Dr K Laxman
-
‘విమోచన’ అనడానికి మీకున్న అభ్యంతరాలేంటి?
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ జంకుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినం అంటే.. ఇప్పటి రేవంత్ సర్కారేమో ‘ప్రజా పాలన దినోత్సవం’ అంటోంది. ‘విమోచన’ అనడానికి మీకున్న అభ్యంతరాలేంటి? ఏం అడ్డం వస్తుంది. పాతవస్తీ వరకే పరిమితమైన మజ్లిస్ పార్టీకి చెందిన ఓవైసీలకు అంతలా ఎందుకు భయపడుతున్నారు..? వారిని ప్రసన్నం చేసుకున్వేఉకు చరిత్రనే వక్రీకరిస్తారా..? నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల త్యాగాలు ఇప్పటి తరానికి, భవిష్యత్ తరానికి తెలపద్దా..?రైతులు, కూలీలు, సబ్బండ వర్ణాలు ఏకమై కత్లుళ్లు, గొడ్డళ్లు, వడిసెళ్లు, బరిసెళ్లు, బర్మారు తుపాకులు, రోకలిబండలతో ప్రాణానికి తెగించిన పోరాట చరిత్రను ఇప్పటి తరానికి తెలియకుండా ఎందుకు తొక్కుపెడుతున్నారు.. నాడు నిజాం హైదరాబా్ సంస్థానాన్ని స్వతంత్ర ఇస్లాం రాజ్యంగా మార్చాలని ప్రయత్నించలేదా..? కుదరని పక్షంలో పాకిస్తాన్ తోనైనా కలవాలని భావించలేదా..? కరుడుకట్టిన మతోన్మాది ఖాసి రజ్వీ రజాకార్లకు ఆయుధాలిచ్చి హిందువులపైకి ఉసిగొల్పిన చరిత్రను మర్చిపోయారా..? మనుషులను వరుసలో నిలబెట్టి తుపాకీతో కాల్చి చంపడాలు... చెట్లుకు కట్టి సామూహికంగా ఉరి తీయడాలు.. సజీవ దహనాలు.. మహిళలచే నగ్నంగా బతుకమ్మలు ఆడించడాలు.. హత్యలు, ఆత్యాచారాలు, అఘాయిత్యాలు, దోపిడీలు, దొమ్మీలు.. ఇవన్నీ ఇవన్నీ రజాకార్ల ఆకృత్యాలు కావా..?‘ మా నిజాం రాజు తరతరాలు బూజు’ అని దాశరధి అన్నది నిజం కాదా.. ‘‘ గోల్కొండ ఖిలా కింద నీ ఘోరీ గడ్డం కొడుకో నైజాము సర్కరోడా’’ అన్న పాటలు అమద్ధమా..? ‘‘ రాజు పేరిట అరాజకమునకు-జరిగిన పూజలు చాలింక- రక్కసితనముకు పిశాచవృత్తికి- దొరికిన రక్షణ చాలింక’’ అని కాళోజీ కవితలు రాసింది నిజాంకు వ్యతిరేకంగా కాదా.. మరి ఎందుకు వాస్తవాన్ని అంగీకరించేందుకు నిరాకరిస్తున్నారు..? దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ,, షోయబుల్లా ఖాన్, కొమురం భీం.. వంటి వారి పోరాటాలు ఈ తరం మరచిపోవాలా..? కొందరు విద్రోహ దినం అంటున్నారు.. ప్రజలను రాచి రంపాన పెట్టిన నిజాంను ఓడించడం విద్రోహమా..? ఇది విలీనం కాదు.. విద్రోహం కాదు.. మమ్మూటికీ విమోచనే.. ఏది ఏమైనప్పటికీ.. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం నిర్వహించడం సంతోషమే.. ఇది బీజేపీ విజయం.. తెలంగాణ ప్రజల విజయం.హైదరాబాద్ సంస్థానంలో భాగమై ఇప్పుడు కర్నాటక, మహారాష్ట్రలో విలీనమైన జిల్లాల్లో.. అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం అధికారిక భాగ్యం లేదు. దీనికి కారణం ఓటు బ్యాంకు.. సంతుష్టీకరణ రాజకీయాలు.. ఓవైసీకి భయపడడం.. సెప్టెంబర్ 17న అధికారిక విమోచన వేడుకల కోసం బీజేపీ ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసింది.. 1998 నుంచే ఇందుకోసం ఉద్యమాలు చేశాం.. ప్రజలను చైతన్య పరిచి, మరుగున పడేసిన చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి తెలంగాణ విమోచన యాత్రలు చేశాం.. అమరవీరుల చరిత్రను వెలికి తీశాం.. చారిత్రాత్మక ప్రాంతాలను సందర్భించాం.. అమరధామాలు నిర్మించాం..అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు విస్మరించారు.. తెలంగాణ తెచ్చుకున్నాకయినా అధికారిక వేడుకలు నిర్వహించకుందామంటే.. అప్పటి సీఎం కేసీఆర్ నిరాకరించారు.. అదే కేసీఆర్ ఉద్యమ సమయంలో ‘ విమోచన దినోత్సవం’ నిర్వహించరని అప్పటి ఉమ్మడి పాలకులను నిలదీశారు.. స్వయంగా ఆయనే సీఎం అయినా. మజ్లిస్‌కు భయపడి అధికారికంగా నిర్వహించలేదు.. అధికారిక వేడుకల కోసం తెలంగాణ విమోచన యాత్ర పేరిట నేను స్వయంగా తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ఉద్యమాల్లో పాల్గొన్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకున్నా సరే.. మేం అధికారిక వేడుకలు నిర్వహిస్తామని నరేంద్ర మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు.. 2022లో తొలిసారి కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారిక వేడుకలు నిర్వహించుకున్నాం.. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. అమరవీరులను స్మరించుకున్నారు.. వారి త్యాగాలను కీర్తించారుదేశం నడిబొడ్డన ఉన్న హైదరాబాద్ సంస్థానం రాజైన నిజాం.. ఈ ప్రాంతాన్ని స్వతంత్య ఇస్లామిక్ దేశంగా లేకుంటే.. పాకిస్తాన్‌తో కలపాలని భావించారు. దీనికి తోడు నియంతృత్వ నిజాం పాలనలో.. రజాకార్ల దారుణాలు, అరాచకాలు, ఆకృత్యాలకు ఇక్కడి ప్రజలు నలిగిపోతూ ఉండడంపై నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలత చెందారు. మంచిమాటలో నిజాంను దారికి తెచ్చేందుకు ప్రయత్నించారు.. నిజాం ససేమిరా అనడంతో ఆపరేషన్ పోలో పేరిట పోలీస్ యాక్షన్‌కు శ్రీకారం చుట్టారు.. జె.ఎన్.చౌదరి నేతృత్వంలో భారత్ సైనికులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో.. నిజాం సైన్యం, రజాకార్లు తోకముడిచారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలవడం పటేల్ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..మేమే సాయుధ పోరాటం చేశామని కమ్యూనిస్టులు గొప్పలు చెప్పుకుంటారు.. కానీ ప్రజలు ఎవరికి వారు.. స్వచ్ఛందంగా అందుబాటులో ఉన్న పనిముట్లనే ఆయుధాలుగా చేసుకుని నిజాం, రజాకార్లపై పోరాడారు. ప్రజలు స్వచ్ఛంద పోరాటాన్ని కమ్యూనిస్టులు హైజాక్ చేశారు. కమ్యూనిస్టులు నిజంగానే నిజాంకు వ్యతిరేకంగా పోరాడితే.. నిజాం లొంగిపోయాక కూడా భారత బలగాలలో ఎందుకు పోరాడారు..? అంటే వారి పోరాటం నిజాంకు వ్యతిరేకంగా కాదు.. నిజాం నుంచి స్వాధీనం చేసుకొని రష్యాకు అనుబంధంగా ఇక్కడ స్వతంత్ర కమ్యూనిస్టు రాజ్యం స్థాపించాలనేది వారి కుట్ర. హైదరాబా్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం అనేది వారి ఉద్దేశం కానేకావు.. నిజాం లొంగిపోయాక భారత సైన్యాలతో పోరాటం చేయడం చారిత్రాత్మకం తప్పిదంగా ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణ రెడ్డి అభివర్ణించడం వాస్తవం కాదా..? ఇప్పుడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడినట్లు చెప్పుకోవడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం.ఇప్పుడు మూడోసారి.. అదీ 75 వసంతాలు పూర్తి చేసుకన్న సందర్భంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది... సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తోంది.. 2022లో మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చే సరికి.. గత్యంతరం లేని పరిస్థితుల్లో కేసీఆర్ అధికారిక వేడుకలకు సిద్ధమయ్యారు.. అప్పుడు కూడా విమోచన అనకుండా జాతీయ సమైక్యతా దినం అంటూ తప్పుదోవ పట్టించారు.. ఇప్పుడు రేవంత్ ప్రజాపాలన దినోత్సం అంటున్నారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్.. ఈ మూడు పార్టీలు ఒక్కటే.. బీజేపీ ఒక్కటే తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతుంది.నిజాం వ్యతిరేక పోరాటంలో కొన్ని ఘటనలు..రజాకార్ల తుపాకీ తూటాలకు పరకాల పట్టణం రక్తసిక్తమైంది. వందల మంది ఉద్యమకారులు చనిపోయారు. పరకాల ఘటన మరో జలియన్‌వాలాబాగ్‌గా చరిత్రలో నిలిచిపోయింది.రజాకార్లు అరాచకాలను ఎదుర్కొనేందుకు బైరాస్ పల్లిలో గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేసుకొని, దూరం నుంచే వారి రాకను పసిగట్టేందుకు బురుజులు నిరమించుకున్నారు. రజాకార్ల తోకముడిచేలా చేసిన భైరాన్‌పల్లి చరిత్రను మరచిపోయా.. భైరాన్ పల్లిపై కక్ష గట్టి మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా అందరినీ కాల్చి చంపారు. మహిళలను బలాత్కరించారు. 118 మంది భైరాన్ పల్లి గ్రామ రక్షకదళం సభ్యులు వీరమరణం పొందారు. ఆనాటి వీరోచిత పోరాటాలకు భైరాన్ పల్లి బురుజు ఇప్పటికీ సాక్ష్యంగా నిలుస్తుంది.నిర్మల్‌లో రాంజీగోండుతో పాటు వెయ్యి మందిని మర్రిచెట్టుకు సామూహికంగా ఉరి తీశారు. ఆ మర్రి ‘ గోండ్ మర్రి’. ‘‘ ఉరులమర్రి’’గా ప్రసిద్ధి చెందింది. చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లిలో రజాకార్లు 200 మంది గ్రామస్థులను హతమార్చి సమీపంలో బావిలో పడేశారు.. 100 మంది మహిళల పుస్తెలు తెంపుకొనొ ఎత్తుకెళ్లారుభువనగిరి తాలూకాలో రేణిగుంట గ్రామస్థులు రజాకార్లతో జరిపిన పోరాటంలో 26 మంది అమరులయ్యారు.జనగాం తాలూకా కాల్కొండలో రజాకార్లు 13 మంది గ్రామస్థులను కాల్చి చంపారు.జనగాం తాలూకా కూట్గల్లో 1948 ఆగస్టు 25న 23 మంది సాయుధ రైతాంగ పోరాట సభ్యులను చంపిచ రజాకార్లువరంగల్, సూర్యాపేటలో శాంతియుత ర్యాలీ చేస్తున్న కార్యకర్తలపై కాల్పులు, 6 మంది దుర్మరణం,, మృతుల్లో కొడిలూరి లచ్చయ్య.కప్పం కట్టాలంటూ గద్వాల తాలూకాలోని ఓ గ్రామంలో రజాకార్ల కాల్పులు, నలుగురు దుర్మరణం.కరీంనగర్ జిల్లాలోని గారిపల్లి, మూసఖాన్ పేట్, ఇండ్లను తగులబెట్టిన రజాకార్లు.ఖమ్మం జిల్లా మధిర తాలూకాలోని మీనబోలులో ఆరుగురు గ్రామసంరక్షకులను పొట్టన పెట్టుకున్న రజాకార్లు. ఇవి మచ్చుకు కొన్ని ఇలాంటి ఘటనలు ఎన్నో ఎన్నెన్నో జరిగాయి.-డా. కె.లక్ష్మణ్, ఎంపీబీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు -
జాతీయస్థాయిలో కేసీఆర్‌కు స్థానం లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఇస్తామంటుంటే ఆయన మాత్రం భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) పెడతా మంటూ దేశమంతా తిరుగుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో కేసీఆర్‌కు స్థానం లేదని వ్యాఖ్యానిం చారు. గ్రామపంచాయతీలకు నేరుగా కేంద్రం నిధులు మంజూరు చేస్తోందని, నరేంద్ర మోదీ పాలనలో దళారి పాత్ర లేకుండా లబ్ధిదారుల ఖాతాలో నగదు చేరుతుండటాన్ని కేసీఆర్ సహించలేక లొల్లి చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఇక్కడ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంబీసీల సదస్సులో లక్ష్మణ్ మాట్లాడుతూ ఎంబీసీ కులాలకు మోదీ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తోందన్నారు. పీఎం మత్స్య సంపద పేరుతో అద్భుతమైన పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని చెప్పారు. ఎంబీసీల రాజకీయ ఏకీకరణ కోసం మోదీ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న ఓబీసీలకు కేసీఆర్ కేవలం మూడే మంత్రి పదవులు ఇచ్చారని, ఇదే కేసీఆర్ గొప్పగా చెప్పే సామాజిక న్యాయమని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాం లో ఎంబీసీ వర్గాలు మోసపోయాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ బీజేపీ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ను రాష్ట్ర ఓబీసీ మోర్చా నేతలు సన్మానించారు. ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్ దొమ్మాట వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నేతలు సూర్యపల్లి శ్రీనివాస్, యాదగిరి, రాజేశ్వరి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్, గడీల శ్రీకాంత్, ఉడుత మల్లేశ్, కడకంచి రమేశ్, పూస రాజన్న, జ్ఞానేశ్వర్, నందనం దివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీతోనే బడుగుల అభ్యున్నతి: రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్
గన్‌ఫౌండ్రి(హైదరాబాద్): బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యమని రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. సాధారణ కార్యకర్త సైతం అత్యున్నత పదవిని అందుకోవడం బీజేపీలోనే జరుగుతుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై శనివారం హైదరాబాద్‌కు వచ్చిన లక్ష్మణ్‌కు బీజేపీ రాష్ట్ర శాఖ ఘనస్వాగతం పలికింది. అనంతరం నాంపల్లిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందనేందుకు తన ఎన్నికే నిదర్శనమన్నారు. యూపీ అభివృద్ధిపై గతంలో మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారని, తనతో పాటు వస్తే ప్రగతిని చూపిస్తానని చెప్పారు. యూపీలోని బుల్డోజర్ తరహా పాలన తెలంగాణలోనూ వస్తుందన్నారు. బీజేపీకి కులం, మత భేదాల్లేవని.. పేదరికమే ప్రాథమికం గా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో సగం జనాభా ముస్లింలేనని, అక్కడ వారికి సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖలో పాత, కొత్త కలయికల వైరం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఈటల రాజేందర్, స్వామిగౌడ్, వివేక్‌వెంకటస్వామి వంటి వారు బీజేపీలో చేరారని వివరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభ్యులు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు, మాజీ శాసన సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఘన స్వాగతం ... లక్ష్మణ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా, సెంట్రల్ హైదరాబాద్ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, డాక్టర్ ఎన్. గౌతమ్ స్వాగతం పలికారు. శంషాబాద్, ఆరాంఘర్ చౌరస్తా, మెహదీపట్నం మీదుగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ఓపెన్‌టాప్ జీప్‌లో ప్రయాణించిన లక్ష్మణ్ పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమ్‌రాజ్, ఎస్సీసెల్ ప్రొటోకాల్ కో–కన్వీనర్ కె. ప్రశాంత్, హైదరాబాద్ నాయకులు సూర్యప్రకాశ్, సందీప్‌యాదవ్ తదితరులున్నారు. -
రాజ్యసభకు డాక్టర్ కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు ఆ పార్టీ రాజ్యసభ చాన్స్ ఇచ్చింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, సీనియర్లకు సముచిత గౌరవం ఇవ్వడం లక్ష్యంగా పార్టీ అధిష్టానం లక్ష్మణ్‌కు ఈ అవకాశం ఇచ్చినట్టుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. యూపీ నుంచి లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపనున్నారు. ఈ మేరకు నామినేషన్ వేసేందుకు ఆయన మంగళవారం యూపీలోని లక్నోకు వెళ్లనున్నారు. తనకు రాజ్యసభ అవకాశం కల్పించడం పట్ల కె.లక్ష్మణ్ సంతోషం వ్యక్తంచేశారు. ‘‘సాధారణ కార్యకర్తకు లభించిన గౌరవం, గుర్తింపు ఇది. బీజేపీ తప్ప మరే పార్టీలోనూ ఇది సాధ్యం కాదు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు’’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఏబీవీపీ నుంచి మొదలై.. 1956 జూలై 3న హైదరాబాద్‌లో జన్మించిన లక్ష్మణ్.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, పీహెచ్డీ చేశారు. ఆయనకు భార్య ఉమ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బీసీ–మున్నురుకాపు çవర్గానికి చెందిన లక్ష్మణ్ ఓయూలో చదువుతున్నపుడే అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో పనిచేశారు. 1980లో బీజేపీలో చేరారు. 1995–1999 మధ్య పార్టీ హైదరాబాద్ నగరశాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. 2016–2020 మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలోనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా.. 1994లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కోదండరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 1999లో అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. తర్వాత 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2020 సెప్టెంబర్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా నియమితులయ్యారు. తెలంగాణ నుంచి బీజేపీ తరఫున మొదటిసారిగా రాజ్యసభకు వెళ్తున్నది లక్ష్మణే కావడం గమనార్హం. -
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్’ అమలు చేయాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకుండా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దూరం చేస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ అన్ని రాష్ట్రాలలో అమలవుతుంటే తెలంగాణలో అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం చిక్కడపల్లిలో బీజేపీ రాంనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు సివేగి బాలు, కె.ఉపేందర్ ఆధ్వర్యంలో ఈ–శ్రమ్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 300లకు పైగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కె.రవిచారి, జి.భరత్‌గౌడ్, జైపాల్‌రెడ్డి, సి.పార్ధసారథి, గడ్డం నవీన్, ప్రవీణ్ నాయక్, కిరణ్, లోక్యానాయక్, రమణయ్య, సంపత్‌రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. -
నిరంతర శ్రామికుడు మన ప్రధాని
సెప్టెంబర్ 17.. తెలంగాణ తరతరాల బానిస సంకెళ్లను తెంచుకుని స్వాభిమానంతో తలెత్తుకున్న రోజు.. నాడు ఈ దేశహోంమంత్రి సర్దార్ పటేల్ అప్పుడే స్వాతంత్య్రం పొంది, స్వదేశీ సంస్థానాలను ఏకం చేసే పనిలో భాగంగా తెలంగాణకు విముక్తి కల్పించి, దేశ ఏకత్వాన్ని సంపూర్ణం చేస్తే.. నేడు దేశం అవినీతి కోరలలో చిక్కుకుని దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లో నలిగి, కృశించిపోతున్న సమయంలో నరేంద్రమోదీ ప్రజలకు ఒక ఆశాకిరణంగా కనిపించి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశానికి 70 ఏళ్ల తర్వాత అన్ని రంగాల్లోనూ అంతర్జాతీయ ప్రతిష్ట తెచ్చాడు. నాడు సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేసే తన పనిని సెప్టెంబర్ 17 నాడు పూర్తి చేస్తే, నేటి నరేంద్రమోదీ జన్మదినం సెప్టెం బర్ 17 కావడం యాదృచ్ఛికం. ఇలా సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజ లను జాతీయ సంఘటనా పథంతో కలపడం తెలంగాణ సుకృతం. 2004–14 మధ్యకాలంలో సోనియాగాంధీ నేతత్వంలో ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వం హయాంలో ఎన్నో జరిగాయి. ఆ ప్రభుత్వం చేయని కుంభకోణం లేదు. జరుపని అవినీతి లేదు. భూమ్యాకాశాలను ఏకం చేసిన మహా స్కాంలు ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. ఇలాంటి దుస్థితినుండి ఈ దేశాన్ని కాపాడేందుకు దేశ ప్రజల్లో 2014కు ముందు ఓ ‘నిశ్శబ్ద విప్లవం’ వచ్చింది. దేశ ప్రజలం దరూ సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్రమోదీని ఈ దేశ కాపలాదారుగా చేద్దామనుకొన్నారు. అంతే..! దేశం ఓ భరతమాత ముద్దుబిడ్డను అక్కున చేర్చుకొంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ తన పని తాను చేసుకొంటూ గుజరాత్‌ను ఒక ఆదర్శ అభివద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దారు. 2004లో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం మోదీని అనేక విషమ పరీక్షలకు గురిచేసింది. అనేక విధాలుగా ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించి చిరాకు కలిగించింది. అయినా ‘ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్’ అన్నట్లుగా మోదీ రాచమార్గంలో వెళ్లిపోయారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, మునుపెన్నడూ లేనివిధంగా పార్లమెంటునే దేవాలయంగా భావించి, అవినీతి రహిత సుపరిపాలనలో తన ముద్ర వేసి తన ప్రతి అడుగూ దేశ ప్రజలవైపు, తన ప్రతి రక్తపుబొట్టూ దేశం కోసం, తన ప్రతిక్షణం భారతమాతకు అంకితం చేస్తూ ఈ రోజు ప్రజాదరణ పొందిన ఏకైక నాయకుడిగా నిలిచారు. 2019లో అఖండమైన మెజార్టీతో రెండవసారి ప్రధాని అయ్యాక ఈ దేశం మునుపెన్నడూ చూడని అద్భుతమైన విజయాలను మోదీ స్వంతం చేసుకొన్నారు. అయోధ్య, కాశ్మీర్ ఆర్టికల్ 370, 35ఎ రద్దు, ముస్లిం మహిళల కష్టాలను తీర్చే ట్రిపుల్ తలాక్ చట్టం రూపకల్పన, ఇతర దేశాలలో మైనార్టీలయిన హిందువుల కష్టాలు తీర్చే సిఎఎ చట్టం వంటి చట్టాలను ఎంతో సాహసవంతంగా తెచ్చి అన్ని వర్గాల ప్రజల గుండెల్లో విలువైన స్థానం సంపాదించారు. కరోనా జీవాయుధాన్ని ప్రపంచ మానవాళిపై వదిలి చోద్యం చూడటమే గాక, భారత్‌ను.. ఇతర ఇరుగు పొరుగు దేశాలకు చీకాకులు కలిగిస్తున్న చైనా నడ్డి విరవడంలో నేడు మోదీ చూపిస్తున్న తెగువ, సాహసం అనన్యసామాన్యం. అతి భారీ విస్తీర్ణం, అత్యంత ఆయుధ సంపత్తి కలిగిన చైనా పట్ల ఇటువంటి కఠిన వైఖరి అవలంబించడానికి ఇంతకుముందటి మనదేశ ఏ నాయకుడూ కనీసం ఆలోచన చేసే ధైర్యం కూడా చేయలేకపోయారు. కానీ నేడు మోదీ ప్యాంగాంగ్ సరస్సులోని కొండ శిఖరాలను భారత స్వాధీనంలోకి తెచ్చారు, చైనా వస్తువులను వాడొద్దని ప్రజలకు పిలుపునిస్తూ, చైనా యాప్స్‌ను నిషేధిస్తూ, ఆర్ధికంగా, సైనికంగా అనూహ్య ఎత్తుగడలతో చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దేశంలో ప్రతి ఎన్నికల ముందూ మోదీకి వ్యతిరేకంగా ఏదో ఒక యుద్ధ వాతావరణం సృష్టించి, తమ పబ్బం గడుపుకొనే ప్రయత్నాలు చేసిన ప్రతిపక్షాలకు మోదీ ఎప్పటికప్పుడు తన సత్తా చూపిస్తూనే దేశ ప్రధానిగా నిప్పు కణిక వలె తన స్వచ్ఛతను నిరూపించుకుంటూనే ఉన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ చోక్సి, లలిత్ మోదీ వంటి అవినీతిపరులను నరేంద్రమోదీయే తయారుచేశారంటూ నోరు పారేసుకున్నారు. కానీ వాళ్లను ఎవరు తయారుచేశారనేది ప్రజలకు తెలుసు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 2008 వరకు మన బ్యాంక్‌లు 18 లక్షల కోట్లు అప్పులు ఇస్తే, యూపీఏ పాలనలో 2008 నుండి 2013 వరకు కేవలం ఆరేళ్లలో 34లక్షల కోట్ల ఋణం ప్రభుత్వం ఇచ్చింది. ఎగవేతదారులకు బ్యాంక్ తలుపులను బార్లా తెరచిన వారే నీతులు చెపుతూ మోదీపై దుష్ప్రచారం చేయడం ప్రజలు పూర్తిగా గమనించే 2019లో తమ తీర్పు వెలువరించారు. మోదీకి మరింత మెజారిటీ కట్టబెట్టారు. తనను తాను దేశ ప్రధాన మంత్రిగా కాక, ప్రధాన సేవకుడిగా చెప్పుకుంటూ; ఒక్కరోజూ తన క్షేమం చూసుకోకుండా, ప్రతిరోజూ రోజుకు 20 గంటల పాటు దేశ సంక్షేమం కోసం కష్టపడే వ్యక్తి మనదేశ ప్రధాని కావడం భారతీయులందరి అదృష్టం. ఆ కర్మయోగికి జన్మదిన శుభాకాంక్షలు. (నేడు ప్రధాని మోదీ జన్మదినం) వ్యాసకర్త: డా‘‘ కె.లక్ష్మణ్, భాజపా నాయకులు, తెలంగాణ -
బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో యుద్ధబేరి
-
రేపతి నుంచి తెలంగాణ విమోచన యాత్ర
-
మా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది: లక్ష్మణ్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవటం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. ఇందుకోసం అతి శక్తివంతమైన బ్రహ్మాస్త్రం తమ వద్ద ఉందని, అదే ప్రధానమంత్రి మోదీ అని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మాస్త్రం అణుబాంబు కంటే శక్తివంతమైనదని వివరించారు. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ మీట్‌ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ఈనెల 22వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని చెప్పారు. అమిత్‌షా నల్లగొండ జిల్లాలో పర్యటించటంతోపాటు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నాయకులతో సమావేశమవుతారని వివరించారు. ఈ నియోజకవర్గంలో 1984 ఎన్నికల నుంచి ఎంఐఎం అభ్యర్థి విజయం సాధిస్తున్నందున దీనిపై తమ నాయకత్వం దృష్టిపెట్టిందని వెల్లడించారు. అమిత్‌షా సమావేశం తర్వాత నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి పార్టీ కార్యకర్తలు మోదీ ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తారని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్లోకి మారిన నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్‌లపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని తెలిపారు. దీంతోపాటు ఎస్సీలు, బీసీలు, మైనారిటీలకు ఇతర పార్టీలపై విశ్వాసం తగ్గిందని వారంతా ఇప్పుడు బీజేపీ వైపే చూస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తాము చేపట్టే ప్రచార కార్యక్రమాలు అధికారంలోకి వచ్చేందుకు దోహదపడతాయని లక్ష్మణ్ దీమా వ్యక్తం చేశారు.