డాలస్ నగరం మాదిరిగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఐటీ మంత్రి కె.తారక రామారావు అన్నారు.
సాక్షి, హైదరాబాద్: డాలస్ నగరం మాదిరిగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఐటీ మంత్రి కె.తారక రామారావు అన్నారు. అమెరి కా పర ్యటనలో భాగంగా ఆయన సోమవారం డాలస్‌లో ఏర్పా టు చేసిన ‘వైబ్రంట్ హైదరాబాద్-సీఈవో కనెక్ట్’ కార్యక్రమం లో పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ప్రముఖ కంపెనీల సీఈవోలతో మాట్లాడుతూ హైదరాబాద్ ఎప్పటికీ వ్యాపార కేంద్రంగా పరిఢవిల్లుతుందన్నారు.
చారిత్రకంగా ఉన్న చార్మింగ్‌తోపాటు అధునాతన పోకడలను కూడా అందిపుచ్చుకుంటోందన్నారు. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు అవసరమైతే మరిన్ని ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం సిద ్ధంగా ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నీరు, విద్యుత్, భూమి పుష్కలంగా ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని కేటీఆర్ స్పష్టం చేశారు. అంతకు ముందు డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎన్నారైలకు ఆయన పిలుపునిచ్చారు.
శాన్‌ఫ్రాన్సిస్కో బయల్దేరిన కేటీఆర్ బృందం
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సోమవారం రాత్రి శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి బయల్దేరారు. డాలస్‌లో మంచు తుఫాన్ కారణంగా విమాన సర్వీసులు నిలిపివేయడంతో రోడ్డు మార్గాన బయల్దేరిన కేటీఆర్ బృందం సోమవారం రాత్రి ఆస్టిన్ నగరానికి సురక్షితంగా చేరుకుంది.