ముంబై: భారత్‌లో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షలాది కరోనా కేసులు నమోదవుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు ఫ్రంట్‌లైన్ వారియర్స్ కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికై రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతాల్లో లాక్‌డౌన్ విధించడం వంటి చర్యలు చేపడతున్నాయి. . దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉందని డాక్టర్లు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన 36 గంటలకే కరోనా మృతి చెందిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబై కు చెందిన డాక్టరు మనీషా జాదవ్(51) కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడగా, ట్రీట్‌మెంట్ కోసం స్థానిక ఆసుపత్రిలో చేరింది. అంతకు ముందు ఆదివారం రోజున చికిత్స పొందుతున్న మనీషా ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. తను పోస్ట్‌లో ‘ ఇదే నా లాస్ట్ గూడ్ మార్నింగ్ కావొచ్చు. బహుశా మరోసారి మీఅందరినీ ఫేసుబుక్‌లో కలవకపోవచ్చు. అందరు జాగ్రత్తగా ఉండండి. దేహానికి మాత్రమే చావు. ఆత్మకు కాదు’ అంటూ రాసుకొచ్చింది. కాగా డాక్టర్ మనీషా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన 36 గంటలకే సోమవారం రోజున మరణించింది. మనీషా స్థానికంగా ఉన్న టీబీ ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది.
కాగా సహచర వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు మనీషా మృతికి దిగ్బ్రాంతికి గురయ్యారు. అంతకుముందు ముంబైకు చెందిన డాక్టరు తృప్తి గిలాడా అందరినీ హెచ్చరిస్తూ కరోనా వైరస్ నుంచి జాగ్రత్తగా ఉండమనీ తెలిపిన వీడియో వైరలయిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 62,097 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 519 మంది కరోనాతో మరణించారు.
చదవండి: పరిస్థితి చేయిదాటింది.. ప్లీజ్.. జాగ్రత్త: ఏడ్చేసిన డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment