dollas
-
చిన్న వయసు.. పెద్ద బాధ్యత!
సాక్షి, సిటీబ్యూరో: టీనేజర్లకు సైబర్ సేఫ్టీపై ఓ టీనేజర్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అమెరికాలోని డల్లాస్‌లో నివసించే పదో తరగతి విద్యార్థి రాజ్ భీమిడి రెడ్డి పిన్న వయసులోనే పెద్ద బాధ్యత తలకెత్తుకోవడం విశేషం. ఆన్‌లైన్‌పై టీనేజర్ల భద్రత అంశంలో పనిచేసే స్వచ్ఛంద సంస్థ సేఫ్ టీన్స్ ఆన్‌లైన్‌కు ప్రాంతీయ అంబాసిడర్‌గా రాజ్ సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం దేశంలోని అన్ని పాఠశాలల్లో రాజ్ పర్యటిస్తూ సైబర్ సెక్యూరిటీపై విద్యార్థులను చైతన్యవంతులను చేస్తున్నాడు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సాలో 25 పాఠశాలలతో కలిసి పనిచేస్తున్నాడు. నగరంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్, మెరీడియన్ తదితర స్కూల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లోని పాఠశాలల్లో అధ్యయనాలు, సెమినార్లు నిర్వహిస్తున్నాడు. -
ఘనంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నాలుగో వార్షికోత్సవం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న 67వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం లో నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో “ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు” సదస్సు ఘనంగా జరిగింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయపు ఉపకులపతి ఆచార్య డా. కె. పద్మరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని తమ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష, సాహిత్య వికాసాలకోసం జరుగుతున్న కృషిని సోదాహరణంగా వివరించారు.తానా పూర్వాధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, అంజయ్యచౌదరి లావు, ప్రస్తుత అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, ఉత్తరాధ్యక్షులు డా. నరేన్ కొడాలి, సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ సాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవం జరుపుకోవడంపట్ల హర్షాతిరేఖంతో శుభాకాంక్షలు, ఈ సాహితీ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు సమస్యలుండేవని, ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి వరకట్నం, మధు సేవ, చింతామణి, రక్త కన్నీరు, మా భూమి, పాలేరు లాంటి నాటకాలు, ప్రజా నాట్యమండలి, జననాట్య మండలి లాంటి సంస్థల ప్రభావం భూస్వామ్యుల, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకుల పోరాటం అయితే, తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమ గీతాలు, కళాకారుల ఆట పాటలు ప్రజా చైతన్యాన్ని తీసుకువచ్చాయన్నారు”.విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డా. గోరటి వెంకన్న, ప్రముఖ సినీగీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ, ‘తెలంగాణ రాష్ట్ర గీతరచయిత’ డా. అందెశ్రీ, సినీగీత రచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్, కళాభిమాని డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ప్రముఖ కవిశ్రీ గొడిశాల జయరాజు, గద్దర్ కుమార్తె డా. వెన్నెల గద్దర్, అరుణోదయ కళాకారిణి బండ్రు విమలక్క, బుర్రకథ కళాకారులు పద్మశ్రీ నాజర్ కుమారులు షేక్ బాబుజి (బుర్రకథ), ఏర్పుల భాస్కర్ (బైండ్ల గానం); డా. రవికుమార్ చౌదరపల్లి (ఒగ్గుకథ); పాతూరి కొండల్ రెడ్డి (యక్షగానం); దామోదర గణపతిరావు (జానపదగానం) మరియు చాట్రగడ్డ శ్రీనివాసుడు (డప్పువిన్యాసం) పాల్గొని ఎన్నో ఉదాహరణలతో చేసిన ఆసక్తికర ప్రసంగాలు, కళావిన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెద్వారా వీక్షించవచ్చును. -
అమెరికాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. డల్లాస్‌లో టీఆర్ఎస్ పార్టీ నేత అభిషేక్ కొత్తుర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలు కేక్ కటింగ్ చేసి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభిషేక్ కొత్తూర్ కేటీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కేటీఆర్ 2009లో తొలిసారి సిరిసిల్ల ఎమ్మెల్యేగా విజయం సాధించారని, ఆ విజయాల పరపరం కొనసాగిస్తూ రాష్ట్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని కొనియాడారు. మంత్రి కేటీఆర్‌కు అభిషేక్ జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. -
Aishwarya: మూడు వందలకు పైగా డాన్స్ ప్రదర్శనలు.. ఇంకా
చక్కటి రూపం, పొడవైన జడ, చెవులకు జూకాలు ధరిస్తూన్న అచ్చమైన తెలుగు యువతి, ఆ పక్కనే మాయాబజార్ ప్రియదర్శినిలో అభిమన్యుడిని తన్మయత్వంతో చూస్తున్న శశిరేఖ, మరో చిత్రంలో ఓ పాపాయి. తండ్రి చేతుల్లో భద్రంగా ఉన్నాననే భరోసా ఆ పాపాయి కళ్లలో ప్రతిబింబిస్తోంది. ఇక కెంపులు పొదిగిన ఈ కంఠాభరణం సహజమైన మెరుపుతో అచ్చమైన బంగారు ఆభరణాన్ని తలపిస్తోంది. ఈ చిత్రాలకు రూపమిచ్చిన కళాకారిణి ఈ పక్కన ఉన్న భరత నాట్యకారిణి... ఐశ్వర్య భాగ్యనగర్. భరతనాట్యం, బాలీవుడ్ డాన్స్ ఫ్యూజన్, భాంగ్రా నృత్యం, హిప్హాప్, థియేటర్ స్కిట్, టిక్‌టాక్... వీటన్నింటి మధ్యలో కుంచె పట్టుకుని సుదీర్ఘంగా పెయింటింగ్‌లో నిమగ్నమైపోవడం... ఇదీ ఈ అమ్మాయి ప్రపంచం. యూఎస్‌లో పుట్టిపెరిగిన ఈ తెలుగమ్మాయి తనకు తానుగా సృష్టించుకున్న ప్రపంచం. ‘పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే నాకిష్టం. ఎదుటివారిని ఎంటర్టైన్ చేయడంలో నేను ఎంటర్టైన్ అవుతాను’ అంటున్న ఐశ్వర్య భాగ్యనగర్ పరిచయం. ఐశ్వర్య భాగ్యనగర్ పూర్వికులది కరీంనగర్ జిల్లా. ఆమె తండ్రి వేణు భాగ్యనగర్ యూఎస్‌లో స్థిరపడ్డారు. రెండేళ్లకోసారి ఇండియాకి వచ్చే ఈ అమ్మాయి భారతీయతతో ఎక్కువగా కనెక్ట్ అయింది. ఫ్యాషన్ ప్రపంచం ఇండియాని వెస్ట్రనైజ్ చేస్తుంటే, ఐశ్వర్య మాత్రం యూఎస్‌కి ఇండియా అంటే ఏమిటో తెలియచేస్తోంది. ఇక్కడి కళలను అక్కడ ప్రదర్శించి అలరిస్తోంది. శాస్త్రీయ నాట్యానికే జీవితాన్ని అంకితం చేసిన కళాకారిణులకు దీటుగా ప్రదర్శనలిస్తోంది. ‘‘మేము డాలస్‌లో మన పండుగలన్నీ జరుపుకుంటాం. బతుకమ్మ, ఉగాది, ఇంకా తెలుగు వాళ్ల చిన్న చిన్న గ్యాదరింగ్‌లలో కూడా ఏదో ఒక పెర్ఫార్మెన్స్కి అవకాశం ఉంటుంది. నాకు స్టేజ్ షోలంటే ఇష్టం. అమ్మానాన్నలకు ఓన్లీ కిడ్ని. ఇక నన్ను ఆపేదెవరు? ఏ చిన్న కార్యక్రమం అయినా నా ఆర్ట్ ఫార్మ్ ఒక్కటైనా ఉంటుంది. నాలుగేళ్ల కిందట ఇండియాకి వచ్చినప్పుడు రవీంద్రభారతిలో కూడా ప్రదర్శన ఇచ్చాను. ఒక సామాజిక ప్రయోజనం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం అది. అందులో ప్రదర్శన ఇవ్వడంలో ఒక సంతృప్తి ఉంటుంది. పైగా నా రూట్స్ ఉన్న నేలకు ఇస్తున్న గౌరవం అది. అందుకే వెంటనే ఒప్పుకున్నాను’’ అన్నది ఐశ్వర్య 2018లో హైదరాబాద్‌లో ఇచ్చిన సోలో ప్రదర్శనను గుర్తు చేసుకుంటూ. ఆరంగేంట్రానికి అన్నీ ఇక్కడి నుంచే! ఐశ్వర్య ఐదేళ్ల వయసులో నాట్యసాధన ప్రారంభించింది. నాట్యగురువు మధుశ్రీ సేతుపతి ఆధ్వర్యంలో 2016లో ఆరంగేంట్రం చేసింది. ఆరంగేంట్రానికి అన్నీ చెన్నై నుంచి తీసుకువెళ్లింది. ‘‘పెర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకూడదు. ప్రతిదీ కచ్చితంగా ఉండాలి. నాట్యంలో దుస్తులు, ఆభరణాలు కూడా సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబింబించి తీరాలి. ఇవన్నీ కల్చర్‌ని ఒకతరం నుంచి మరో తరానికి తీసుకువెళ్లే వాహకాలు. ఇప్పటి ఫొటోలు తర్వాతి తరానికి డాక్యుమెంట్లు. ఆ తరం అర్థం చేసుకోవడానికి పనికి వచ్చే ఆధారాలు. అందుకే రాజీ పడకూడదంటాను. మనం కొంత రాజీపడితే ఆ ఫొటోలు చూసిన వాళ్లలో ఎవరో ఒకరు వాటినే ప్రామాణికంగా తీసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే అంత కచ్చితంగా ఉంటాను’’ అంటోంది ఐశ్వర్య. ఆమె ఆ మాట అనడమే కాదు, ఆమె పెయింటింగ్స్‌లో భరతనాట్యంలో ధరించే ఆభరణాలున్నాయి. భరతనాట్యం థీమ్‌తో వేసిన వాటిని చూస్తే ఇది పెయింటింగా లేక యాంటిక్ ఆభరణాల ఫొటోనా అని సందేహం కలిగేటంత సహజంగా ఉన్నాయి. ఆర్ట్‌ని చదివింది ‘‘ఆర్ట్‌ని హాబీగా నేర్చుకోవడం కాదు, సిక్స్త్ క్లాస్ నుంచి నేను ఆర్ట్‌ని ఒక సబ్జెక్ట్‌గా చదివాను. అందుకే స్కూల్‌డేస్ నుంచి పెయింటింగ్ కాంపిటీషన్లు, ఎగ్జిబిషన్లు పాతిక వరకు ఉన్నాయి. డాన్స్ ప్రదర్శనలైతే మూడు వందలు దాటి ఉంటాయి. అయితే అందులో భరతనాట్యం ప్రదర్శనలే ఎక్కువ. ఇవి కాకుండా ఇండియన్ కాస్ట్యూమ్స్‌కి మోడలింగ్ చేస్తాను. అయితే సీరియస్ మోడల్ని కాను. సరదాగా చేస్తానంతే. డాలస్‌లో మాకు ఇండియాలో ఉన్నట్లే ఉంటుంది. తెలుగు సినిమాలు కూడా బాగా చూస్తాం. నేనైతే ఫస్ట్‌డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఆచార్య సినిమాకి టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఇవన్నీ చేస్తుంటే నేను చదువు ఎప్పుడు చదువుతానని సందేహంగా ఉంది కదా! డిసెంబర్లో గ్రాడ్యుయేషన్ తీసుకున్నాను. ఇప్పుడు జాబ్ చూసుకోవాలి. ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా నా ఆర్ట్స్‌ని కొనసాగించాలనేది ఆకాంక్ష. నేను ఇన్ని రకాల డాన్స్‌లు చేయడానికి ఫౌండేషన్ భరతనాట్యం ప్రాక్టీసే. అందుకే డాన్స్‌ని కొనసాగించే విధంగా కెరీర్‌ని డిజైన్ చేసుకుంటాను’’ అన్నది ఐశ్వర్య. తన ప్రపంచంలో తాను హాయిగా ఉంది. అంతకు మించి చక్కటి ఆకాంక్షలతో ఉంది. అందుకు తగిన ఆత్మవిశ్వాసంతోనూ ఉంది. అందుకే ఐశ్వర్య భాగ్యనగర్‌కి ఆల్ ది బెస్ట్ చెబుదాం. – వాకా మంజులారెడ్డి -
డల్లాస్‌లో 160వ తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
డల్లాస్: ప్రతి ఏటా జరిగే ఈ మాసపు వెన్నెల (నవంబరు) ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 160వ నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు డాలస్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డాలస్ నగర పరిధిలోని తెలుగు వారే కాకుండా ఆస్టిన్, టెక్సాస్ నగరాలకు చెందిన తెలుగు వారు సైతం హజరయ్యారు. సోమవారం జరిగిన ఈ సాహిత్య మాసపు సదస్సు ఎప్పటిలాగే చిన్నారులు సాహితి వేముల, సిందూర వేముల ‘తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ’ అనే రామదాసు కీర్తన ఆలాపనతో ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ద్రవిడ విశ్వ విద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మనుచరిత్ర-తాత్విక ప్రతీకాత్మకత అన్న అంశంపై ప్రసంగించారు. దీనిపై ఆయన పరిపూర్ణాభ్యాసం, విస్తారమైన సాహిత్య విశ్లేషణ నేపథ్యంలో ఆచార్యులు మనుచరిత్ర రచనపై లోతైన చర్చ చేశారు. అల్లసాని వారి కావ్యంలోని రహస్యాలనెన్నో విప్పి చెప్పి సాహిత్య విజ్ఞానాన్ని సభలో పంచుకున్నారు. భాషాశాస్త్రం, పదాల ఉత్పత్తి, భారతీయ ఇతర భాషా సాహిత్యాలు, తెలుగు సాహిత్య చరిత్ర లాంటి అంశాలపై వారికున్న లోతైన పరిచయాన్ని మనుచరిత్ర కావ్య విశ్లేషణకు సాధనాలుగా ఉపకరించాయి. అల్లసాని వారు కథానాయకుడి పేరును ప్రవరుడుగా నామకరణం చేసిన నేపథ్యాన్ని ఆచార్యులు అద్భుతంగా సభలో అందరికి వివరించారు. చివరిలో ఆయన సత్‌చిత్ ఆనంద్ అనే పదాలు భారతీయ ఆధ్యాత్మిక చింతనాసరళికి ఏవిధంగా స్పష్టతను చేకూర్చాయో విశదీకరించారు. ప్రధాన వక్త ప్రసంగానికి ముందు ప్రతీ మాసం ఎంతో ఆదరణ పొందుతున్న “మనతెలుగు సిరి సంపదలు” ధారావాహికలో భాగంగా ఉరుమిండి నరసింహా రెడ్డి జాతీయాలు, పొడుపు కథల పరంపరను కొనసాగించారు. తెలుగు సాహిత్య ప్రపంచంలోని ప్రసిద్ద కవితాపంక్తులను, ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సభకు హాజరైన వారిని చర్చలో భాగస్వామలు చేశారు. ఇక ఉపద్రష్ట సత్యం ‘పద్య సౌగంధం’శీర్షికన సాహితీ సమరాంగణ సార్వభౌముడు విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలోని పద్యాలను విశ్లేషించారు. పక్షి రాజు గరుత్మంతుడి శక్తిని విశ్వరూపదర్శనంగా చూపిన రాయల వారి కావ్యరచనలోని అర్థాలను, అలంకారాలను ఆయన చక్కగా వివరించారు. అదే విధంగా జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ‘మాసానికో మహనీయుడు’ అనే శీర్షిక కొనసాగింపుగా, నవంబరు మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులను ప్రజెంటేషన్ ద్వారా సభలో గుర్తుకు తెచ్చారు. అనంతరం డాక్టర్ బల్లూరి ఉమాదేవి కార్తీక మాసవైశిష్ట్యాన్ని గుర్తు చేస్తూ.. వారు రాసిన స్వీయ పద్యకవితను పఠించారు. మరొక అంశంలో లెనిన్ బాబు వేముల కాళిదాస మహాకవి ఇప్పుడున్న భారతంలోని ఏ ప్రాంతపు వాడయి ఉంటాడో అన్న అంశంపై చర్చ జరిపారు. ఈ సదస్సు చివరిలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు మాట్లాడుతూ.. సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న ద్రవిడ విశ్వ విద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి, ప్రార్థనా గీతం పాడిన సాహితి,సింధూరలతో పాటు మిగిలిన వక్తలకు, సభకు హజరైన సాహిత్య అభిమానులందరికి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
డాలస్లా హైదరాబాద్ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: డాలస్ నగరం మాదిరిగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఐటీ మంత్రి కె.తారక రామారావు అన్నారు. అమెరి కా పర ్యటనలో భాగంగా ఆయన సోమవారం డాలస్‌లో ఏర్పా టు చేసిన ‘వైబ్రంట్ హైదరాబాద్-సీఈవో కనెక్ట్’ కార్యక్రమం లో పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ప్రముఖ కంపెనీల సీఈవోలతో మాట్లాడుతూ హైదరాబాద్ ఎప్పటికీ వ్యాపార కేంద్రంగా పరిఢవిల్లుతుందన్నారు. చారిత్రకంగా ఉన్న చార్మింగ్తోపాటు అధునాతన పోకడలను కూడా అందిపుచ్చుకుంటోందన్నారు. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు అవసరమైతే మరిన్ని ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం సిద ్ధంగా ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నీరు, విద్యుత్, భూమి పుష్కలంగా ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని కేటీఆర్ స్పష్టం చేశారు. అంతకు ముందు డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎన్నారైలకు ఆయన పిలుపునిచ్చారు. శాన్ఫ్రాన్సిస్కో బయల్దేరిన కేటీఆర్ బృందం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సోమవారం రాత్రి శాన్ఫ్రాన్సిస్కో నగరానికి బయల్దేరారు. డాలస్‌లో మంచు తుఫాన్ కారణంగా విమాన సర్వీసులు నిలిపివేయడంతో రోడ్డు మార్గాన బయల్దేరిన కేటీఆర్ బృందం సోమవారం రాత్రి ఆస్టిన్ నగరానికి సురక్షితంగా చేరుకుంది.