Dome
-
TS: ఈ గుమ్మటాల గోలేంది.. అసలేం జరుగుతోంది?
తెలంగాణలో నేతలు ఒకరిని మించి ఒకరు పోటీ పడి డైలాగులు విసురుతున్నారు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదస్పదమే. ఆయన సచివాలయ గుమ్మటాలను కూల్చివేస్తామని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అలా చేస్తామని ఆయన అంటున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్‌ను పేల్చాలని అంటే సంజయ్ ఏమో సచివాలయం గుమ్మటాలపై పడ్డారు. కేవలం మూడు సీట్లు ఉన్న బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కేంద్ర పార్టీ నేతలు , రాష్ట్ర నేతలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు తెలంగాణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజకీయం చేస్తున్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పేరున లిక్కర్ స్కామ్ చార్జీషీట్లో చేర్చడం కలకలం రేపింది. అంతేకాదు. వీరికి సంబంధించిన ఆడిటర్ బుచ్చిబాబును కూడా అరెస్టు చేశారు. ఈ పరిణామం ఏదో సంకేతం ఇస్తున్నట్లుగా ఉంది. మరి కొంత ప్రముఖుల వద్దకు ఈ కేసు చేరే అవకాశం కనబడుతోంది. అలా జరిగితే తెలంగాణ రాజకీయం మరింత గరం, గరం అవుతుంది. ఇలా ఒకవైపు వ్యవహారం సాగుతుండగా, మరో వైపు బీజేపీ రాష్ట్ర నాయకులు వీధి మీటింగ్‌లు పేరుతో జనాన్ని ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నారు. ఆ క్రమంలో బండి సంజయ్ తీవ్రమైన డైలాగులు విసురుతున్నారు. తెలంగాణలో కొత్తగా నిర్మించిన సచివాలయ గుమ్మటాలను కూల్చడం అంటే ఒకరకమైన సెంటిమెంట్ ను ప్రేరించడానికి ఆయన యోచిస్తున్నారన్నమాట. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ నిర్మాణాలను ప్రశంసించడమే కాకుండా తాజ్ మహల్‌తో పోల్చారు. ఈ నేపథ్యంలో సంజయ్‌కు తాజ్ మహల్లో సమాధి గుర్తుకు వచ్చింది. నిజానికి తాజ్ మహల్ ప్రపంచ వింతలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అమెరికాతో సహా ఆయా దేశాల అధినేతలు తాజ్నును సందర్శించి అనుభూతి పొందారు. అలాంటి ప్రసిద్ద కట్టడాన్ని సంజయ్ సమాధితో పోల్చడం సరికాదు. బహశా ఆయన మనసులో మరో అంశం పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారేమో! గతంలో అయోధ్యలోని బాబ్రీ మసీదును కర సేవకులు కూల్చివేశారు. ఆ మసీదుకు కూడా గుమ్మటం ఉండేది. మొత్తాన్ని గుణపాలతో తవ్వేశారు. అక్కడ రామాలయం ఉండేదన్నది వారి వాదన. రామాలయం కోసం బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వాని రథయాత్ర చేసినప్పుడు పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బాబ్రీ మసీదు కూల్చినప్పుడు దేశం అంతా అట్టుడికింది. అయినా ఆ ఘట్టం బీజేపీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడి , ఆ పార్టీ కేంద్రంలో అదికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు అలా కాకపోయినా, తాము అధికారంలోకి వస్తే గుమ్మటాలను కూల్చుతామని సంజయ్ హెచ్చరిస్తున్నారు. ఆ గుమ్మటాలు భారతీయ, తెలంగాణ సంస్కృతిలో భాగం కాదని, నిజాం సంస్కృతిలోవని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే సంజయ్ విమర్శించిన వాటిలో ఒకటి మాత్రం హేతుబద్దంగానే ఉంటుంది. అంతకుముందు బాగున్న భవనాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చివేసి కొత్త నిర్మాణాన్ని చేసింది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక అందమైన భవనాన్ని నిర్మించి అంబేద్కర్ పేరు పెట్టారు. ఈ భవనంపై గుమ్మటాల నిర్మాణాలు కనిపిస్తుంటాయి. బీఆర్ఎస్ ఆఫీస్ భవనం కూడా ఒకరకంగా ఇదే మోడల్లో పైన గుమ్మటాలతో కనిపిస్తుంటుంది. అది బీజేపీకి అంత నచ్చకపోవచ్చు. అంతమాత్రాన కొత్త సచివాలయ గుమ్మటాలను కూల్చివేస్తామంటే జనంలో సెంటిమెంట్ పెరుగుతుందా అన్నది డౌటే. బీజేపీ వారు కూడా కేంద్రంలో పార్లమెంటుకు కూడా కొత్త భవనాన్ని నిర్మించారు. ఆ విషయాన్ని కూడా మర్చిపోరాదు. కాకపోతే అది చాలాకాలం నాటిది కాబట్టి , మొత్తం కేంద్ర కార్యాలయాలన్నిటిని ఒకే చోటకు తీసుకు వచ్చే క్రమంలో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు భవనాల నిర్మాణం కోర్టుల వరకు వెళ్లి క్లియర్ అయ్యాయి. ఏది ఏమైనా అదేదో వేరే మత సంస్కృతిలో భాగంగా కనిపిస్తున్నాయి కాబట్టి కూల్చాలని ప్రచారం చేస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది? మంత్రి కేటీఆర్ రోడ్లపై ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్న మసీదులు, దేవాలయాలను తొలగించాలని అనడంపై కూడా సంజయ్ ఆక్షేపణ తెలిపారు. ముందుగా పాతబస్తీలోని మసీదులను తొలగించగలరా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న సంగతి ఎలా ఉన్నా గుజరాత్లో దీనికి సంబంధించి అప్పటి మోదీ ప్రభుత్వం ఒక చట్టం కూడా తెచ్చి రోడ్లపై ప్రార్ధనా మందిరాలను తొలగించిందని చెబుతారు. ఈ సంగతి కూడా సంజయ్ గుర్తుంచుకోవాలి. తెలంగాణలో అయినా మరో రాష్ట్రంలో అయినా ఇలాంటి విషయాలలో ఏకాభిప్రాయం అవసరం అని చెప్పాలి. బీజేపీ ఇకనైనా గుమ్మటాల గోల వదలిపెట్టి విధానపరమైన అంశాలపైన స్పీచ్‌లు ఇస్తే మంచిది. -హితైషి చదవండి: పాదయాత్రల్లో బ్యాలెన్స్ తప్పుతున్న నేతలు -
కొత్త సెక్రటేరియట్‌కు బాహుబలి డోమ్స్
సాక్షి, హైదరాబాద్: ఆ గుమ్మటం ఎత్తు 82 అడుగులు.. అంటే దాదాపు ఎనిమిది అంతస్తుల అంత.. 52 అడుగుల వ్యాసం.. వెరసి బాహుబలి డోమ్. అదీ ఒకటి కాదు.. రెండు.. రాష్ట్ర కొత్త సచివాలయంలో భాగంగా నిర్మాణమవుతున్న భారీ గుమ్మటాలు ఇవి. ఒకప్పుడు మహమ్మదీయ రాజులు తాజ్ మహల్, గుల్బర్గా గుంబజ్ వంటి కట్టడాల్లో భారీ గుమ్మటాలు నిర్మించారు. కానీ ఆధునిక నిర్మాణాల్లో, అందులోనూ ప్రభుత్వ భవనాల్లో ఇలా భారీ డోమ్ రూపొందనుండటం ఇదే తొలిసారి అని అంచనా. నిర్మాణ పనులు షురూ.. కొత్త సెక్రటేరియట్ భవనానికి ప్రధాన ఆకర్షణగా ఉండనున్న భారీ గుమ్మటం నిర్మాణం ప్రారంభమైంది. దీనికి సంబంధించి నిర్మా ణం లోపల ఆధారంగా నిలిచే ఇనుప చట్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో పైన అర్ధ వృత్తాకారంలోని భాగం సిద్ధమైంది. దాని దిగువన సిలిండర్ తరహాలో ఉండే భాగాన్ని తయారు చేసే పనులను మొదలుపెడుతున్నారు. ఈ భాగం పూర్తవటానికి నెల రోజులు పడుతుందని.. తర్వాత రెండు భాగాలను భవనంపై మధ్య భాగంలో బిగించి.. దాని ఆధారంగా కాంక్రీట్ నిర్మాణాన్ని చేపడతారు. ఇలా రెండు భారీ గుమ్మటాలు నిర్మించనున్నారు. సచివాలయ భవనం డిజైన్ ప్రకారం.. మధ్యలో ఖాళీ ప్రదేశం ఉండగా.. తూర్పు, పశ్చిమ భాగాల్లో భవనంపై గుమ్మటాలు ఉంటాయి. ఇవి ఒక్కోటీ 82 అడుగుల ఎత్తు ఉండనున్నాయి. ఇందులో సిలిండర్ తరహాలో ఉండే దిగువ భాగం 45 అడుగులు ఉంటుంది. డోమ్ లోపల వీఐపీ జోన్! ప్రధాన డోమ్‌ల లోపలి భాగాన్ని ఏ అవసరాలకు వినియోగించాలనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి దాన్ని స్కైలాంజ్ తరహాలో రూపొందిస్తున్నారు. విశాలమైన కిటికీలు అమర్చుతారు. అక్కడి నుంచి చుట్టూ నగరాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ డోమ్‌ల ప్రాంతం వీఐపీ జోన్‌గానే ఉంటుందని, సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నారని అధికారులు తెలిపారు. సీఎం ముఖ్యమైన సమావేశాలు అక్కడ నిర్వహించేలా రూపొందిస్తున్నట్టు వివరించారు. ధవళ వర్ణంలో మిలమిలలాడేలా.. కొత్త సచివాలయ భవనం మొత్తం ధవళ వర్ణంలో మెరిసిపోనుంది. పాత భవనం స్పురించేలా మొత్తం తెలుపు రంగు వేయాలన్న ఆర్కిటెక్ట్ సూచనను ప్రభుత్వం ఆమోదించింది. పైభాగంలో ఉండే రెండు ప్రధాన గుమ్మటాలు సహా మొత్తం 34 డోమ్స్ కూడా తెలుపు రంగులోనే ఉండనున్నాయి. పెద్ద డోమ్‌కు ఏవైనా మరమ్మతులు అవసరమైతే సిబ్బంది పైభాగం వరకు వెళ్లేలా మెట్లు ఏర్పాటు చేస్తున్నారు. 45 అడుగుల ఎత్తు వరకు బయటి నుంచి మెట్లు నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి లోనికి వెళ్లి, డోమ్ పైభాగానికి చేరుకునేలా ద్వారం, క్యాట్ వాక్ స్టెయిర్స్ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం సచివాలయ నిర్మాణ పనుల్లో 2,200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ దసరా నాటికి భవనాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అప్పటిలోగా ప్రధాన డోమ్ పనులు పూర్తికాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దసరా నాటికి ప్రధాన భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి.. గుమ్మటం పనులకు అదనపు సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నవంబరు నాటికి డోమ్స్ పని పూర్తికావచ్చని అంచనా వేస్తున్నారు. చారిత్రక డిజైన్‌లో.. 34 గుమ్మటాలతో.. హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండతోపాటు కుతుబ్‌షాహీ టూంబ్స్, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు భవనం గుర్తుకొస్తాయి. వీటన్నింటిలోనూ డోమ్‌లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కుతుబ్‌షాహీలు, అసఫ్ జాహీల జమానాలోని కట్టడాల్లో ఎక్కువగా ఉంటాయి. ఆధునిక కాలంలో ఇలాంటి నిర్మాణాలు అరుదు. అయితే కాకతీయ–పర్షియా నిర్మాణ శైలులను మేళవించి డిజైన్ చేసిన కొత్త సచివాలయ భవనంపై గుమ్మటాలు కనువిందు చేయనున్నాయి. రెండు భారీ గుమ్మటాలు సహా మొత్తం 34 గుమ్మటాలను కొత్త సచివాలయంలో నిర్మిస్తున్నారు. -
గోపురాల రక్షణ గోవిందా..
భక్తుల మనోభావాలతో కూడిన చారిత్రక కట్టడాల పరిరక్షణను తిరుమల తిరుపతి దేవస్థానం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు ఈ విషయంలో శ్రద్ధ చూపడం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ రాజగోపురాలు వివిధ రకాల చెట్లు మొలిచి క్రమంగా దెబ్బతింటున్నాయి. తిరుమల: అధికారుల ఉదాసీనత, పాలకుల అలక్ష్యం వల్ల తిరుపతి, తిరుమలలోని పురాతన కట్టడాలు క్రమంగా రూపు కోల్పోతున్నాయి. వీటి రక్షణకు టీటీడీ పాలకమండలి కనీస చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రధాన ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం.. తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు రెండు వేల ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. శిలా శాసనాలు, చారిత్రక ఆధారాల ప్రకారం మహాద్వార గోపురం 13వ శతాబ్దంలో నిర్మించారు. నేలమట్టం నుంచి యాభై అడుగుల ఎత్తులో దశలవారీగా, మహాద్వారానికి రెండువైపులా బలిష్టమైన శిలల ‘చౌకట్టు’పై ఐదంతస్తుల్లో నిర్మించారు. ఇక మూడు అంతస్తుల్లో వెండివాకిలిపై నిర్మించిన గోపురం 12వ శతాబ్దంలో ప్రారంభించి 13వ శతాబ్దంలో పూర్తి చేశారు. ఇది మహాద్వార గోపురం కంటే చిన్నదని తెలుస్తోంది. 1472 నుంచి 1482 మధ్య పదేళ్లు, ఆ తర్వాత 1950 నుంచి 1953 వరకు మూడేళ్లపాటు మాత్రమే మరమ్మతు పనులు జరిగినట్లు టీటీడీ రికార్డులు చెబుతున్నాయి. ముక్కలవుతున్న దేవతా ప్రతిమలు.. గడిచిన అరవై ఏళ్లుగా శ్రీవారి ప్రధాన ఆలయ రాజ గోపురాలు మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో ఆలయ మహాద్వారం, వెండివాకిలిపై ఉన్న రాజగోపురాలు కళావిహీనంగా గోచరిస్తున్నాయి. కృత, ద్వాపర, త్రేతా, కలియుగాలకు చెందిన వివిధ పురాణ ఘట్టాలు తెలిపే దేవతామూర్తులు, దానవులు, కళామూర్తుల ప్రతిమలు శిథిలావస్థకు చేరి విరిగిపోతున్నాయి. అలాగే ఆలయ రాజగోపురాలపై మొలిచిన రావి మొక్కల వేర్ల కారణంగా .. అవి అంతర్గతంగా నెర్రెలు ఏర్పడి శిథిలమవుతున్నాయి. గుణపాఠం నేర్పని శ్రీకాళహస్తి ఘటన.. ఐదు శతాబ్దాలకు ముందు నిర్మించిన శ్రీ కాళహస్తి ఆలయ రాజగోపురం నిర్వహణ లోపంతో రెండుగా చీలి కుప్పకూలిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా భక్తులు గుర్తు చేస్తున్నారు. ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన తిరుమల గోపురాలను మరమ్మతులు చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అలాగే గాలి గోపురాల్లోని కొయ్య రన్నర్ (త్రావము) దెబ్బతిందని టీటీడీ ఇంజినీరింగ్ నిపుణులే స్పష్టం చేసినా టీటీడీ పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ గోపురాలు, ప్రాకారాల పటిష్టత పరిశీలన కోసం టీటీడీ మాజీ ఈఓ ఏపీవీఎన్ శర్మ నేతృత్వంలో వేసిన కమిటీ కూడా మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని సిఫారసు చేసి ఐదేళ్లయినా ఇంతవరకు పనులు ప్రారంభించక పోవడాన్ని భక్తులు తప్పు పడుతున్నారు. మహా సంప్రోక్షణప్పుడైనా ‘మోక్షం’ కలిగేనా? ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆరు రోజులపాటు శ్రీవారి మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాసంప్రోక్షణ సందర్భంగానైనా తప్పకుండా జీర్ణోద్ధారణ పనులు నిర్వహించాల్సి ఉంటుందని అర్చకులు చెబుతున్నారు. ఎంతో చరిత్ర కలిగిన రాజగోపురాల మర్మతులు చేపట్టాలని, లేదంటే అవి మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సిరులతల్లి శ్రీకనకమహాలక్ష్మి
గోపురం లేని ఆలయం! కనకమహాలక్ష్మి ఆలయానికి ఇతర దేవాలయాల మాదిరిగా గోపురం ఉండదు. దేశంలో గోపురం లే ని దేవాలయం ఇదే కావడం విశేషం. బహిరంగ మండపంలోనే విగ్రహాన్ని ప్రతిష్టించారు. పంచభూతాలు అమ్మవారిని సేవించడానికి వీలుగా ఇలా గోపురం లేకుండా స్థాపించారని పండితులు చెబుతారు. ఇక్కడ రోజులో 24 గంటలూ దర్శించుకునేందుకు ఆలయం తెరిచే ఉంచడం మరో ప్రత్యేకత. అమ్మవారి విగ్రహం ఏ కాలంలో వెలిసిందో తెలిపే ఆధారాలు లేవు. దీంతో 1912కి ముందే ఉన్నట్టు నిర్ధారణ అవుతోంది. శ్రీకనకమహాలక్ష్మి .. విశాఖవాసుల ఇలవేల్పుగాను, కోరిన కోర్కెలు తీర్చే తల్లిగాను, సిరిసంపదలు, స్త్రీలకు ఐదవతనాన్ని, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే అమ్మవారిగాను, మహిళల కొంగుబంగారంగా భాసిల్లుతున్నారు. కనకమహాలక్ష్మికి ఆలయానికి ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. అయితే అమ్మవారు గురువారం నాడు ఆవిర్భవించడం వల్ల, ఆమెకు ప్రీతికరమైన మాసం మార్గశిరం కావడం వల్ల ఈ మాసంలో వచ్చే నాలుగు లక్ష్మివారాలు (గురువారాలు) లక్షల్లో భక్తులు సందర్శించి పునీతులవుతారు. మహిళలు అమ్మవారికి నేరుగా పసుపు కుంకుమలు సమర్పించుకోవడం, భక్తులే స్వయంగా కొబ్బరికాయలు కొట్టుకోవడం ఇక్కడి ప్రత్యేకత. విశాఖలో అమ్మవారి భక్తులెవరూ పెళ్లయిన ఆడపిల్లను గురువారం అత్తవారిళ్లకు పంపరు. అలా పంపితే లక్ష్మి వారి వెంట వెళ్లిపోతుందని నమ్ముతారు. ఇలా వెలిశారు.. స్థలపురాణం ప్రకారం.. శ్రీకనకమహాలక్ష్మి ఈ ప్రాంతాన్ని పాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు. వారి కోట ఈ పరిసరాల్లో ఉండేది. అందుకే అమ్మవారున్న ప్రదేశాన్ని బురుజుపేటగా పిలుస్తారు. శత్రురాజులు విశాఖ కోటపై దండెత్తినప్పుడు అమ్మవారిని బావిలో పడేశారు. కలియుగారంభంలో ఓ సత్బ్రాహ్మణుడు తపస్సుతో దైవసాన్నిధ్యం పొందాలని కాశీకి పయనమై బురుజుపేట చేరుకున్నాడు. అక్కడ బావిలో స్నానమాచరిస్తుండగా అమ్మవారు ప్రత్యక్షమై తనను పైకి తీసి ప్రతిష్ఠించాలని కోరారు. అందుకు ఆ బ్రాహ్మణుడు తిరస్కరించడంతో బావి నుంచి పైకి వచ్చి తన ఎడమ చేతిలోని పరిఘ అనే ఆయుధంతో అతడిని సంహరించడానికి యత్నించారు. అతడు శివుని ప్రార్థించడంతో ఆమె చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్యం చేసి వామహస్తాన్ని మోచేతి దాకా ఖండించాడు. అప్పటితో ఆమె కోపం మాయమై శాంతి, కారుణ్యంతో కలియుగంలో శ్రీకనకమహాలక్ష్మిగా అవతరించి భక్తుల కోర్కెలు తీర్చేలా అనుగ్రహించాడు. అలా వెలిసిన అమ్మవారు నిత్యపూజలందుకుంటున్నారు. 1912లో వీధి వెడల్పు చేసినప్పుడు అమ్మవారి విగ్రహం అలాగే ఉంచారు. 1917లో ఆ విగ్రహాన్ని రోడ్డు మధ్య నుంచి 30 అడుగుల దూరం జరిపారు. ఆ తర్వాత విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి వేలాది మంది మరణించారు. అమ్మవారి విగ్రహాన్ని కదపడం వల్లే ఇదంతా జరిగిందని భావించిన ప్రజలు యథాస్థానంలో చేర్చారు. అనంతరం ప్లేగు పునరావృతం కాకపోవడంతో అదంతా అమ్మవారి మహిమగా విశ్వాసం ప్రబలింది. ఇవీ పూజలు.. మార్గశిరమాసంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, సహస్ర, అష్టోత్తర నామార్చన పూజలుంటాయి. గురువారాల్లో (బుధవారం అర్ధరాత్రి నుంచి) విశేషపంచామృతాభిషేక సేవ, సహస్రనామార్చన పూజ, సర్వదర్శనం ఉంటాయి. ఎలా రావాలి? శ్రీకనకమహాలక్ష్మిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 3, రైల్వే స్టేషన్ నుంచి 3, విమానాశ్రయం నుంచి 15 కి.మీల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ప్రాంతాల నుంచి చేరుకోవడానికి కార్లు, ఆటోలు, బస్సు సదుపాయాలున్నాయి. - బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం. ఫొటోలు: పి.ఎన్.మూర్తి, విశాఖపట్నం