నగరంలో విద్యుత్ కొరత కారణంగా మెట్రోసేవలకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
నగరంలో విద్యుత్ కొరత కారణంగా మెట్రోసేవలకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. విద్యుత్ అంతరాయం వల్ల గురువారం మధ్యాహ్నం కీలకమైన బ్లూలైన్, మెట్రోలైన్‌లలో మెట్రోసేవలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ ట్రాన్స్‌కోలో విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో ప్రధాన స్టేషన్లయిన సుభాష్ నగర్, ద్వారక, ఛత్రపూర్, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ స్టేషన్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. ఏల్లో లైన్ గుర్గావ్‌లోని హుడా సిటీ సెంటర్, నార్త్ ఢిల్లీలోని సమయ్‌పూర్‌బద్లీలను అనుసంధానిస్తుంది. కీలకమైన బ్లూలైన్ పశ్చిమ ఢిల్లీలోని ద్వారకను ఉత్తరప్రదేశ్‌లోని వైశాలి, నోయిడా సిటీ సెంటర్‌తో అనుసంధానిస్తుంది. వేరే మార్గాల ద్వారా విద్యుత్ సమకూర్చుకున్న అనంతరం మెట్రోసేవలను యాథావిధిగా అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు.