Dr. Sudhakar
-
డాక్టర్ వాంగ్మూలాన్ని నమోదు చేయండి
సాక్షి, అమరావతి: మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న అనస్తీషియా వైద్యుడు సుధాకర్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని విశాఖపట్నం జిల్లా జడ్జిని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు వాంగ్మూలం నమోదు నిమిత్తం మేజిస్ట్రేట్‌ను సుధాకర్ వద్దకు పంపాలని సూచించింది. గురువారం సాయంత్రం కల్లా వాంగ్మూలాన్ని సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని మేజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు డాక్టర్ సుధాకర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషించిన వీడియో క్లిప్పింగులను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరుస్తాం డాక్టర్ సుధాకర్ విషయంలో అధికారులు అమానుషంగా ప్రవర్తించారని, దీనిపై జోక్యం చేసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. దీంతోపాటు ఓ వీడియోను కూడా జత చేశారు. అయితే ఆ వీడియోను ఎడిట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫోటోను జత చేశారు. ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్‌గా పరిగణించిన హైకోర్టు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ కేసులో ధర్మాసనం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారని ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద తెలిపారు. కౌంటర్‌ను ఆన్లైన్లో అప్లోడ్ చేశామని వివరించారు. డాక్టర్ సుధాకర్‌ను ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరు పరిచే పరిస్థితి లేదని, ఏడు గంటల పాటు ఆయన ప్రయాణం చేసే స్థితిలో లేరని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన్ను హాజరుపరుస్తామని కోర్టుకు నివేదించారు. ఈ అభ్యర్థనతో అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశామన్నారు. కౌంటర్ కాపీ ప్రత్యక్షంగా తమ ముందు లేకపోవడంతో విచారణను వాయిదా వేయాలని ధర్మాసనం నిర్ణయించింది. కాగా, ఈ సమయంలో కోర్టు సహాయకారిగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ డాక్టర్ సుధాకర్ ఒంటిపై గాయాలున్నాయో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉందని, ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆస్పత్రిలో వైద్యుడి వాంగ్మూలం నమోదు పెదవాల్తేరు (విశాఖ తూర్పు): ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ వాంగ్మూలాన్ని విశాఖ జిల్లా కోర్టు సెషన్స్ జడ్జి శ్రీనివాసరెడ్డి బుధవారం సాయంత్రం నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న వైద్యుడి వద్దకు చేరుకుని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సెషన్స్ జడ్జి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి, మూడో పట్టణ సీఐ కె.రామారావు తదితరులున్నారు. -
ఏసీబీ వలలో వైద్యాధికారి
శివరాంపల్లి: రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ సుధాకర్ సహా సీనియర్ అసిస్టెంట్ రమేష్ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. కామినేని లైఫ్ సర్వీసెస్ సంస్థ నిర్వాహకుడు డాక్టర్ సుమిద్ నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హయత్‌నగర్‌లో ‘కామినేని లైఫ్ సర్వీసెస్’ పేరుతో డాక్టర్ సుమిద్ రోగుల నుంచి రక్త, మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కనీస అర్హతలు లేకుండా రోగుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారని ఓ బాధితుడు 2013లో జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. సదరు అధికారులు ఆ సంస్థను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. కేసును ఉపసంహరించుకోవాలంటే డీఎంహెచ్‌వో నుంచి ఎన్ఓసీ తప్పనిసరి. అర్హత పత్రాలన్నీ చూపించినా కేసు ఉపసంహరణకు సంబంధించిన ఎన్ఓసీ ఇవ్వకపోగా.. బాధితుని నుంచి రూ.లక్ష డిమాండ్ చేశారు. అందుకు ఆయన రూ.40 వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. కన్సల్టెన్సీ బాధితుడు డాక్టర్ సుమిద్ మధ్యాహ్నం 12.30 గంటలకు శివరాంపల్లిలోని జిల్లావైద్యాధికార్యాలయంలోని డీఎంహెచ్‌వో సుధాకర్‌ను కలువగా, సీనియర్ అసిస్టెంట్ రమేష్‌ను కలువాల్సిందిగా సూచించాడు. దీంతో ఆయన రమేష్ వద్దకు వెళ్లి వెంట తెచ్చిన రూ.40 వేలు ఆయనకు ముట్టజెప్పగా, ఆయన వాటిని తీసుకుని డీఎంహెచ్‌వో సుధాకర్‌కు అప్పగిస్తుండగా, ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
తాండూరులో భారీ వర్షం
తాండూరు, తాండూరు టౌన్: తాండూరులో కుండపోతగా వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం 4.30గంటల నుంచి ఆరు గంటల వరకు కురిసిన వర్షం.. తిరిగి అర్ధరాత్రి 12గంటల నుంచి ఉరుములు, మెరుపులతో ప్రారంభమై కుండపోతగా కురిసింది. తెల్లవారుజాము వరకూ భారీ వర్షం పడింది. పట్టణంలో 48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా.సుధాకర్ తెలిపారు. ఈ వర్షం కంది, పత్తి పంటలు విత్తుకోవడానికి అనుకూలమని ఆయన తెలిపారు. భారీ వర్షం కారణంగా పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్లు బురదమయంగా మారాయి. మురుగుకాలువల్లో చెత్తా చెదారం అడ్డుపడటంతో మురుగునీరు వీధుల్లోకి చేరింది. కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళవారం ఉదయం పట్టణ కమిషనర్ గోపయ్య పలువురు కౌన్సిలర్లతో కలిసి కొన్ని వార్డుల్లో పర్యటించారు. పొంగిపొర్లిన వాగులు.. వంకలు.. షాబాద్: భారీ వర్షంతో వాగులు, వం కలు పొంగిపొర్లాయి. వరదనీటి ఉద్ధృతితో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. షాబాద్ మండలం ఎల్గొం డగూడ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామాలు మీరాపూర్, చర్లగూడల్లో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మంగళవారం కురి సిన భారీ వర్షానికి ఆయా గ్రామాల్లో ని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు 3గంటలపాటు వాగు వద్దనే పడిగాపులు కాశారు. కొంతమంది పిల్లలను ఎత్తుకుని వాగు దాటారు. మీరాపూర్ గ్రామానికి వెళ్లే కల్వర్టు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. వర్షం ధాటికి కల్వ ర్టు పూర్తిగా తెగిపోయింది. దీంతో ఆయా గ్రామాలకు వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వానాకాలం వచ్చిదంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని, ఈ విషయాన్ని అధికారులకు, ప్రజాప్రతిని దులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు మండిపడ్డారు.