పోలియో అనుమానంతో చెన్నైకి చిన్నారి తరలింపు
ఆత్మకూరు, న్యూస్‌లైన్: పోలియో అనుమానంతో ఓ చిన్నారిని చెన్నైకి తరలించారు. ఈ ఘటన ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వెంకట్రావుపల్లికి చెందిన బాలంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి కుమారుడు జగన్‌కు ఒ కటిన్నర ఏడాది వయస్సు. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఆత్మకూరులోని ఓ ఆ స్పత్రిలో చికిత్స చేయించారు.
చికిత్స చేసిన మరుసటి రోజు నుంచి చిన్నారి కాళ్లలో కదలికలు ఆగిపోయాయి. దీంతో వారు నెల్లూరులోని పలు ఆస్పత్రుల్లో చూపించారు. అ యితే అక్కడ కూడా ఎలాంటి మార్పు రా లేదు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఇ మ్యూనైజేషన్ అధికారి జయసింహ వెంకట్రావుపల్లికి వచ్చి చిన్నారిని పరిశీలించారు. చిన్నారి మ లాన్ని పరీక్షించాల్సిందిగా వై ద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. అయితే ఆ ప రీక్ష చేసే అవకాశం కలగలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారుజామున చిన్నారి జగన్‌ను వైద్యపరీక్షల నిమిత్తం చెన్నైకి తరలించారు. మూడు రోజుల అనంతరం వైద్యపరీక్షల నివేదిక ఇస్తారని తెలుస్తోంది.
ప్రత్యేక పల్స్‌పోలియో కార్యక్రమం
మహిమలూరు పీహెచ్సీ వైద్యాధికారి పెంచలయ్య ఆధ్వర్యంలో శుక్రవారం వెంకట్రావుపల్లిలో ప్రత్యేక పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో మొత్తం 52 మం ది పోలియో చుక్కలకు అర్హులున్నట్లు గుర్తిం చారు. వీరిలో 36 మందికి పోలియోచుక్కలు వేశారు. మిగిలిన వారికి శనివారం వేస్తామని వైద్యాధికారి పెంచలయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సుధాకర్, హెల్త్ అసిస్టెంట్ చిన్నపునాయుడు, ఏఎన్ఎంలు రాఘవరాణి, లీలావతి, ధనమ్మ, ల్యా బ్టెక్నీషియన్ మాధవరావు, అంగన్వాడీ కార్యకర్త మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.