DMK activists
-
ఐటీని వణికిస్తోన్న నీటి సంక్షోభం
సాక్షి, చెన్నై: చెన్నైలో రోజు రోజుకి పెరుగుతున నీటి సంక్షోభం అక్కడి ప్రజలతోపాటు ఐటీ సంస్థలను కూడా బెంబేలెత్తిపోతున్నాయి. నీటి సమస్యను తట్టుకోలేక కోన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచే పని చేయాలని కోరాయి. నీటి సమస్య తీవ్రతరం కావడం.. తమ కార్యాలయాల్లో కనీస అవసరాలకు కూడా నీళ్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగులకు ఐటీ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఐటీ కంపెనీలే కాదు.. చెన్నైలోని రెస్టారెంట్లు కూడా నీటి సంక్షోభంతో చేతెలెత్తేసే పరిస్థితి నెలకొంది. వినియోగదారులకు తగినంత నీటిని అందుబాటులో ఉంచలేక పలు రెస్టారెంట్లు కేవలం టిఫిన్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. నీరు అందుబాటులో లేకపోవడంతో భోజనం సదుపాయం కల్పించలేకపోతున్నామని చెప్తున్నాయి. అంతేకాకుండా రెస్టారెంట్లు పనిగంటలు కూడా గణనీయంగా తగ్గించాయి. దీంతో ప్రజలు, టూరిస్టులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నీటి సంక్షోభం మీద నివేదికను కోరినట్లు సమాచారం. నీటి సంక్షోభం వల్ల అనేక సంస్థలు మూసివేయబడ్డాయని, ఐటీ కంపెనీలయితే ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయించుకునే పరిస్థతికి దిగజారాయని, ఇవేవి పట్టించుకోకుండా అవినీతితో బిజీగా ఉన్న మున్సిపల్ మంత్రి వేలుమణి దీనికి సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఎస్పీ వేలుమణి రాజీనామా చేయాలని, లేదంటే ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామిని స్టాలిన్ డిమాండ్ చేశారు. -
స్టాలిన్ ఆందోళన.. కార్యకర్తలకు విజ్ఞప్తి
చెన్నై : ఓవైపు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని నేతలు, ఇతర రంగాల సెలబ్రిటీలు వీలు చిక్కినప్పుడు పరామర్శిస్తున్నారు. మరోవైపు తమ అభిమాన నేత కరుణ ఇంకా కోలుకోలేదన్న దిగులుతో చనిపోతున్న డీఎంకే కార్యకర్తల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడం పార్టీ వర్గాలను కలవరపరుస్తోంది. తన తండ్రి ఇంకా కోలుకోలేదన్న బాధతో మృతిచెందిన డీఎంకే అభిమానుల సంఖ్య బుధవారం నాటికి 21కి చేరుకుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్షనేత స్టాలిన్ తెలిపారు. డీఎంకే మద్దతుదారులు, అభిమానుల మృతి తనను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన తండ్రి కరుణ త్వరలోనే కోలుకుంటారని.. ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. చనిపోతున్న అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగి పోవడం తనను మరింతగా బాధిస్తోందని స్టాలిన్ పేర్కొన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని కూడా సూచించారు. కరుణ కోలుకోవాలంటూ కొందరు డీఎంకే కార్యకర్తలు అనేకచోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో విజయ్, తదితరులు కరుణానిధిని పరామర్శించిన వారిలో ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి కొద్దిరోజులుగా చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వృద్ధాప్య రుగ్మతలతో సతమతం అవుతున్న కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించడంతో గతనెల 28న ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. -
నాన్న బాగానే ఉన్నారు: కనిమొళి
సాక్షి, చెన్నై: నగరంలోని కావేరీ ఆస్పత్రి వద్ద మీడియా ప్రతినిధులు, డీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. డీఎంకే అధినేత ఎంకే కరుణానిధి తీవ్ర అస్వస్థతతో ఇదే ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత రాత్రి పరిస్థితి విషమించటంతో 94 ఏళ్ల కరుణానిధిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఉదయం ఆయన కుమార్తె కనిమొళి ఆస్పత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం నాన్న ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. బీపీ కంట్రోల్లోకి వచ్చింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతంగా తిరిగొస్తారు. మరికాసేపట్లో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని చెప్పారు’ అని కనిమొళి అన్నారు. ‘కరుణానిధి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నాం. వైద్యులతో చర్చించి మెరుగైన చికిత్సలు అందిచాలని కోరాం. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు’ అని తమిళనాడు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ భాస్కర్ తెలిపారు. పరామర్శల వెల్లువ... కాగా, కావేరి ఆస్పత్రికి వెళ్లిన తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్.. మాజీ సీఎం కరుణానిధిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, తనయుడు స్టాలిన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆర్కే నగర్ ఎమ్మెల్యే దినకరన్, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, సీనియర్ నటుడు ప్రభు, పాండిచ్చేరి మాజీ సీఎం రంగస్వామి తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. మరోవైపు సీఎం పళనిస్వామి కూడా వైద్యులను ఫోన్ చేసి పరిస్థితి ఆరా తీశారు. అసరమైతే ప్రభుత్వం తరపున మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన కోరారు. గుండెపోటుతో... కుటుంబ సభ్యులు, ముఖ్య నేతలు ధైర్యం చెబుతున్నప్పటికీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం ఇంకా ఆందోళన చెందుతూనే ఉన్నారు. కరుణానిధి అస్వస్థత వార్త తట్టుకోలేక డీఎంకే కార్యకర్త ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. మృతుడిని తిరువారూర్ ముత్తుపేటకు చెందిన తమీమ్‌గా గుర్తించారు. -
అభ్యర్థిని మార్చాలని ఆత్మహత్యాయత్నం
వేలూరు: వేలూరు జిల్లా జోలార్‌పేట డీఎంకే అభ్యర్థిని మార్పు చేయాలని కోరుతూ డీఎంకే కార్యకర్తలు ధర్నా, రాస్తారోకోతో పాటు ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేశారు. ఆనకట్టు నియోజక అభ్యర్థి నందకుమార్‌ను మార్పు చేయాలని బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు కార్యకర్తలు పలు పోరాటాలు చేశారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులను మార్పు చేయాలని కోరుతూ పలు పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వేలూరు జిల్లా జోలార్‌పేట నియోజక వర్గ అభ్యర్థిగా కవితా దండపాణిని ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు వెంటనే అభ్యర్థిని మార్పు చేయించాలని డిమాండ్ చేస్తూ నాట్రంబల్లిలోని డీఎంకే పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆందోన చేశారు. అనంతరం జాతీయ రహదారిలో రాస్తారోకో చేశారు. జోలార్‌పేట నియోజక వర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా మంత్రి కేసీ వీరమణి ఉన్నందున ఆయనకు దీటుగా స్థానికంగా ఉన్న వారికి డీఎంకేలో అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. వెంటనే కార్యకర్తలు మాజీ మంత్రి దురై మురుగన్, జిల్లా కార్యదర్శి దేవరాజ్‌ను ఖండిస్తూ నినాదాలు చేశారు. వెంటనే యూనియన్ కార్యదర్శి సూర్యకుమార్ ఆందోళన కారులతో చర్చలు జరిపి ఆందోళనను విరమింప జేశారు.ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ జోలార్‌పేట అభ్యర్థిని మార్పు చేయకుంటే నియోజక వర్గం వ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు నల్ల జెండాలు ఎగుర వేసి నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.