Doctor dead
-
సుప్రీం డెడ్‌లైన్ బేఖాతరు.. సమ్మె ఆపని బెంగాల్ డాక్ట్టర్లు
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా వైద్యుల సమ్మె కొనసాగుతోంది. వైద్యురాలి మృతికి కారకులపై చర్యలతో పాటు బాధ్యులైన కోల్‌కతా పోలీస్ కమిషనర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్య సేవల డైరెక్టర్, వైద్యవిద్య విభాగం డైరెక్టర్ రాజీనామా కోసం వారు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. వారిపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేయడం, మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరాలని ఆదేశించడం తెలిసిందే. దాన్ని వైద్యులు బేఖాతరు చేశారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల్లో చేరేది లేదన్నారు.నేటి విచారణకు హాజరు కండిబుధవారం ఎంక్వైరీ కమిటీ ముందు హాజరై నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సమ్మెలో పాల్గొంటున్న 51 మంది వైద్యులకు ఆర్జీ కర్ ఆస్పత్రి యాజమాన్యం నోటీసులిచ్చింది. హాజరు కాని వారిని సంస్థ ఆవరణలోకి అనుమతించబోమని, కళాశాల కార్యక్రమాల నుంచి కూడా దూరంగా ఉంచుతామని స్పష్టం చేసింది.చర్చల ఆహా్వనాన్ని తిరస్కరించిన జుడాలు సమ్మె విరణమ కోసం చర్చలకు రావాలని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పంపిన ఆహా్వనాన్ని జూనియర్ డాక్టర్లు మంగళవారం తిరస్కరించారు. ఆహా్వనంలో వాడిన భాష అభ్యంతరకమని పేర్కొన్నారు. ‘‘10 మందికి మించకుండా మీ చిన్న ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రతినిధులను కలవడానికి సచివాలయానికి రావొచ్చు’ అంటూ ఆరోగ్యశాఖ కార్యదర్శి వారికి మెయిల్ పంపారు. ‘‘ఈ భాష డాక్టర్లకు అవమానకరం. పైగా పరుషంగానూ ఉంది. అంతేగాక మేం రాజీనామా కోరుతున్న ఆరోగ్యశాఖ కార్యదర్శి ద్వారా పంపారు. ఇది మాకు అవమానమే. అందుకే దానికి స్పందించలేదు’’ అని జుడాల నేత డాక్టర్ దేబాశిష్ హల్దార్ అన్నారు. చర్చల నిమిత్తం జూడాల ప్రతినిధుల కోసం సీఎం మమత రాత్రి 7.30 దాకా సచివాలయంలో వేచిచూశారని మంత్రి చంద్రిమా భట్టాచార్య తెలిపారు.సందీప్ ఘోష్ కస్టడీ పొడిగింపుఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 23వరకు పొడిగించింది. ఆయన భద్రతాధికారి అఫ్సర్ అలీ, సన్నిహితులు బిప్లవ్ సిన్హా, సుమన్ హజ్రా కస్టడీని కూడా 23 వరకు పొడిగించింది.వైద్యురాలి మృతి ఉదంతంలో నిర్లక్ష్యంతో పాటు ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకల ఆరోపణలతో ఆయన్ను సీబీఐ అరెస్టు చేయడం తెలిసిందే. -
విజయవాడలో విషాదం.. డాక్టర్ ఘాతుకం.. కుటుంబ సభ్యుల్ని చంపి తానూ..
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడలోని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని.. ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు పోలీసులు. మృతుల్లో డాక్టర్ శ్రీనివాస్, ఆయన తల్లి, భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ల మృతికి కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన శ్రీనివాస్.. ఏడాది క్రితం శ్రీజ అనే ఆస్పత్రిని విజయవాడలో ప్రారంభించాడు. అయితే ఆ ఆస్పత్రి సరిగా నడవటం లేదు. దీంతో ఆయన డిప్రెషలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆస్పత్రిని రెండు నెలల కిందట మరొకరికి అప్పగించనట్లు తెలుస్తోంది.మంగళవారం ఉదయం గురునానక్ నగర్‌లోని ఇంట్లో శ్రీనివాస్ కుటుంబం విగత జీవిగా కనిపించింది. ఇంటి ఆవరణలో శ్రీనివాస్ మృతదేహాం కొయ్యకు వేలాడుతూ కనిపించింది. దీంతో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా? లేదంటే ఎవరైనా హత్య చేశారా?.. తాను ఆత్మహత్య చేసుకుని, అంతకు ముందు కుటుంబ సభ్యుల్ని శ్రీనివాస్ హత్య చేసి ఉంటాడా? అనే అనుమానాలు రేకెత్తాయి. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మృతులు డాక్టర్ శ్రీనివాస్ (40), ఉషారాణి (36), శైలజ (9), శ్రీహాన్(5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)ఘటనా స్థలాన్ని సీపీ రామకృష్ణ పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తనిఖీలు జరిపాయి. అయితే.. తన కారు తాళం తన అన్నకు ఇవ్వాలంటూ ఎదురింటి వాళ్ల పోస్ట్ బాక్స్‌లో డాక్టర్ శ్రీనివాస్ పేరిట ఒక లెటర్ దొరికింది. దీంతో ఇది సూసైడ్ కేసు అయ్యి ఉంటుందని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అర్ధరాత్రి టైంలో కుటుంబ సభ్యులను చంపి, తెల్లవారుజామున శ్రీనివాస్ తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా శ్రీనివాస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్థారించుకున్నారు.శ్రీనివాస్ చాలా సౌమ్యుడు.. ఎవరితోనూ విబేధాలు లేవు. సంవత్సరం క్రితం శ్రీజ హాస్పిటల్ పేరుతో సొంతంగా హాస్పటల్ ఏర్పాటు చేశాడు. కొంతకాలం హస్పటల్ సక్రమంగా నిర్వహించాడు.తరువాత హాస్పటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. హాస్పిటల్ నిర్వహణ కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్నాడు. కేవలం ఆర్థిక ఇబ్బందులు వల్లే చనిపోయాడని భావిస్తున్నాం. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నాం.:::సాక్షిటీవీతో డాక్టర్ శ్రీనివాస్ స్నేహితులు -
‘దేహానికి మాత్రమే చావు. ఆత్మకు కాదు’.. 36 గంటల్లోనే!
