
సైబర్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తున్న టీనేజర్
సెమినార్‌లో మాట్లాడుతున్న పదో తరగతి విద్యార్థి రాజ్ భీమిడి రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: టీనేజర్లకు సైబర్ సేఫ్టీపై ఓ టీనేజర్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అమెరికాలోని డల్లాస్‌లో నివసించే పదో తరగతి విద్యార్థి రాజ్ భీమిడి రెడ్డి పిన్న వయసులోనే పెద్ద బాధ్యత తలకెత్తుకోవడం విశేషం. ఆన్‌లైన్‌పై టీనేజర్ల భద్రత అంశంలో పనిచేసే స్వచ్ఛంద సంస్థ సేఫ్ టీన్స్ ఆన్‌లైన్‌కు ప్రాంతీయ అంబాసిడర్‌గా రాజ్ సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం దేశంలోని అన్ని పాఠశాలల్లో రాజ్ పర్యటిస్తూ సైబర్ సెక్యూరిటీపై విద్యార్థులను చైతన్యవంతులను చేస్తున్నాడు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సాలో 25 పాఠశాలలతో కలిసి పనిచేస్తున్నాడు. నగరంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్, మెరీడియన్ తదితర స్కూల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లోని పాఠశాలల్లో అధ్యయనాలు, సెమినార్లు నిర్వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment