Dr. Kalyan Chakravarthy
-
నిద్ర పట్టడం లేదు
నిద్ర పట్టడం లేదంటే.. ఏం మాయరోగం అంటారు పెద్దలు.. నిజమే ఏదో మాయకమ్మినట్లే నగరయువత రానురాను నిద్రకు దూరమౌతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఇంటర్నెట్, సెల్ఫోన్లు, వీడియో గేమ్‌లు, ఎడతెగ ని ఆలోచనలు, వెరసి సిటీజన్ల కంటికి కునుకు పట్టనివ్వడం లేదు. రాత్రి 9 గంటలకే పడకపై హాయిగా సేదతీరాల్సిన వారు తెల్లవారుజామవుతున్నా కూడా మేలుకునే ఉంటున్నారు. ఢిల్లీలో 20 శాతం మంది నిద్రలేమితో బాధపడుతుంటే, వీరిలో అత్యధికులు మార్కెటింగ్, ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారే ఉండడం గమనార్హం. న్యూఢిల్లీ: రోజూ తెల్లవారగానే దాదాపు ఒకే సమయానికి మెలకువ వచ్చేస్తుంది. ఆహారం తీసుకునే సమయం కాగానే ఎవరో చెప్పినట్లు ఆకలేస్తుంది. రాత్రి కాగానే ఒక నిర్ధిష్ట సమయానికే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఏ సమయంలో ఏ పని చేయాలో నిర్దేశించే వ్యవస్థనే ‘బాడీ క్లాక్’ అంటాం. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల ఈ ‘గడియారం’ గాడి తప్పుతోంది. ఒకప్పుడు రాత్రి 8 గంటలకే నిద్రకుపక్రమించిన సిటీజన్లు నేడు పని ఒత్తిడి, మానసిక ఆందోళన వల్ల తెల్లవారుజామవుతున్నా రెప్ప వాల్చడం లేదు. మత్తుకు బానిసలవుతున్నారు... గత రెండేళ్లతో పోలిస్తే నగరంలో నిద్రలేమి బాధితులు సంఖ్య రెట్టింపు అయిందని చెబుతున్నాయి వైద్యవర్గాలు. ఐటీ అనుబంధ రంగాలు విస్తరించడం విదేశీ కాలానికి అనుగుణంగా పనివేళలను మార్చుకోవడం, ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేసేందుకు శక్తికి మించి పని చేయడమే ఇందుకు కారణాలుగా వారు విశ్లేషిస్తున్నారు. బలవ ంతంగా నిద్ర పోయేందుకు బాధితుల్లో చాలా మంది నిద్రమాత్రలు, మద్యం వంటి ఇతర పదార్థాలకు అలవాటుపడుతున్నారు. ఇలా ఒక సమస్య నుంచి బయటపడేందుకు యత్నించి మరో సమస్యలో చిక్కుకుంటున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 35ఏళ్ల లోపువారే ఎక్కువ... ప్రతి 10 మందిలో ముగ్గురు నిద్రలేమితో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 35 ఏళ్ల లోపు వారే. రాత్రి నిద్ర పోకపోవడం వల్ల మానసిక, శారీరక ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్స్‌పై తీవ్రప్రభావం చూపుతాయి. ప్రతి చిన్న విషయానికి కోపం, చిరాకు.. అంతేకాదు అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం తదితర జబ్బుల బారినపడే ప్రమాదం ఉంది. నా వద్దకు వచ్చే రోగుల్లో 20 శాతం మంది నిద్రలేమి బాధితులే. - గుర్గావ్ మేదాంత ఆస్పత్రి మానసిక వైద్యనిపుణుడి మాట సమస్యలెన్నో... కంటినిండా నిద్రలేకపోవడం వల్ల ప్రతి చిన్న విషయానికీ చిరాకు పడుతుంటారు. విపరీతమైన ఆగ్రహం ప్రదర్శించడంతో పాటు మానసిక రుగ్మతల బారిన పడుతుంటారు. పనిచేసే చోట ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఒక్కోసారి చేస్తున్న ఉద్యోగాన్ని సైతం కోల్పోయే అవకాశం లేకపోలేదు. ఒంటిరిగా ఉన్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు తమలో తామే మాట్లాడుకుంటూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. - డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
మొగ్గ విరిసేవేళ...
నాలుగైదేళ్ల చిన్నారులకు అమ్మానాన్నలే అన్నీ ‘మా అమ్మకు అన్నీ తెలుసు, మా నాన్న హీరో, నాన్నను ఎవరూ ఏమీ చేయలేరు’... ఇదీ వాళ్ల ప్రపంచం. తల్లిదండ్రుల వెచ్చటి సంరక్షణలో నచ్చింది తినడం, హాయిగా ఆడుకోవడమే వారికి తెలుసు. సరిగ్గా అలాంటి సమయంలోనే అటు తల్లిదండ్రులను, ఇటు చిన్నారులను కూడా చదువు పేరుతో కాసేపు వేరు చేసేదే స్కూల్. ఈ దశలో తల్లిదండ్రులు తమ చిన్నారులను ఎటువంటి స్కూలుకు పంపాలి... అదే కాస్త పెద్ద పిల్లలైతే, వారు ప్రస్తుతం చదువుతున్న స్కూలు లేదా కాలేజీ మార్చాలా వద్దా అనే ఆలోచనలో మునిగిపోయి ఉన్న తల్లిదండ్రులకోసమే ఈ వారం లాలిపాఠం. రాబోయే విద్యాసంవత్సరానికి జనవరి నుంచే ప్రవేశాలు మొదలవుతుంటాయి కాబట్టి ఇంట్లో మూడేళ్ల పిల్లాడు ఉన్నాడంటే ఆ తల్లిదండ్రులకు ఇది కీలకదశగా అనిపిస్తుంటుంది. బంధువులు, స్నేహితులు ఎవరు కలిసినా ‘మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఆ స్కూలు బాగుందా’ అనే ప్రశ్నలే పలకరింపులవుతుంటాయి. నాలుగేళ్ల పాపాయికి కూడా ఇంట్లో తన గురించే చర్చ జరుగుతోందని తెలుస్తుంటుంది. తల్లిదండ్రుల మాటల్లో తన గురించి, స్కూలు అనే కొత్త పదంతో కలిపి చర్చ జరుగుతోందని తెలుసుకుంటారు. కానీ ‘స్కూలంటే ఏమిటి’ అనే సందేహం కూడా అదే సమయంలో వస్తుంది. ఈ వయసులో పిల్లలు తాము విన్న పదాలను, తెలిసిన పరిసరాలకు మేళవించి విశ్లేషిస్తుంటారు. ఇదే విషయాలను చెప్తూ పిల్లల్లో మానసికపరివర్తన ప్రధానంగా మూడు దశల్లో ఉంటుందన్నారు చైల్డ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి. ఈ పరివర్తనలో భాగంగా విశ్లేషణ ధోరణితోపాటు ‘ఎందుకు, ఏమిటి, ఎలా’ అనే సందేహాలు కూడా కలుగుతుంటాయి. దాంతోపాటు ‘ఒకసారి ప్రయత్నించి చూద్దాం’ అనే ఆసక్తి కూడ కలుగుతుంది. మూడు నుంచి ఐదేళ్ల వయసులో... మంచికి - చెడుకి మధ్య తేడాతోపాటు తమకు రక్షణ ఎవరి దగ్గర ఉందనేది కూడా గ్రహిస్తారు. పిల్లలకు అమ్మకూచి, నాన్న కూచి అనే ముద్ర పడేది ఈ దశలోనే. తనకు ఎక్కువ ప్రేమను ఎవరు పంచుతున్నారు, తన ఇష్టానికి తగినట్లు ఎవరు చేస్తున్నారు... అని విశ్లేషించుకుంటారు. వారితో బాంధవ్యాన్ని పెంచుకుంటారు. సరిగ్గా ఇదే దశలో ఇంటి నుంచి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తల్లి గంటకు మించి కనిపించకపోతే పిల్లల్లో ఆందోళన (స్ట్రేంజర్ యాంగ్జయిటీ) మొదలవుతుంది. ఈ దశలో పిల్లలకు ఇంటికి దూరంగా కొన్ని గంటలు గడపాల్సి రావడం పెద్ద పరీక్ష. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రూపొందినదే ప్లేస్కూల్ విధానం. ప్లేస్కూల్ తల్లిదండ్రుల భూమికను నిర్వర్తించే ప్రదేశం కావాలి. ఈ వయసు పిల్లలు స్కూలుకు వెళ్లడానికి ఏడుస్తున్నారంటే అమ్మానాన్నలు కనిపించనందుకే. ఈ వయసులో స్కూలుకు వెళ్తారు, తోటి పిల్లలతో ఆడుకుంటారు, కొత్తవాళ్లతో మెలగడం నేర్చుకుంటారు... అంతవరకే ఆశించాలి తప్ప ఎంతో చదివేయాలని, పేజీలకు పేజీలు రాయాలని కోరుకోకూడదు. ఎనిమిది నుంచి పదేళ్లు... పిల్లలను ఆందోళనకు గురిచేసే మరో దశ సెకండరీ స్కూల్ సమయం. ‘ఇక ఆటలు తగ్గించుకోవాలి, క్రికెట్, డాన్సు ప్రాక్టీస్ మానేయాలి’, ‘మాథ్స్‌కి ట్యూషన్ పెట్టించాలి, లెక్కలు బాగా చెప్పే మాస్టారు గురించి వాకబు చేయండి’ అనే మాటలే వినబడుతుంటాయి ఇంట్లో. ఒక్కసారిగా మారిపోయిన ఇంటి వాతావరణం పిల్లల్ని బాధ్యతాయుతంగా మారుస్తుంది, అదేసమయంలో కొంతమంది పిల్లల్ని భయస్తులుగానూ మారుస్తుంది. ఆ భయానికి బానిసలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. స్కూలు మార్చడం తప్పనిసరా? ఆరవ తరగతికి స్కూలు మార్చడం నిజంగా అవసరమేనా, స్కూలు మారిస్తే వచ్చే ప్రయోజనాలేంటి, మార్చకపోతే వచ్చే నష్టాలేంటి... అని ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఉన్న స్కూల్లో ఇబ్బంది ఏంటి, ఇదే సమస్య మరో స్కూలులో ఉండవని నమ్మవచ్చా... ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి. మూడోదశ మొదలయ్యే సమయం... పిల్లల పరివర్తన మూడవ దశలో ఉన్నప్పుడు స్కూలు నుంచి కాలేజ్‌కి మారాల్సి ఉంటుంది. కాలేజ్‌ని అధ్యయనం చేయడంలో తల్లిదండ్రుల కోణం, పిల్లల కోణం పరస్పర భిన్నంగా ఉంటాయి. రెండు పార్టీల అభిప్రాయాలను కలబోసుకుని తుది నిర్ణయానికి రావాలి. కొంతమంది పిల్లలు ఇంటర్ మొదటి సంవత్సరంలో ‘కాలేజ్ మారుతాను’ అంటుంటారు. ఆ దశలో కాలేజ్ మార్చడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ‘కొత్త కాలేజ్ అంటే దూరపు కొండలు నునుపు’ వంటిదేనని సర్దిచెప్పాలి. ఆ వయసులో పిల్లలకు తల్లిదండ్రుల కౌన్సెలింగ్ సరిపోదు. నాలుగేళ్ల వయసులో తల్లి, తండ్రిని మించిన వాళ్లు లేరనుకునే ఈ పిల్లలే పదహారు ఏళ్లకు అమ్మానాన్నలకంటే ఎక్కువ తెలిసిన వాళ్లు చాలామంది ఉన్నారనే భావనలోకి వస్తారు. అందుకే స్పెషలిస్టుతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. పిల్లల చదువులో కీలకమైన మూడు దశలు, పిల్లల పరివర్తన చెందే ప్రధానమైన మూడుదశలూ ఒకేసారి కావడం యాదృచ్చికమే. కెరీర్ విషయంలో ఎవరి ప్రాధాన్యాలు ఎలా ఉన్నా, స్థూలంగా అందరూ పాటించాల్సిన అంశాలివన్నీ. - వాకా మంజులారెడ్డి ముద్ర వేయకూడదు! లేబిలింగ్ ఎఫెక్ట్... ‘మా అబ్బాయికి కెమిస్ట్రీ సరిగా రాదు, అమ్మాయికి మాథ్స్ కష్టం’ అని తల్లిదండ్రులు తరచూ అంటుండడం వల్ల పిల్లలు ‘బాబోయ్ కెమిస్ట్రీ నా వల్ల కాదు, మాథ్స్‌లో నేను పాసవడమే గొప్ప’ అని తమకు తామే ప్రకటించుకుంటుంటారు. నిజానికి అది తల్లిదండ్రులు తగిలించే ట్యాగ్. ఫలానా సబ్జెక్ట్‌లో వీక్ అని తెలిసినప్పుడు ‘సోషల్ ఆన్సర్స్ ఒకసారి చదివితే వచ్చేస్తున్నాయి కదా, సైన్స్‌లో అలా రాకపోతే రెండు-మూడుసార్లు ప్రయత్నించాలి అంతే’ అనే ధోరణితో పిల్లలను గాడిలో పెట్టాలి. ఉదాహరణకు - ఒకసారి రన్నింగ్రేస్లో వెనుకబడితే మరో ప్రయత్నం చేసేటప్పుడు ‘నువ్వు రన్నింగ్‌లో వేస్ట్. వద్దులే’ అనడం వల్ల పిల్లల్లో తాము రన్నింగ్రేస్కి ప్రయత్నం చేయకపోవడమే మంచిదనే అభిప్రాయం బలపడుతుంది. ప్రాథమిక పాఠశాల ఎంపిక ఇలా! యుకేజీ పూర్తయ్యేసరికి ఇన్ని రాయిస్తాం అనే స్కూలుకు బదులు పిల్లల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దుతాం అనే స్కూలుకే ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా... ఆలోచనశక్తిని పెంపొందించే వాతావరణం ఉన్న స్కూలుకి మార్కులేయాలి. పిల్లలు ‘తానేంటి’ అని తమకు తాముగా తెలుసుకునే అవకాశం ఉన్న స్కూలు కావాలి. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా ఉండాలి. ఇంటి తర్వాత ఎక్కువ సమయం గడపాల్సిన ప్రదేశం కాబట్టి పిల్లలు ‘భయం లేకుండా మెలగగలగాలి’. ఈ నాలుగు మూలస్తంభాలుగా ఉన్న పాఠశాలలో విద్యాభ్యాసం మొదలైతే పిల్లల్లో వికాసం బాగుంటుంది. హైస్కూలు స్థాయికి వస్తే పిల్లల్ని గ్రూప్ యాక్టివిటీలో పాల్గొనేటట్లు చూసే పాఠశాల అయితే మంచిది. - డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి మానసికపరివర్తన చెందే ప్రధాన దశలు 1. మూడు నుంచి ఐదేళ్లు 2. ఎనిమిది నుంచి పదేళ్లు 3. 14 - 18 ఏళ్లు -
పిచ్చి ఆలోచనలు వేధిస్తున్నాయి...
నా వయసు 27. బిజినెస్ చేస్తుంటాను. నాకు ఇటీవలే పెళ్లయింది. నేనొక చిత్రమైన సమస్యతో బాధపడుతున్నాను. కుటుంబ సభ్యులు ఎవరైనా బయటికి వెళ్లారనుకోండి, వారికి ఏదో యాక్సిడెంట్ అయినట్టు... లేదా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయం. ఎప్పుడూ ఆలోచనలే, అన్నీ నెగటివ్‌గానే ఉంటాయి. దీంతో దేనిమీదా దృష్టిపెట్టలేకపోతున్నాను. భార్యతో కూడా హాయిగా గడపలేకపోతున్నాను. అయితే ఆహారం, నిద్ర విషయాలలో ఇబ్బంది ఏమీ లేదు. దయచేసి పరిష్కార మార్గం చెప్పగలరు. -బి.ఆనంద్, విశాఖపట్నం నిజంగానే మీది బాధాకరమైన సమస్య. యాంగ్జైటీ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్... ఈ రెండింటి మూలంగా తలెత్తే సమస్య ఇది. ఇందులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. మెదడు క్షణం కూడా విశ్రాంతి లేకుండా ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. దాంతో మనసు స్థిమితంగా వుండదు. దీనికితోడు భయం, ఆందోళన మనసును కమ్మేస్తుంటాయి. మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. ఇది ఇలాగే కొనసాగితే గుండెదడ, ఒళ్లంతా చెమటలు పట్టడం, గొంతు ఎండిపోవటం వంటి శారీరకసమస్యలు తలెత్తి, దానిప్రభావం మళ్లీ మెదడుపైనే పడుతుంది. దాంతో ఆలోచనలు అదుపు తప్పటం, చిన్న చిన్న నిర్ణయాలు కూడా తీసుకోలేకపోవటం, ఏ పనీ చేయలేక ప్రతిదానికీ ఇతరుల మీద ఆధారపడటం లేదా దేవుడి మీదనే భారం వేస్తూ, అన్నింటికీ చేతులు ఎత్తేయటం వంటి ఇతర ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. క్రమేణా దీని ప్రభావం తిండి మీదా, నిద్రమీదా కూడా పడి ఏమీ తినాలనిపించకపోవటం, అతి నిద్ర లేదా అసలు నిద్ర లేకపోవటం, మనశ్శాంతి కరువవటం, వింత వింత పనులు చేయటం కూడా సంభవించవచ్చు. దీనికి మీరు చేయవలసిందల్లా ఏమిటంటే... ఇంకా అంతటి తీవ్రమైన పరిస్థితులు తలెత్తకముందే ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్ట్‌ను కలిసి మీ పరిస్థితినంతటినీ వివరించండి. వారు సమస్య తీవ్రతను అంచనా వేసి, అనవసరమైన ఆలోచనలు అదుపు చేయాలంటే ఏమి చేయాలనే దానిపై మీకు కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరాన్ని బట్టి యాంటీ డిప్రెసెంట్స్ వాడవలసి రావచ్చు. మానసిక నిపుణుల సలహా మేరకు మీరు మీ జీవన శైలిలో కూడా చిన్న చిన్న మార్పులు చేయవలసి ఉంటుంది. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
స్పాండిలైటిస్‌కు హోమియోపతితో సంపూర్ణ నివారణ
నేటి మానవ జీవన విధానానికి ఎక్కువ దూరం ప్రయాణించి ఉద్యోగాలు చేయడం, రోజులో 2-4 గంటలు సమయం ప్రయాణానానికి కేటాయించడం, ఆఫీసులో ఎక్కువ సమయం కంప్యూటర్ మీద పనిచేయడం వలన వెన్నెముకపై అధిక ఒత్తిడి వలన స్పాండిలైటిస్‌కు దారి తీయడం సహజం. స్పాండిలైటిస్: వెన్నుపూసల మధ్య జరిగే ఇన్ఫ్లమేషన్ స్పాండిలైటిస్ అంటారు. స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ మధ్య భిన్న వ్యత్యాసం ఉన్నది. స్పాండిలైటిస్ అనేది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఇది ఎక్కువగా 20-40 ఏళ్ళ వయస్సు ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. స్పైనల్ జాయింట్ల మధ్య ఇన్ఫ్లమేషన్ వల్ల ఇది వస్తుంది. స్పాండిలోసిస్ అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్. ఇది ఎక్కువగా 40 ఏళ్ళు పైబడిన వారిలో కనిపిస్తుంది. వెన్నెముకలో ఉండే మృదులాస్థి, దాని చుట్టూ ఉండే కణజాలం డీ జనరేటివ్ మార్పులకు గురి కావడం వలన ఇది వస్తుంది. ఇందులో రెండు పూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదల వలన అధిక ఒత్తిడికి గురి అయినప్పుడు డిస్క్ వాచటం, డిస్క్ బయటికి పొడుచుకొని రావడం వలన వెన్నెముకల మధ్యలో ఉండే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. స్పాండిలైటిస్ గాని, స్పాండిలోసిస్ గాని వెన్నెముకలో ఏ భాగంలోనైనా జరిగే అవకాశం ఉంటుంది. కాని ముఖ్యంగా మెడ దగ్గర (Lovical spondilitis) వెన్నెముక - లుంబార్ స్పాండిలైటిస్ అంటారు. కారణాలు: వెన్నెముకకు దెబ్బలు తగలటం అధిక బరువును ఒక్కసారిగా ఎత్తడం సరి అయిన డ్రైవింగ్ పద్ధ్దతులను పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయడం వలన వెన్నుపూసల మధ్య ఒత్తిడి అధికమై ఈ సమస్య వస్తుంది వయస్సు పెరిగే కొద్ది వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదల వలన కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వలన కూడా ఇది వస్తుంది. (ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్) క్షయవ్యాధి వెన్నెముకకు పాకడం వలన ఇది వస్తుంది. (Potts disease) ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువగా కంప్యూటర్‌మీద పనిచేయడం వలన చిన్న వయస్సువారు కూడా స్పాండిలైటిస్ బారిన పడుతున్నారు. లుంబార్ స్పాండిలైటిస్ లక్షణాలు నడుమునొప్పి, కాలి నొప్పి, నడుము నుంచి క్రింది కాలివేళ్ళ వరకు లాగడం, పిరుదుల్లో నొప్పి, మంటగా ఉండడం, తొడదగ్గర తిమ్మిరిగా ఉండడం. కారణాలు: సియాటికా అనే నరం నడుము నుండి కాలివేళ్ళ వరకు ప్రయాణిస్తుంది. ఈ నరం L4-L5 ఒత్తిడికి గురి కావడం వలన ఈ నొప్పి వస్తూ ఉంటుంది. ఇది లుంబార్ స్పాండిలైటిస్‌లో సర్వసాధారణంగా కనిపించే లక్షణం. కొన్ని సందర్భాలలో దీనివలన పేషెంట్ నడవడం కూడా చాలా కష్టం అవుతంది. కొంతకాలం పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకునే పరిస్థితి వస్తుంది. రకాలు సర్వైకల్ స్పాండిలోసిస్ లుంబార్ స్పాండిలోసిస్ ఆంకిలైజింగ్ స్పాండిలోసిస్ పాట్స్ డిసీజ్ సర్వైకల్ స్పాండిలైటిస్ లక్షణాలు: వెన్నెముకలో వచ్చే ఒత్తిడిని బట్టి లక్షణాలు ఉంటాయి. మెడ దగ్గర నొప్పి రావడం, వెనుక భాగంలో అరల కదలికలో నొప్పి ఎక్కువ కావడం, మెడ, ఛాతి, భుజాలు, ఛాతి మొత్తంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. మంట, మొద్దు బారినట్లుగా ఉండడం, తిమ్మిరిగా ఉండటం జరుగుతుంది. ఈ తిమ్మిరి ఛాతీ నుంచి వీపు వరకు ఉంటుంది. కొన్నిసార్లు తల తిరగడం, వాంతులు కావడం, కళ్ళు మసకబారడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్ ఇది జీవనక్రియల్లో జరిగే మార్పుల వలన వచ్చే ఆటో ఇమ్యూనో డిసీజ్. దీనిలో ముఖ్యంగా వెన్నెముక, దానిచుట్టూ కణజాలం మృదుత్వాన్ని కోల్పోయి వెన్నెముక కదలికలు అన్నీ ఆగిపోయి గట్టిగా కర్రలా తయారవుతుంది. దీనిని ‘బాంబూ’ అంటారు. జన్యుపరమైన కారణాల వలన ఇది ఎక్కువగా సంభవిస్తుంది. ఇది ఎక్కువగా వెన్నెముక, తుంటి ఎముకలు శాక్రో ఇలియాక్ జాయింట్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. అన్నీ మృదుత్వాన్ని కోల్పోయి గట్టిపడి పోతాయి. దానిమూలంగా వెన్నెముకలో సాధారణ కదలికలు నిలచిపోతాయి. ఇది ఎక్కువగా 15-40 ఏళ్ళు వయసు ఉన్న వారిలో కనిపిస్తుంది. దీనిని హెచ్ఎల్బీ-27 అనే పరీక్ష ద్వారా నిర్థారించవచ్చును. లక్షణాలు: వెన్నెముక గట్టిపడి కదలికలను తగ్గించడం వెన్నునొప్పి వెన్నెముక బయటకు పొడుచుకొని రావడం జ్వరం నీరసం, బరువు తగ్గడం. నిర్థారణ పరీక్షలు : ఎక్స్-రే స్పైన్ ఎమ్ఆర్ఐ ఆఫ్ స్పైన్ సీబీపీ, ఈఎస్ఆర్ హెచ్‌సీబీ-27 హోమియో చికిత్స హోమియో వైద్య విధానం ద్వారా కేవలం రోగ లక్షణాలైన నొప్పి, తిమ్మిరి, మంటలు తగ్గించడమే కాకుండా జబ్బు యొక్క మూలాలనుండి పూర్తిగా మరియు శాశ్వతంగా తగ్గించటం. హోమియోకేర్‌లో గ్రూప్ ఆఫ్ డాక్టర్లు స్పాండిలైటిస్ మీద ప్రత్యేకమైన అధ్యయనం చేసి జెనెటిక్ కాన్సిట్యూషన్ సిమ్యూలిమ్ ట్రీట్మెంట్ విధానం ద్వారా దీనిని సంపూర్ణంగా నయం చేయవచ్చని నిర్థారించారు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
ఆయనతో వేగలేకపోతున్నాను.!?
