Dornier Aircraft
-
గగన నేత్రాలు.. ముగ్గురు మహిళా పైలట్లు
మారిటైమ్ రికానిసెన్స్! పెద్ద బాధ్యత. సముద్ర గగనతలం నుంచి నలు దిక్కుల్లో నిఘా! అంతటి కీలకమైన విధుల్లోకి గురువారం ముగ్గురు మహిళా లెఫ్టినెంట్లు కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ (ఎస్.ఎన్.సి.) నుంచి శిక్షణ పూర్తి చేసుకుని వచ్చారు. ఆ ముగ్గురూ దివ్యాశర్మ, శుభాంగి స్వరూప్, శివాంగి. నేవీ ఫస్ట్ బ్యాచ్ మహిళా పైలట్లు. ‘డోర్నియర్ ఆపరేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్’ (డి.ఓ.ఎఫ్.టి.)ను విజయవంతంగా పూర్తి చేసిన ఈ మహిళల చేతికి నేవీ ఇప్పుడు డోర్నియర్ నిఘా విమానాలు నడిపే బాధ్యతను అప్పగించబోతోంది! ‘పాసింగ్ అవుట్ పరేడ్’ కు ముఖ్య అతిథిగా హాజరైన రియర్ అడ్మిరల్ ఆంటోనీ జార్జి.. ‘నేవీకి ఇది చరిత్రాత్మకమైన రోజు’ అని దివ్య, శుభాంగి, శివాంగిలను అభినందించారు. నేవీ పైలట్లుగా దివ్య (ఢిల్లీ), శుభాంగి (యు.పి.), శివాంగి (బిహార్) మొదట ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రాథమిక శిక్షణ పొందారు. గత ఏడాది డిసెంబరులో శివాంగి, ఈ ఏడాది ఆరంభంలో మిగతా ఇద్దరు ఎయిర్ ఫోర్స్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. అనంతరం నేవీ ఈ ముగ్గురిని కొచ్చిలో డి.ఓ.ఎఫ్.టి. శిక్షణకు పంపింది. వీళ్లతోపాటు మరో ముగ్గురు పురుషులు ఆ ట్రైనింగ్ తీసుకున్నారు. నెల రోజులు గ్రౌండ్ ట్రైనింగ్, ఎనిమిది నెలలు ఫ్లయింగ్ ట్రైనింగ్. గ్రౌండ్ ట్రైనింగ్‌లో లెఫ్టినెంట్ శివ, ఫ్లయిట్ ట్రైనింగ్‌లో లెఫ్టినెంట్ దివ్య ప్రథమ స్థానంలో నిలిచారు. ఎయిర్‌ఫోర్స్‌లో ముందుగా శిక్షణ పూర్తి చేసుకున్న శివాంగి స్వస్థలం ముజఫర్‌పుర్. తండ్రి ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్. తల్లి గృహిణి. శివాంగి మెకానికల్ ఇంజినీరింగ్ చేసి, ఎంటెక్‌లో చేరారు. నేవీలో అవకాశం రావడంతో మధ్యలోనే ఆపేశారు. శుభాంగి స్వరూప్ స్వస్థలం యూపీలోని బరేలీ. భారత నౌకాదళంలో తొలి మహిళా పైలట్. 2017లో ఎళిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో ఆఫీసర్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. తమిళనాడులోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీ ఇంజినీరింగ్ చేశాక, హైదరాబాద్‌లోని ఎయిర్స్‌ఫోర్స్ అకాడమీ నుంచి శిక్షణ పొంది, తర్వాత నేవీలోకి మారారు. కరాటే ఛాంపియన్ కూడా. శుభాంగి తండ్రి నేవీ అధికారి. తల్లి నేవీ స్కూల్లో టీచర్. దివ్య, శుభాంగి, శివాంగి.. ఈ ముగ్గురు పైలట్లు డోర్నియర్ బాధ్యతలను స్వీకరించనుండటంతో నేవీలో సందడి నెలకొంది. గత నెలలో కూడా రితీసింగ్, కుముదినీ త్యాగీ అనే నేవీ సబ్లెఫ్టినెంట్లు ‘అబ్జర్వర్’ కోర్సును పూర్తి చేసి యుద్ధనౌకల్లోని ఫైటర్ హెలికాప్టర్ల తొలి మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించారు. -
డీఆర్ కాంగోలో కూలిన విమానం
గోమా: ఆఫ్రికా దేశం డీఆర్ కాంగోలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. కాంగోలోని విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటల సమయంలో విమానం టేకాఫ్ అవుతుండగా ఇళ్ల మధ్యలో కూలింది. ఇందులో 19 మంది ప్రయాణికులు సహా కొందరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. గోమా నుంచి బయలుదేరిన బిజీబీ ఎయిర్ లైన్స్‌కు చెందిన డోర్నియర్–228 రకం విమానం 350 కిలోమీటర్ల దూరంలోని బెని చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. -
త్వరలోనే మేడిన్ ఇండియా ఫ్లైట్‌లో జర్నీ
న్యూఢిల్లీ : ఇక త్వరలోనే మీరు మేడిన్ ఇండియా విమానంలో ఎగరవచ్చు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించిన డార్నియర్ 228ను పౌర విమానాలుగా వాడేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అనుమతి ఇచ్చింది. 19 సీట్ల ఎయిర్‌క్రాఫ్ట్ అయిన డార్నియర్, ప్రస్తుతం రక్షణ దళాల కోసం వాడుతున్నారు. వాణిజ్యవసరాల కోసం దేశంలో రూపొందించిన తొలి విమానం ఇదే. డీజీసీఏ ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కు సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ విమానాన్ని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, విమానయాన సంస్థలకు విక్రయిస్తోంది. ఉడాన్ స్కీమ్ కింద మోదీ ప్రభుత్వంలో వీటిని ప్రాంతీయ విమానాలుగా వాడుకోవచ్చని సీనియర్ ఏవియేషన్ అధికారి చెప్పారు. ఈ విమానాన్ని వాడుతున్న ఆపరేటర్లకు కొన్ని ప్రత్యేక ప్రోత్సహాకాలు అందిస్తామన్నారు. పౌర సేవలకు వినియోగించేందుకు నేపాల్, శ్రీలంక వంటి దేశాలకు కూడా ఈ విమానాన్ని అమ్మేందుకు హెచ్ఏఎల్ చూస్తోందని తెలిపారు. ఇది బహుళ అవసరాలకు వాడే తేలికైన విమానమని, ఈ విమానాన్ని ప్రత్యేకంగా యుటిలిటీ, కమ్యూటర్ ట్రాన్స్పోర్ట్, థర్డ్ లెవల్ సర్వీసెస్, ఎయిర్‌ట్యాక్సీ ఆపరేషన్స్, కోస్ట్ గార్డ్ డ్యూటీస్ వంటి వాటికోసం రూపొందించామని హెచ్ఏఎల్ చెప్పింది. పౌర సేవలకు ఉపయోగించేందుకు గత నెలలోనే కాన్పూర్ విమానశ్రయంలో ఈ విమానానికి పరీక్షలు కూడా నిర్వహించారు. -
ఎయిర్ క్రాఫ్ట్ డాటా రికార్డర్ లభ్యం..
న్యూఢిల్లీ : నెల రోజుల కిందట అదృశ్యమైన కోస్ట్ గార్డుల డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ కు చెందిన డాటా రికార్డర్ చెన్నై తీరంలో లభ్యమైంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించి కీలక విషయాన్ని కనుగొన్నామని పేర్కొంది. గత నెల 8న డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ అదృశ్యమైన విషయం తెలిసిందే. చివరగా అదే రోజు రాత్రి 9 గంటల తర్వాత చిదంబరం తీరానికి 16 కిలోమీటర్ల దూరంలో దానిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. డిప్యూటీ కమాండెంట్ విద్యాసాగర్, బోర్డు డిప్యూటీ కమాండెంట్ ఎంకే సోని, కో పైలట్ - డిప్యూటీ కమాండెంట్ సుబాష్ సురేష్ లు ఎయిర్ క్రాఫ్ట్ తో సహా అదృశ్యమైన విషయం విదితమే. డోర్నియర్ ను వెతకడానికి 10 షిప్పులు, ఐఎన్ఎస్ సింధూరక్షక్లను వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు.