న్యూఢిల్లీ: నిత్యం కిక్కిరిసి కనిపించే ఢిల్లీ మెట్రో యె ల్లోలైన్‌కు 2016 నాటికి మరింత రద్దీ పెరుగుతుం దని భావిస్తున్నారు. జహంగీర్‌పురి నుంచి హుడా సిటీసెంటర్ వరకు నిర్మించిన మార్గాన్ని యెల్లోలైన్ గా పిలుస్తారు. 2016 నాటికి ఈ మార్గంలో నిత్యం లక్ష మంది ప్రయాణిస్తారని డీఎంఆర్సీ అంచనా. సెంట్రల్ సెక్రటేరియట్-బాదర్‌పూర్‌మార్గంలో ప్రస్తుతం రోజుకు రెండు లక్షల మంది ప్రయాణిస్తుండగా, 2016 నాటికి ఇది 3.2 లక్షల మందికి చేరుకునే అవకాశముంది. అయితే బ్లూలైన్‌గా పిలిచే ద్వారక సెక్టార్ 21-నోయిడా/వైశాలి కారిడార్‌లో రద్దీగా పెద్దగా పెరగకపోవచ్చని అంటున్నారు. ఢిల్లీ మెట్రో ప్రయాణికుల్లో యెల్లో, బ్లూ కారిడార్లలోనే 50 శాతం మంది ఉంటారని అంచనా. రద్దీని తట్టుకోవడానికి ఈ రెండు కారిడార్లలో సేవలందించే మెట్రో రైళ్లకు అదనంగా బోగీలు జతచేస్తారు. ‘2016 వరకు దాదాపు అదనంగా వెయ్యి బోగీలను మెట్రోరైళ్లకు చేరుస్తాం.
అప్పటి వరరకు మెట్రో మూడోదశలోని మూడు కారిడార్లు ప్రారంభమవుతాయి కాబట్టి బ్లూ, యెల్లో లైన్లపై భారం తగ్గుతుంది’ అని డీఎంఆర్సీ అధికార ప్రతినిధి అనుజ్ దయాళ్ అన్నారు. డీఎంఆర్సీ గణాంకాల ప్రకారం యెల్లోలైన్లో 60 రైళ్లు సేవలు అందిస్తుండగా, వీటిలో 33 రైళ్లకు ఎనిమిది చొప్పున, మిగతా వాటికి ఆరు చొప్పున బోగీలను అమర్చారు. బ్లూలైన్ కారిడార్‌లో 71 రైళ్లు ఉండగా, 25 రైళ్లకు ఎనిమిది బోగీలు, మిగతా వాటికి ఆరు బోగీల చొప్పున ఉన్నాయి. 2016 నాటికి రైళ్ల సంఖ్యను పెంచడానికి ప్రయత్నా లు జరుగుతున్నాయి. అప్పటి వరకు ప్రయాణికుల సంఖ్య లక్ష వరకు పెరిగే అవకాశం ఉండడంతో జహంగీర్‌పురి-హుడా సెంటర్ మార్గంలోని రైళ్లకు అదనంగా 52 కోచ్‌లను జతచేస్తారు. బ్లూలైన్‌లో అదనంగా మూడు రైళ్లను ప్రవేశపెట్టి మిగతా రైళ్లకు అదనంగా 74 కోచ్‌లను జతచేస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్-బాదర్‌పూర్ మార్గంలో అదనంగా 14 రైళ్లను ప్రవేశపెడతారు.
ఈ మార్గంలో ప్రస్తుతం 30 రైళ్లు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించే మూడు కారి డార్ల వల్ల బ్లూలైన్‌పై రద్దీ మరింత తగ్గుతుం దని, ఫలితంగా రైళ్లు కూడా ఎక్కువ అవసరం ఉం డకపోవచ్చని దయాళ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న వాటిలో అప్పటి వరకు ఇంటర్‌చేంజ్ స్టేషను ్లగా మారుతాయి కాబట్టి అదనంగా రైళ్లు అవసరం లేదన్నారు. యెల్లోలైన్‌లో రద్దీని తట్టుకోవడానికి కొత్తగా మూడురైళ్లు అందుబాటులోకి తెస్తే చాలని భావిస్తున్నారు. ఈ లైన్లో చాలా రైళ్లకు ఎనిమిది బోగీల చొప్పున ఉన్నాయి. ఈలైన్లోని 63 రైళ్లలో 50 రైళ్లకు ఎనిమిది చొప్పున బోగీలు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీమెట్రోను నిత్యం 26 లక్షల మంది వినియోగిస్తుండగా, రాబోయే రెండేళ్లలో ఇది 39 లక్షలకు చేరుకుంటుందని అంచనా.
కొత్తగా అందుబాటులోకి వచ్చే 7,8,10 కారిడా ర్లు దాదాపు 10 లక్షల మందికి సేవలు అంది స్తాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. బోగీ లను పెం చడం వల్ల ఇంటర్‌చేంజ్ స్టేషన్లు కూడా పెరిగి రద్దీ తగ్గుతుందని దయాళ్ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో 10 ఇంటర్‌చేంజ్ స్టేష న్లు ఉన్నాయి. వీటిలో రాజీవ్‌చౌక్, చాంది నీచౌక్ స్టేషన్లకు భారం అధికంగా ఉంటుంది. మెట్రోమూడోదశ పూర్తయితే కొత్తగా 14 ఇంటర్ చేంజ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి.
మెట్రోరైలుకు మరింత రద్దీ
Published Sun, Jul 27 2014 10:29 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
Advertisement
Advertisement