నా వయసు 50, మా వారి వయసు 54. మా పెళ్లై పాతికేళ్లయింది. మావారిది చిత్రమైన స్వభావం. పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉండటం వల్ల ఈయన ఉద్యోగం చేయటంలేదు. టీవీకి అతుక్కుపోయి హెల్త్ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. వాటిలో కొన్ని జబ్బులకి డాక్టర్లు చెప్పిన లక్షణాలలో ఒకటీ అరా తనకు ఉన్నా, ఆ జబ్బును తనకే ఆపాదించుకోవడం, డాక్టర్లు ఉప్పు, కారం, నూనె తగ్గించమంటే ఇంటిల్లిపాదినీ పథ్యం పెట్టడం, అందరినీ తిండి తినద్దంటూ ఇబ్బంది పెడతారు. ఎప్పుడు పడితే అప్పుడు యోగా చేయడం, వర్షం పడుతున్నా, స్విమ్మింగ్కెళ్లటం... ఇంట్లో ఎవరికైనా ఏమైనా సమస్య వస్తే పట్టించుకోరు. ముందు ముందు ఆయనతో జీవితం ఎలా గడపాలో అర్థం కావడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - కృష్ణవేణి, విశాఖపట్నం మీరు రాసిన లెటర్‌ను చదివాక మీరు ఆయనతో ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతోంది. మీ వారి ప్రవర్తన ‘పర్సనాలిటీ డిజార్డర్’ కిందికి వస్తుంది. ఇటువంటి వారు తమకు తోచింది చేస్తూ, ఇతరులు ఏమైపోతున్నా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. ప్రతిదానిలోనూ తమదే కరెక్టనీ, అందరూ తమలాగే ఉండాలనీ, తాము చెప్పిందే చేయాలనీ అనుకుంటారు. ఫలితంగా తమకంటూ స్నేహితులెవరూ మిగలకుండా చేసుకుంటారు. బంధుత్వాలు వదులుకుంటారు. మీది... అన్నీ పద్ధతి ప్రకారం జరగాలనుకునే మనస్తత్వంలా కనిపిస్తోంది. మీ ఇద్దరి స్వభావాలూ పరస్పర విరుద్ధమైనవి. ఇన్నాళ్లపాటు మీరు ఆయనతో అడ్జస్ట్ అవడం అభినందనీయం. మీరు తరచు ఆయన మనస్తత్వం గురించే ఆలోచించడం, బాధపడటం మంచిది కాదు. ఇటువంటివారిని వారి మానాన వారిని వదిలేసి, దేనికీ వారిపై ఆధారపడకుండా, వాదించకుండా మౌనంగా మీ పని మీరు చేసుకోవటం మంచిది. దానిమూలంగా మీరు కూడా మానసికంగా కుంగిపోయి, డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మీరు, ఆయన ఇద్దరూ కలిసి పర్సనాలిటీ డిజార్డర్ సమస్యతో బాధపడేవారిని డీల్ చేయడంలో నిపుణులైన మంచి సైకాలజిస్టును లేదా సైకియాట్రిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవడం అవసరం. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్