ఎయిర్ క్రాఫ్ట్ డాటా రికార్డర్ లభ్యం..
న్యూఢిల్లీ : నెల రోజుల కిందట అదృశ్యమైన కోస్ట్ గార్డుల డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ కు చెందిన డాటా రికార్డర్ చెన్నై తీరంలో లభ్యమైంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఎయిర్క్రాఫ్ట్కు సంబంధించి కీలక విషయాన్ని కనుగొన్నామని పేర్కొంది. గత నెల 8న డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ అదృశ్యమైన విషయం తెలిసిందే.
చివరగా అదే రోజు రాత్రి 9 గంటల తర్వాత చిదంబరం తీరానికి 16 కిలోమీటర్ల దూరంలో దానిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. డిప్యూటీ కమాండెంట్ విద్యాసాగర్, బోర్డు డిప్యూటీ కమాండెంట్ ఎంకే సోని, కో పైలట్ - డిప్యూటీ కమాండెంట్ సుబాష్ సురేష్ లు ఎయిర్ క్రాఫ్ట్ తో సహా అదృశ్యమైన విషయం విదితమే. డోర్నియర్ ను వెతకడానికి 10 షిప్పులు, ఐఎన్ఎస్ సింధూరక్షక్లను వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు.