domain names
-
ఇండియా కోసం ప్రత్యేకంగా ‘డాట్‌భా’.. ప్రత్యేకతలు ఇవే
ముంబై: డాట్‌కామ్, డాట్ఇన్ మొదలైన ఇంటర్నెట్ డొమైన్స్ స్థానంలో తాజాగా భారత్‌ను ప్రతిబింబించేలా డాట్‌భా (.bha) పేరిట డొమైన్‌ను స్టార్టప్ సంస్థ ఆగామిన్ టెక్నాలజీస్ ఆవిష్కరించింది. ఇండియా (పట్టణ ప్రాంతాలు), భారత్ (గ్రామీణ ప్రాంతాలు) మధ్య డిజిటల్ తారతమ్యాలను చెరిపివేసే దిశగా ఈ ప్రయత్నం తోడ్పడగలదని సంస్థ వ్యవస్థాపకుడు సజన్ నాయర్ తెలిపారు. త్వరలో తెలుగులో హిందీతో ప్రారంభించి తెలుగు, తమిళం, కన్నడ తదితర ప్రాంతీయ భాషల్లోనూ టాప్ లెవెల్ డొమైన్స్ (టీఎల్‌డీ)ను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి నాటికి బెంగాలీ, ఏప్రిల్‌లో మలయాళం, మే నెలలో ఉర్దూ వెర్షన్లలో వీటిని ఆవిష్కరించనున్నట్లు నాయర్ వివరించారు. ఇమోజీలు, ఇంటిపేర్లతో కూడా టీఎల్డీలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సాధారణంగా వెబ్సైట్లో పేరు, టీఎల్‌డీ కలిసి ఉంటాయి. ఉదాహరణకు గూగుల్ డాట్ కామ్ తీసుకుంటే, గూగుల్ అనేది సంస్థ పేరు కాగా, డాట్‌కామ్ అనేది టీఎల్డీగా వ్యవహరిస్తారు. -
డొమైన్ పేర్లు ఇక మన భాషల్లోనే..
ఏదైనా వెబ్సైట్ రూపుదిద్దుకోవాలంటే డొమైన్ అనేది కచ్చితంగా అవసరం. ఏ భాషకు సంబంధించి వారైనా సరే తమకు నచ్చిన డొమైన్ కావాలంటే దానిని ఇంగ్లీష్‌లో వెతుకోవాల్సిందే. అయితే రానున్న కాలంలో ఇంగ్లీష్‌లో డొమైన్ వెతికే ప్రక్రియకు రాంరాం చెప్పొచ్చట. మాతృభాషలోనే తమకు కావాల్సిన డొమైన్‌ను వెతుకునే సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిసింది. దీనికోసం ‘ది ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్’, ‘ది నాన్ ప్రాఫిట్ కార్పొరేషన్’, ఇంటర్నెట్ డొమైన్ నేమ్స్’ సంస్థలు కసరత్తు చేస్తున్నట్టు వెల్లడైంది. భారత్‌లోని 22 షెడ్యూలు భాషలతో పాటు, వాడుకలో ఉన్నఅనేక భాషలలో డొమైన్లు తీసుకొచ్చే ఏర్పాట్లను ఆ సంస్థలు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు, బెంగాలీ, దేవనాగరి, గుర్మకి, కన్నడ, మలయాళం, ఒరియా, తమిళ్ భాషలపై ప్రస్తుతం పరిశీలన కొనసాగుతోందని ఐసీఏఎన్ఎన్ అధికారి సమ్రిన్ గుప్తా చెప్పారు. ఈ స్క్రిప్టులు పలు స్థానిక భాషలను కవర్ చేయనున్నట్టు తెలిపారు. ప్రపంచంలో ఇంగ్లీష్ పరిజ్ఞానం లేని వారు సైతం వారి మాతృభాషలో వెతికి అక్కడి వెబ్సైట్లను, ఆన్‌లైన్‌ను సందర్శించవచ్చని తెలిపారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన హిందీ భాషకు సంబంధించిన వెబ్సైట్ పేరును హిందీలో టైప్ చేస్తే ఆ వెబ్సైట్ వచ్చేవిధంగా ప్రస్తుత విధానం రూపుదిద్దుకుంటోంది. అంటే ఇక నుంచి దీని కోసం ఇంగ్లీష్ భాషనే వాడాల్సినవసరం లేదు. ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 52శాతం మందే ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండి ఇంటర్నెట్ బాగా ఉపయోగిస్తున్నారని గుప్తా చెప్పారు. మిగిలిన 48శాతం మంది అంటే ఎవరికైతే ఇంగ్లీష్‌పై అంతగా అవగాహన లేదో, వారికి తమ తమ భాషల్లో డొమైన్ పేర్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రజలు వారు మాతృభాషలో టైప్ చేసే మెళకువలు నేర్చుకుంటే చాలు ఈ ప్రయత్నం ఉపయోగకరంగా మారుతుందని గుప్తా తెలిపారు. ఇప్పటికే మాతృభాషల్లో టైప్ చేస్తే చాలు గూగుల్, ఇతర సెర్చింజన్లకు కావాల్సిన సమాచారం అందజేస్తున్నాయి. దేవనాగరి, గుజరాతి, గుర్ముకి, కన్నడ, ఒరియా, తెలుగు భాషల ప్రతిపాదనల కోసం ఇప్పటికే కంపెనీ ప్రజా స్పందనను కోరుతోంది. ప్రస్తుతం 4.2 బిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులుండగా, 2022కు ఆ సంఖ్య 5 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. -
యాపిల్ కార్లూ వచ్చేస్తున్నాయి!!
బెంగళూరు: ఐఫోన్లు, ఐప్యాడ్లు విక్రయించే ప్రఖ్యాత యాపిల్ సంస్థ త్వరలోనే ఆటోమొబైల్ రంగంలోకి దిగనుందా? ప్రజలను త్వరలోనే యాపిల్ కార్లు పలుకరించనున్నాయా? అంటే ఆ కంపెనీ తాజాగా నమోదు చేసిన వెబ్సైట్ డొమైన్ పేర్లు ఔననే అంటున్నాయి. యాపిల్ సంస్థ గత డిసెంబర్లో కొన్ని డొమైన్ పేర్లను తన పేరిట నమోదుచేసుకుంది. అందులో యాపిల్.కార్, యాపిల్.కార్స్, యాపిల్.ఆటో వంటి పేర్లు ఉన్నాయని డొమైన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ అయిన 'వూ.ఈజ్' తెలిపింది. అయితే ఈ డొమైన్లు యాపిల్ కారు ప్లే సర్వీసుకు చెందినవి కూడా కావొచ్చునని వినిపిస్తోంది. కారు నడిపించేటప్పుడు స్టీరింగ్ వీల్ నుంచి చేతులు తీయకుండానే ఐఫోన్లో కాల్స్, వాయిస్ మెయిల్స్ వినేందుకు వినియోగదారులకు ఈ సర్వీసు వీలు కల్పిస్తుంది. మరోవైపు ఆటో మొబైల్ రంగం నిపుణులను పెద్ద ఎత్తున కంపెనీలో చేర్చుకుంటున్న యాపిల్.. తనకు కారును రూపొందించే ఆలోచన ఉందని మాత్రం బహిరంగంగా ఒప్పుకోవడం లేదు. అయితే, ఫోర్డ్, మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులను చేర్చుకోవడం ద్వారా యాపిల్ ఉద్దేశం ఏమిటో అర్థమవుతూనే ఉంది. సిలికాన్ వ్యాలీకి చెందిన గూగుల్ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పుడు కారు టెక్నాలజీ మీదనే ప్రధానంగా దృష్టి సారించాయి. గూగుల్ ఇప్పటికే తనకుతాను నడుపుకొనే సెల్ఫ్ డ్రైవింగ్ కారును అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది.