Doklam standoff
-
డోక్లాంలో చైనా గ్రామం.. ఖండించిన భూటాన్
న్యూఢిల్లీ : తమ భూభాగంలో చైనా ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసిందంటూ వస్తోన్న వార్తల్ని భూటాన్ ఖండించింది. అలాంటిది ఏం జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత భూటాన్ రాయబారి మేజర్ జనరల్ వెట్సాప్ నామ్‌గైల్ ‘మా భూభాగంలో చైనా గ్రామం ఏర్పాటు చేయడం వంటి చర్యలు ఏం జరగలేదు’ అని స్పష్టం చేశారు. ‘చైనా, భూటాన్ ప్రాదేశిక ప్రాంతంలోకి రెండు కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఓ గ్రామాన్ని ఏర్పాటుచేసింది’ అంటూ చైనాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ షెన్ షివే ట్వీట్ చేశారు. దీనిపై భారత్ భూటాన్ రాయబారి స్పందించారు. ‘నేను ఆ ట్వీట్‌ని చూశాను. ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ అది. ఇలాంటి ఊహాగానాల గురించి నేను పట్టించుకోను’ అన్నారు. ఇక చైనా తాజాగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంటున్న గ్రామం మూడేళ్ల కిందట భారత్-చైనా సైన్యాలు ఘర్షణ పడిన డోక్లామ్కి సమీపంలోనే ఉండటం గమనార్హం. చైనా మీడియా సీజీటీఎన్ న్యూస్‌లోని సీనియర్ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వహిస్తోన్న షెన్ షివే ట్విట్టర్లో ‘ఇప్పుడు కొత్తగా స్థాపించబడిన పాంగ్డా గ్రామంలో శాశ్వత నివాసితులు నివసిస్తున్నారు. ఇది యాడోంగ్ కౌంటీకి దక్షిణాన 35 కిలోమీటర్ల దూరంలో లోయ వెంబడి ఉంది. డోక్లాం ప్రాంతం పరిష్కారం తరువాత ఖచ్చితమైన స్థానాన్ని సూచించింది’ అంటూ దీనికి సంబంధించిన ఫోటోలని ట్వీట్ చేశారు. అయితే, తర్వాత దాన్ని తొలగించారు. షెన్ షివే చేసిన ట్వీట్‌ను భారత్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు రీట్వీట్ చేశారు. ‘భూటాన్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందనడానికి ఇదే సాక్ష్యం’ అని తెలిపారు. ‘భారత్-చైనాల మధ్య కొనసాగిన డోక్లాం వివాదాస్పద ప్రాంతానికి 9 కిలోమీటర్ల దూరంలో ఇది ఉందని చైనా జర్నలిస్ట్ షేర్ చేసిన మ్యాప్‌ను బట్టి అర్ధమవుతుంది’ అన్నారు. అంతేకాదు, భూటాన్ భూభాగంలో రెండు కిలోమీటర్ల చొచ్చుకొచ్చినట్టు తెలియజేస్తుందని పేర్కొన్నారు. (చదవండి: సరిహద్దులో చైనా కొత్త ఎత్తుగడ) చైనా ‘ఐదు వేళ్ల’ వ్యూహం సరిహద్దు భూభాగాలపై కన్నేసిన చైనా వాటిని ఆక్రమిచుకోవడానికి ‘ఐదు వేళ్ల’ వ్యూహాన్ని అమలు చేస్తోది. దానిలో భాగంగా టిబెట్‌ని కుడి చేతి అరచేయిగా భావించగా.. లద్దాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ప్రదేశ్లని ఐదు వేళ్లలాగా భావిస్తోంది. ఇక బీజింగ్ ‘సలామి స్లైసింగ్’ వ్యూహాన్ని తాజాగా నేపాల్‌లో అమలు చేసి చేసింది. దానిలో భాగాంగా నేపాల్ భూభాగాన్ని డ్రాగన్ దేశం ఆక్రమించినట్లు సమాచారం. న్యూఢిల్లీ-ఖట్మాండ్ల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన సమయంలో డ్రాగన్ ఈ దుశ్చర్యకు పూనుకున్నట్లు తెలిసింది. ఇక ఈ చర్యలని ఉద్దేశిస్తూ ‘మావో కలని నిజం చేయడానికి జిన్‌పింగ్ కృషి చేస్తున్నాడని’ చైనా మీడియా ప్రశంసిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే భారత్ 17,000 అడుగుల ఎత్తులో లిపులేఖ్ ప్రాంతంలో రహదారి నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. దీని వల్ల కైలాస్ మానససరోవర యాత్రికులకు ప్రయాణ సమయం కలిసి వస్తుంది. (చదవండి: తప్పు ఒప్పుకున్న ట్విట్టర్ ) -
అక్కడ పర్యటించకండి
బీజింగ్ : భారత్‌తో సరిహద్దు వివాదానికి ఆజ్యం పోసేలా మళ్లీ డోక్లాంకు పది కిలోమీటర్ల దగ్గర్లో రహదారి నిర్మిస్తున్న చైనా.. తాజాగా భారత్‌లో పర్యటించే తమ దేశస్తులకు ట్రావెల్ వార్నింగ్ జారీ చేసింది. ప్రతి ఏడాది భారత్‌లో గణనీయంగా చైనీయులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మళ్లీ డోక్లాం వద్ద రహదారి నిర్మిస్తున్న నేపథ్యంలోనూ, అంతర్జాతీయ మారుతున్న సమీకరణలను దృష్టిలో పెట్టుకుని భారత్‌లోని కొన్ని ప్రాంతాలు, ప్రదేశాలకు వెళ్లవద్దంటూ చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌లోని అండమాన్, నికోబార్‌దీవుల్లో చైనీయులు పర్యటించడం ప్రమాదరమంటూ.. చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్‌లో పర్యటిస్తున్న చైనీయులు తగిన అనుమతి పత్రాలతోనే పర్యటించాలని సూచించింది. అంతేకాక మిలటరీ వాహనాలు, సరిహద్దు బద్రతా బలగాలు, ఇతర రక్షణ, పోలీసుల వ్యవస్థలను ఫోటొలు, వీడియోలు తీయవద్దంటూ తెలిపింది. అంతేకాక భారత్-నేపాల్ పరిహద్దులోనూ పర్యటించడం మానుకోవాలని సూచనలు చేసింది. జూలై 7న డోక్లామ్ వివాదం మొదలైన తరువాత చైనా తొలిసారి తమ పర్యాటకులకు హెచ్చరికలు చేసింది. తరువాత మళ్లీ తాజాగా చైనా ప్రభుత్వం హెచ్చరించింది. భారత్‌ను చూసేందుకు చైనా నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. వారికి వీసా ఇబ్బందులు తలెత్తకుండా భారత ప్రభుత్వం.. ఈ-వీసా సదుపాయాన్ని గతంలో అందించించడం గమనార్హం. -
భారత్‌ను బెదరగొట్టేందుకే చైనా..
డోక్లాం ప్రతిష్టంభన.. చైనా సైనిక విన్యాసాలు చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) గతవారం సైనిక యుద్ధవిన్యాసాలు నిర్వహించినట్టు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ దినపత్రిక పేర్కొంది. ప్రత్యక్ష సైనిక యుద్ధ సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన ఈ విన్యాసాల్లో ఆర్మీ ట్యాంకులను, హెలికాప్టర్లను ఉపయోగించినట్టు పేర్కొంది. వైమానిక దళాలు, సాయుధ బలగాలతో కూడిన 10 పీఎల్ఏ యూనిట్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయని యుద్ధోన్మాద వ్యాఖ్యలు చేసే గ్లోబల్ టైమ్స్ తెలిపింది. సరిహద్దుల్లోని డోక్లాం ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ విన్యాసాలు నిర్వహించినట్టు తెలిపింది. పీఎల్ఏకు చెందిన వెస్టర్న్ థియేటర్ కమాండ్ ఈ విన్యాసాలు నిర్వహించిందని పేర్కొంది. అయితే, ఏ ప్రాంతంలో నిర్వహించిందో తెలుపలేదు. భారత్‌తో ఉన్న సరిహద్దు రేఖ పహారా బాధ్యతను వెస్టర్న్ థియేటర్ కమాండ్ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. సైనిక విన్యాసాల్లో భాగంగా ఎత్తైన కొండప్రాంతాల్లోని లక్ష్యాలపై సైనికులు కాల్పులు జరిపారని, ఆ తర్వాత హెలికాప్టర్లు ఉపరితలంపై ఉన్న లక్ష్యాలపై క్షిపణులు ప్రయోగించాయని చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటీవీ)ను ఉటంకిస్తూ ప్రచురించిన ఈ కథనంలో తెలిపింది. డోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్‌ను బెదరగొట్టేందుకు ఈ సైనిక విన్యాసాలు నిర్వహించినట్టు రక్షణరంగం నిపుణుడిని ఉటంకిస్తూ ఆ పత్రిక చెప్పుకొచ్చింది. -
డోక్లామ్ సీరియస్ ఇష్యూనే కాదు: దలైలామా
న్యూఢిల్లీ: సిక్కింలోని డోక్లామ్ నుంచి భారత్ వెనక్కి తగ్గకపోతే 1962 నాటి పరిస్థితి ఎదురుకాక తప్పదని చైనా.. మేం కూడా అప్పటివాళ్లం కాదని ఇండియా పర్సరం హెచ్చరికలు చేసుకున్నాయి. దీంతో రెండు నెలలుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇదసలు సీరియస్ ఇష్యూనే కాదని, భారత్-చైనాలు ఎప్పటికీ సోదర దేశాలేనని అంటున్నారు టిబెటన్ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా! బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన దలైలామా.. డోక్లామ్ సమస్య అంత తీవ్రమైనది కాదన్న అభిప్రాయం వెలిబుచ్చారు. ‘చైనా, భారత్‌లు రెండూ పెద్ద దేశాలే. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో వీటి మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ హిందీ-చైనీ భాయి భాయి అంటూ వాటిని పరిష్కరించుకున్నాయి’ అని లామా అన్నారు. అయితే, ప్రస్తుత సందర్భంలో భారత్ అనుసరిస్తున్న తీరును ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. భారత్‌లో భావ వ్యక్తీకరణకు ఎలాంటి ఆంక్షలు లేవని, అందుకే స్వేచ్ఛగా నాఅభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని దలైలామా పేర్కొన్నారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2012 లో ఇండియా-చైనా ఒప్పందంను ఉల్లంఘించి మరీ డ్రాగన్ కంట్రీ డోక్లామ్ వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టడంతో మొదలైన రచ్చ.. ఇప్పుడు ఇరుదేశాల ఆర్మీ సై అంటే సై అని కాలు దువ్వుకునేవరకు వచ్చిన సంగతి తెలిసిందే.