ముంబై: భారత్‌లో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షలాది కరోనా కేసులు నమోదవుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు ఫ్రంట్‌లైన్ వారియర్స్ కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికై రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతాల్లో లాక్డౌన్ విధించడం వంటి చర్యలు చేపడతున్నాయి. . దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉందని డాక్టర్లు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఫేస్బుక్లో పోస్ట్ చేసిన 36 గంటలకే కరోనా మృతి చెందిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబై కు చెందిన డాక్టరు మనీషా జాదవ్(51) కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడగా, ట్రీట్మెంట్ కోసం స్థానిక ఆసుపత్రిలో చేరింది. అంతకు ముందు ఆదివారం రోజున చికిత్స పొందుతున్న మనీషా ఫేస్బుక్లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. తను పోస్ట్‌లో ‘ ఇదే నా లాస్ట్ గూడ్ మార్నింగ్ కావొచ్చు. బహుశా మరోసారి మీఅందరినీ ఫేసుబుక్‌లో కలవకపోవచ్చు. అందరు జాగ్రత్తగా ఉండండి. దేహానికి మాత్రమే చావు. ఆత్మకు కాదు’ అంటూ రాసుకొచ్చింది. కాగా డాక్టర్ మనీషా ఫేస్బుక్లో పోస్ట్ చేసిన 36 గంటలకే సోమవారం రోజున మరణించింది. మనీషా స్థానికంగా ఉన్న టీబీ ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. కాగా సహచర వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు మనీషా మృతికి దిగ్బ్రాంతికి గురయ్యారు. అంతకుముందు ముంబైకు చెందిన డాక్టరు తృప్తి గిలాడా అందరినీ హెచ్చరిస్తూ కరోనా వైరస్ నుంచి జాగ్రత్తగా ఉండమనీ తెలిపిన వీడియో వైరలయిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 62,097 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 519 మంది కరోనాతో మరణించారు. చదవండి: పరిస్థితి చేయిదాటింది.. ప్లీజ్.. జాగ్రత్త: ఏడ్చేసిన డాక్టర్ -
దారుణం: అవనిగడ్డలో వైద్యుడి హత్య
సాక్షి, కృష్ణా: జిల్లాలోని అవనిగడ్డలో దారుణం చోటు చేసుకుంది. శనివారం ఓ ప్రముఖ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన ప్రముఖ వైద్యుడు కోట శ్రీహరిరావును గుర్తు తెలియని దుండగులు ఇంటిలోనే హతమార్చారు. బెడ్రూమ్లో రక్తపు మడుగులో పడి ఆయన మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా హంతకులు జాగ్రత్తపడ్డట్లు తెలుస్తోంది. శ్రీహరిరావు కుటుంబ సభ్యులు ఊరు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. చదవండి: సీఎం కార్యదర్శి ఆత్మహత్యాయత్నం -
'సాయం కోసం వేడుకున్నా వెళ్లిపోయింది'
ఆగ్రా: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. స్మృతి సాయం చేసి ఉంటే మా నాన్న బతికి ఉండేవారంటూ మృతిచెందిన వ్యక్తి కుమార్తె చెబుతున్నారు. క్షతగాత్రులకు సాయం అందిందంటూ స్మృతి ఆ రోజే ట్వీట్ చేసిన క్రమంలో తాజాగా బాధితుల వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రమాదంలో మరణించిన డాక్టర్ రమేష్ నాగర్ కుమార్తె శాందిలి మాట్లాడుతూ.. 'మంత్రి కారు తమ బైక్ ను ఢీకొట్టినప్పుడు మేము కింద పడిపోయాము. స్మృతి స్వల్పంగా దెబ్బ తిన్న తన కారు నుంచి దిగి మరో కారులో ఎక్కుతుండగా మేము ఆమెను సాయం చేయమని అడిగాము. కానీ ఆమె పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. మీకు తర్వాత సాయం చేస్తారంటూ అక్కడున్న సిబ్బంది చెప్పారు. ఆమె నిజంగా మాకు సాయం చేయాలని అనుకుని ఉంటే చేసి ఉండేది, ఇప్పుడు మా నాన్న మాతోనే ఉండేవారు' అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యింది. ఆమె సోదరుడు అభిషేక్ మాట్లాడుతూ... నా చెల్లెలు చేతులు జోడించి సాయం కోసం అర్థించినా మంత్రి పట్టించుకోలేదన్నారు. కాగా ప్రమాదానికి గురైన కారు మంత్రి కాన్వాయ్ లోనిది కాదంటూ స్మృతి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్రిందావన్‌లో తమ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి కారులో ఢిల్లీ వస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.