వైద్యకళాశాలల అధ్యాపకుల హాజరుపై నిఘా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది హాజరును ప్రతీ రోజు ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా డిజిటైషన్ ప్రక్రియను ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. బోధనా సిబ్బంది విషయంలో కళాశాలల మోసాన్ని బయటపెట్టడం, పారదర్శకత కోసం ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.
డిజిటల్ మిషన్ మోడ్ ప్రాజెక్టు(డీఎంఎంపీ)లో భాగంగా మొత్తం 439 వైద్య కళాశాలల్లో హాజరును బయోమెట్రిక్ వ్యవస్థతో ఎంసీఐ పర్యక్షిస్తుంది. ‘ఒక దేశం ఒక రిజిస్ట్రేషన్’ కింద డాక్టర్లకు ఎలక్ట్రానిక్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐటెంటిఫికేషన్(ఆర్ ఎఫ్ఐడీ) రిజిస్ట్రేషన్ కార్డులు ఐఎంసీఐ ఇవ్వనుంది. వీటి ద్వారా డాక్టర్ల కార్యకలాపాలను పర్యవేక్షించనుంది.