Dr C narayana reddy
-
తెలుగు భాష ఉన్నంతకాలం సినారె ఉంటారు: విద్యాసాగర్‌రావు
గన్‌ఫౌండ్రీ: తెలుగు భాష ఉన్నంత కాలం డాక్టర్ సి.నారాయణరెడ్డి (సినారె) చిరస్థాయిగా నిలిచిపోతారని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం రవీంద్రభారతిలో వంశీ ఆర్ట్ థియేటర్స్, శుభోదయం, సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో సినారె 91వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణకు వంశీ–సినారె–శుభోదయం జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణం ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినారె రచనలపై పరిశోధనలు చేసే అవకాశం కల్పించాలని సినారె కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఆయన ఆలోచనలు, ఆశయాలు నేటితరానికి తెలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. బాలకృష్ణ మాట్లాడుతూ సినారె జాతీయ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి ఎన్టీఆర్‌తో సినారెకు మంచి అనుబంధం ఉందని, తనకు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు. కార్యక్రమంలో సన్‌షైన్ ఆస్పత్రి ఎండీ గురువారెడ్డి, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్, వంశీ సంస్థ వ్యవస్థాపకుడు వంశీరామరాజులతో పాటు సినారె కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
కుదరదు అనడానికీ కుదరదా?
సి. నారాయణ రెడ్డి గొప్ప వక్త. వేదిక ఏదైనా ఆయన ఉపన్యాసం ప్రవాహంలా సాగిపోయి శ్రోతలను ఆనందపరవశులను చేసేది. ఒక నాటక కళాపరిషత్తు నిర్వహించిన పోటీలలో నేను న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. మొదటిరోజు సినారెకు సన్మానం ఏర్పాటు చేశారు. ఒకాయన వేదిక మీద ఉన్నవారిని మితిమీరి పొగుడుతూ ‘‘ఇది నిజంగా మయసభలా ఉంది’’ అన్నాడు. చివరగా సినారె మాట్లాడుతూ ‘‘ఇంతకుముందు మాట్లాడినవారు దీనిని మయసభ అన్నారు. మయసభ అంటే ఉన్నది లేనట్టూ, లేనిది ఉన్నట్టూ కనిపించే ప్రమాదం ఉంది. అయినా పెద్దలమాట కొట్టేయకుండా– ఇంతమంది కవులూ, కళాకారులూ పాల్గొన్న ఈ సభ మయసభ కాదు– వాఙ్మయ సభ అనుకుందాం!’’ అని చమత్కరించారు. సినారె అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పర్యటిస్తున్నప్పుడు ఒక కార్యాలయ ఉద్యోగులు కొన్ని ఆంగ్లపదాలు సూచిస్తూ ‘‘అన్నిటికీ తెలుగులో సరైన పదాలు దొరకవండీ’’ అంటూ వితండవాదం చేశారు. సినారె ముఖం మీద చిరునవ్వు చెరగకుండా చక్కని సమాధానం ఇచ్చారు: ‘‘మనసుంటే మార్గం ఉంటుంది. మీరు ఆలోచించడం లేదు. లీవ్ లెటర్ బదులుగా ‘సెలవు చీటి’ అని రాయండి. గ్రాంటెడ్ అనడానికి ‘అలాగే’ అని రాయండి. రిజెక్టెడ్ అనాలంటే ‘కుదరదు’ అనండి. అదీ కాకపోతే ‘ఊహూ’ అని రాసి సంతకం పెట్టండి!’’ అన్నారు. ఉద్యోగులు మళ్లీ నోరెత్తలేదు. అదృష్టదీపక్ -
భళారే..
-
మనసుకవి ఆచార్య ఆత్రేయ
హైదరాబాద్: మనసుకవి ఆత్రేయ మనసు పై పలు సినిమా పాటలు రాసినా... ఈ రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రగతిశీల దృక్పదం ఉన్న నాటక రచయితగా ప్రసిద్ది పొందారని... కిడాంబి నరసింహాచార్యులుగా సినీ రంగ ప్రవేశం చేశాక ఆత్రేయగా మారారని డా.సి.నారాయణ రెడ్డి గుర్తుచేసుకున్నారు.. మనసు కవి ఆచార్య ఆత్రేయ జయంతి ఉత్సవాల సందర్భంగా అభినందన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన అభినందన-ఆత్రేయ అవార్డుల బహూకరణ సభకు ముఖ్య అతిదిగా విచ్చేసి ప్రసంగించారు. ఆత్రేయ రచించిన ఎన్జిఓ, కప్పలు, విశ్వశాంతి, ఆయనను మహారచయితగా నిలబెట్టాయన్నారు. సినిమా సంభాషణలతోపాటు మాటలు, పాటలు ఛందోబద్ద పద్యాలురాసిన ఆత్రేయ సాహిత్యంలో తన ప్రతిభను చతుర్ముఖంగా ఆవిష్కరించారన్నారు. ఈ సందర్బంగా ప్రముఖ సినీ మాటల రచయిత మరుధూరి రాజా, సినీ గేయ రచయిత వెన్నెలకంటిలను అభినందన-ఆత్రేయ అవార్డులతో ఘనంగా సత్కరించారు.