచేసే వారికి టెన్త్ పూర్తి చేయాడానికి కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ రూ.60 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆర్పీ ధనలక్ష్మి మరోమారు వెళ్లి డీఎంసీ కమలశ్రీని కలిసి బతిమాలడంతో రూ.50వేలు ఇవ్వాలని ఒప్పదం చేసుకున్నారు. అంత డబ్బు చెల్లించలేనని నిర్ణయించుకున్న ధనలక్ష్మి ఏసీబీ ఆధికారులను ఆశ్రయించింది. దీంతో వారి సూచనలతో గురువారం రూ.40 వేలను ముందస్తుగా తీసుకెళ్లిన ధనలక్ష్మి మరో ఆర్పీ ఉషతో కలసి వెళ్లి మెప్మా కార్యాలయంలో తన సీట్లో కూర్చొని ఉన్న డీఎంసీ కమలశ్రీకి డబ్బు అందజేశారు. అదే సమయంలో ఏసీబీ నల్లగొండ రేంజ్ ఇన్చార్జ్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలోని బృందం ఆకస్మిక దాడి నిర్వహించి..కమలశ్రీ టేబుల్ సొరుగులో ఉన్న రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆమె చేతివేళ్ల అచ్చులను సేకరించారు. మెప్మాలోని పలు అంశాలపై ఏసీబీ ఆధికారులు కమలశ్రీని ప్రశ్నించారు. అనంతరం ఆమెను వీడీవోస్ కాలనీలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి తరలించారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం.. మెప్మా డీఎంసీ కమలశ్రీపై ఆర్పీ ధనలక్ష్మి మాకు ఈ నెల 6న ఫిర్యాదు చేసింది. ఆర్పీ ఉద్యోగంలో కొన సాగలంటే రూ.50 వేలు చెల్లించాల్సిందేనని వేధిస్తోం దని బాధితురాలు మా వద్దకు వచ్చి సంప్రదించింది. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఏవరైనా లంచం అడిగితే సమాచారం అందించండి. కమలశ్రీ 2007 నుంచి మెప్మాలో ఉద్యోగం చేస్తోంది. 12 సంవత్సరాలుగా ఆమె పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బినామీల పేరుతో ఆస్తులు కూడపెట్టినట్లు కూడా ఏసీబీ ఆధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇటీవల రూ.15లక్షలతో కొత్త కారును కూడా కొనుగోలు చేసిన దానిపై కూడా విచారణ జరుపుతాం. – ఆనంద్‌కుమార్, ఏసీబీ డీఎస్పీ, నల్లగొండ రేంజ్ -
ఆ టీవీ చానెల్‌కు మరో షాక్!
న్యూఢిల్లీ: అసత్యాలతో కూడిన విద్వేషపూరిత కథనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారంటూ ఓ ప్రఖ్యాత టీవీ చానెల్‌కు నోటీసులు జారీ అయ్యాయి. దేశరాజధాని ఢిల్లీలోని బవానా పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తోన్న భారతీయులను.. రోహింగ్యాలు, బంగ్లాదేశీలుగా పేర్కొంటూ ఆ చానెల్ ఒక కథనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. దానిపై ఢిల్లీ మైనారిటీస్ కమిషన్(డీఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయుల జాతీయతను కించపరిచేలా సాగిన కథనంపై తక్షణమే క్షమాపణలు చెప్పాల్సిందిగా చానెల్‌కు నోటీసులు ఇచ్చింది. ఆది నుంచీ వివాదాలే: నోయిడా కేంద్రంగా 2007 నుంచి పనిచేస్తోన్న హిందీ న్యూస్ చానెల్ ‘సుదర్శన్ న్యూస్’... ఆది నుంచీ వివాదాలకు కేంద్రంగా ఉంటూవస్తోంది. మొన్న మే11న బవానా ప్రాంత వాసులపై ఆ చానెల్ చేసిన ప్రోగ్రామ్‌లో స్థానికులను విదేశీయులుగా పేర్కొంది. ఇరువర్గాల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా టీవీ ప్రసారాలు చేశారన్న ఆరోపణలపై సుదర్శన్ న్యూస్ ఎండీ, ఎడిటర్ ఇన్ చీఫ్ సురేశ్ చౌహంకేను గతేడాది సంభల్(ఉత్తరప్రదేశ్) పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందే అతనిపై అత్యాచారం, హత్యాయత్నం కేసులున్నాయి. తన చానెల్లోనే పనిచేసిన ఉద్యోగినిపై చౌహంకే అత్యాచారయత్నం చేశాడని 2016లో నోయిడా పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. జూన్ 12లోగా స్పందించకుంటే..: ఢిల్లీలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో నిర్వాసితులుగా మారిన చాలా మందికి ప్రభుత్వమే బవానా ప్రాంతంలో పునరావాసం కల్పించిందని, అలాంటివారిని విదేశీయులుగా పేర్కొనడం గర్హనీయమని డీఎంసీ చైర్మన్ జాఫరుల్ ఇస్లామ్ ఖాన్ అన్నారు. అనుచిత ప్రసారాలపై సుదర్శన్ న్యూస్ జూన్ 12లోగా స్పందించి, క్షమాపణలు చెప్పడంతోపాటు సంబంధిత వీడియోలను తొలగించాలని, లేకుంటే తీవ్రచర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. చానెల్ ప్రసారాలపై దర్యాప్తు చేయాల్సిందిగా ఢిల్లీ నార్త్‌జోన్ పోలీసులను కూడా ఆదేశించినట్లు ఖాన్ తెలిపారు. -
డీఎంసీ సభ్యుల నియామకంపై హైకోర్టు స్టే
న్యూఢిల్లీ: ఢిల్లీ మెడికల్ కౌన్సిల్(డీఎంసీ) సభ్యుల నియామకాలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. వివరాలు.. కౌన్సిల్ పదవీ కాలం గతేడాది డిసెంబర్లో ముగియబోతుండటంతో నవంబర్ నెలలోనే ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉండటంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ నలుగురు డాక్టర్లను కౌన్సిల్‌కి నామినేట్ చేశారు. అప్పుడు నామినేట్ అయిన వారిలో అంబరీష్ మిథల్(ఎండోక్రినోలజిస్టు వైద్యుడు), మనోజ్ కె.సింగ్(ఎయిమ్స్ ప్రొఫెసర్), వినయ్ అగర్వాల్(ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు), రవి మాలిక్(పిడియాట్రిషన్) ఉన్నారు. అయితే, తాజాగా ప్రభుత్వం 22 మంది డాక్టర్లను డీఎంసీ సభ్యులుగా నియమిస్తూ మార్చి 13న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జాబితాలో అంతకు ముందు నామినేట్ అయిన నలుగురి పేర్లు లేవు. దీంతో వారిలో ఇద్దరు ఈ నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిని జస్టిస్ రాజీవ్ విచారించారు. ‘ఒకసారి కౌన్సిల్‌కి నామినేట్, ఎన్నికైన సభ్యులను ఈ విధంగా తొలగించడానికి వీలు లేదు. కౌన్సిల్ సభ్యునిగా ఉండటానికి అతను అనర్హుడు అయితేనే తొలగించాల్సి ఉంటుంది’ అని వినయ్ అగర్వాల్ తరఫు న్యాయవాది సందీప్ సేతి కోర్టులో వాదించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ అంశాన్ని విచారించాల్సిన అవసరముందని చెప్పారు. తదుపరి విచారణ వరకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టే ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేశారు. -
మెట్రోరైలుకు మరింత రద్దీ
న్యూఢిల్లీ: నిత్యం కిక్కిరిసి కనిపించే ఢిల్లీ మెట్రో యె ల్లోలైన్కు 2016 నాటికి మరింత రద్దీ పెరుగుతుం దని భావిస్తున్నారు. జహంగీర్‌పురి నుంచి హుడా సిటీసెంటర్ వరకు నిర్మించిన మార్గాన్ని యెల్లోలైన్ గా పిలుస్తారు. 2016 నాటికి ఈ మార్గంలో నిత్యం లక్ష మంది ప్రయాణిస్తారని డీఎంఆర్సీ అంచనా. సెంట్రల్ సెక్రటేరియట్-బాదర్పూర్మార్గంలో ప్రస్తుతం రోజుకు రెండు లక్షల మంది ప్రయాణిస్తుండగా, 2016 నాటికి ఇది 3.2 లక్షల మందికి చేరుకునే అవకాశముంది. అయితే బ్లూలైన్గా పిలిచే ద్వారక సెక్టార్ 21-నోయిడా/వైశాలి కారిడార్‌లో రద్దీగా పెద్దగా పెరగకపోవచ్చని అంటున్నారు. ఢిల్లీ మెట్రో ప్రయాణికుల్లో యెల్లో, బ్లూ కారిడార్లలోనే 50 శాతం మంది ఉంటారని అంచనా. రద్దీని తట్టుకోవడానికి ఈ రెండు కారిడార్లలో సేవలందించే మెట్రో రైళ్లకు అదనంగా బోగీలు జతచేస్తారు. ‘2016 వరకు దాదాపు అదనంగా వెయ్యి బోగీలను మెట్రోరైళ్లకు చేరుస్తాం. అప్పటి వరరకు మెట్రో మూడోదశలోని మూడు కారిడార్లు ప్రారంభమవుతాయి కాబట్టి బ్లూ, యెల్లో లైన్లపై భారం తగ్గుతుంది’ అని డీఎంఆర్సీ అధికార ప్రతినిధి అనుజ్ దయాళ్ అన్నారు. డీఎంఆర్సీ గణాంకాల ప్రకారం యెల్లోలైన్లో 60 రైళ్లు సేవలు అందిస్తుండగా, వీటిలో 33 రైళ్లకు ఎనిమిది చొప్పున, మిగతా వాటికి ఆరు చొప్పున బోగీలను అమర్చారు. బ్లూలైన్ కారిడార్‌లో 71 రైళ్లు ఉండగా, 25 రైళ్లకు ఎనిమిది బోగీలు, మిగతా వాటికి ఆరు బోగీల చొప్పున ఉన్నాయి. 2016 నాటికి రైళ్ల సంఖ్యను పెంచడానికి ప్రయత్నా లు జరుగుతున్నాయి. అప్పటి వరకు ప్రయాణికుల సంఖ్య లక్ష వరకు పెరిగే అవకాశం ఉండడంతో జహంగీర్‌పురి-హుడా సెంటర్ మార్గంలోని రైళ్లకు అదనంగా 52 కోచ్‌లను జతచేస్తారు. బ్లూలైన్‌లో అదనంగా మూడు రైళ్లను ప్రవేశపెట్టి మిగతా రైళ్లకు అదనంగా 74 కోచ్‌లను జతచేస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్-బాదర్పూర్ మార్గంలో అదనంగా 14 రైళ్లను ప్రవేశపెడతారు. ఈ మార్గంలో ప్రస్తుతం 30 రైళ్లు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించే మూడు కారి డార్ల వల్ల బ్లూలైన్పై రద్దీ మరింత తగ్గుతుం దని, ఫలితంగా రైళ్లు కూడా ఎక్కువ అవసరం ఉం డకపోవచ్చని దయాళ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న వాటిలో అప్పటి వరకు ఇంటర్చేంజ్ స్టేషను ్లగా మారుతాయి కాబట్టి అదనంగా రైళ్లు అవసరం లేదన్నారు. యెల్లోలైన్లో రద్దీని తట్టుకోవడానికి కొత్తగా మూడురైళ్లు అందుబాటులోకి తెస్తే చాలని భావిస్తున్నారు. ఈ లైన్లో చాలా రైళ్లకు ఎనిమిది బోగీల చొప్పున ఉన్నాయి. ఈలైన్లోని 63 రైళ్లలో 50 రైళ్లకు ఎనిమిది చొప్పున బోగీలు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీమెట్రోను నిత్యం 26 లక్షల మంది వినియోగిస్తుండగా, రాబోయే రెండేళ్లలో ఇది 39 లక్షలకు చేరుకుంటుందని అంచనా. కొత్తగా అందుబాటులోకి వచ్చే 7,8,10 కారిడా ర్లు దాదాపు 10 లక్షల మందికి సేవలు అంది స్తాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. బోగీ లను పెం చడం వల్ల ఇంటర్చేంజ్ స్టేషన్లు కూడా పెరిగి రద్దీ తగ్గుతుందని దయాళ్ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో 10 ఇంటర్చేంజ్ స్టేష న్లు ఉన్నాయి. వీటిలో రాజీవ్‌చౌక్, చాంది నీచౌక్ స్టేషన్లకు భారం అధికంగా ఉంటుంది. మెట్రోమూడోదశ పూర్తయితే కొత్తగా 14 ఇంటర్ చేంజ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి.