drink and fight
-
తాగి ఊగుతూ.. ఊగి ఆగతూ.. ఆగి తన్నుకుంటూ.. ఆకతాయిల వీరంగం!
వరంగల్: వరంగల్ ఫోర్ట్‌రోడ్డు వాల్‌మార్ట్ ఎదురుగా ఓ వైన్‌షాపు ఎదుట సోమవారం పట్టపగలు మద్యం మత్తులో ఆకతాయిలు హల్చల్ చేశారు. ఇరువురు స్నేహితులు అతిగా మద్యం సేవించి దుర్బాషలాడుతూ పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈఘటనలో ఇరువురు గాయాలపాలయ్యారు. పోలీసులు వస్తున్నారని అక్కడి నుంచి పరారయ్యారు. వీరి ఫైటింగ్ చూడడానికి స్థానికులు గుమిగూడారు. ప్రతి రోజూ ఉర్సు కరీమాబాద్, జన్మభూమి జంక్షన్, వాల్‌మార్ట్ ఎదుట, శంభునిపేట జంక్షన్, గవిచర్ల క్రాస్‌రోడ్డు, అండర్ బ్రిడ్జి జీపుల అడ్డా, ఇసుక అడ్డా, రైల్వేస్టేషన్ శివనగర్వైపు, చింతల్ ఏరియాల్లో మద్యం మత్తులో ఆకతాయిలు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏరియాల్లో పోలీసులు గస్తీని మరింత ముమ్మరం చేయాలని కోరుతున్నారు. -
తప్పతాగి విమానంలో గొడవ చేసిన మహిళ..
లండన్ : తప్పతాగి విమాన సిబ్బందినే కాక.. తోటి ప్రయాణికులను కూడా ఇబ్బందులకు గురి చేసిన ఓ భారత సంతతి మహిళకు లండన్ కోర్టు ఆరు నెలల శిక్ష విధించింది. వివరాలు.. కిరణ్ జాదవ్(41) అనే మహిళ ఈ ఏడాది జనవరిలో స్పెయిన్‌లోని టెనెరిఫే నుంచి బ్రిటన్‌కి ప్రయాణిస్తుంది. బోర్డింగ్‌కు నాలుగు గంటల ముందే కిరణ్ దాదాపు 6 - 8 బీర్లు.. విమానంలో మరో 6 గ్లాసుల వైన్ తాగింది. అంతటితో ఆగక మరింత మద్యం ఇవ్వాల్సిందిగా సిబ్బందిని కోరింది. కానీ వారు అందుకు నిరాకరించడంతో నానా యాగి చేసింది. కింద కూర్చుని బిగ్గరగా నవ్వుతూ, ఏడుస్తూ.. ముందు సీటులో కూర్చున్న వ్యక్తిని పట్టుకుని గందరగోళం సృష్టించింది. ఆ సమయంలో విమానంలో ఉన్న ఓ ఆఫ్ డ్యూటీ పోలీసధికారి కిరణ్‌ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె అతడిని బూతులు తిట్టడం ప్రారంభించింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో కాస్తా ఎగుడుదిగుడుగా ఉండటంతో విమానం కుదుపులకు గురయ్యింది. దాంతో కిరణ్ ‘మనం చనిపోబోతున్నాం’ అంటూ గొడవ చేయడం ప్రారంభించింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ శుక్రవారం (నిన్న) జరిగింది. విమానంలో తప్ప తాగి ఇతర ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసినందుకు గాను లండన్ కోర్టు కిరణ్ జాదవ్‌కు 6 నెలల జైలు శిక్ష విధించింది. -
తాగి గుడిలోకి వెళ్లొద్దన్నందుకు..
ప్రకాశం, చీరాల రూరల్: తాగి గుడిలోకి వెళ్లొద్దని వారించిన యువకుడిపై ఓ వ్యక్తి బరిసెతో దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన శనివారం రాత్రి స్థానిక హరిప్రసాద్ నగర్లో జరిగింది. క్షతగాత్రుడు ఔట్‌పోస్టు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. విఠల్‌నగర్‌కు చెందిన కట్టిబోయిన శ్రీను మద్యం తాగి హరిప్రసాద్ నగర్‌లోని పోలేరమ్మ గుడిలోకి వెళ్తున్నాడు. పక్కనే నిల్చొని ఉన్న విఠల్ నగర్‌కు చెందిన నెల్లూరి వెంకటేశ్వర్లు అనే యువకుడు కలుగజేసుకుని గుడిలోకి వెళ్లొద్దని చెప్పాడు. శ్రీను, వెంకటేశ్వర్లు మధ్య వాగ్వాదం జరిగింది. కొంతమంది సర్ది చెప్పడంతో ఎవరికి వారు ఇంటికి వెళ్లిపోయారు. మరికొద్ది సేపటి తర్వాత శ్రీను బరిసె వంటి ఇనుప ఆయుధంతో వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి మళ్లీ గొడవ పెట్టుకుని బరిసెతో ఛాతి కుడి వైపున బలంగా పొడిచాడు. వెంకటేశ్వర్లు పెద్దగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న వెంకటేశ్వర్లు తల్లి బయటకు వచ్చి తమ కుమారుడిని ఎందుకు కొడుతున్నావని అడ్డుగా వెళ్లింది. మరింత ఆగ్రహం చెందిన శ్రీను ఆమెను నోటితో కొరికి గాయపరిచాడు. గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రాహుల్, ప్రత్యూష తాగి కొట్టుకునేవారు!
ప్రత్యూషా బెనర్జీ మరణం విషయంలో ఇప్పుడు అనుమానాలన్నీ ఆమె బోయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్‌సింగ్ మీదకే వెళ్తున్నాయి. వీళ్లిద్దరూ కొన్నాళ్లు బాగానే కలిసి ఉన్నా, తర్వాత మాత్రం ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువగానే అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రత్యూష ఇంటి చుట్టుపక్కల నివసించేవాళ్లు కూడా చెబుతున్నారు. వీళ్లిద్దరూ ఈమధ్య కాలంలో తరచు తాగి గొడవపడేవాళ్లని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇద్దరి మధ్య సంబంధాలు అంతగా బాగోలేదని తెలుస్తోంది. ఇక ప్రత్యూష మరణం తర్వాత రాహుల్ రాజ్‌సింగ్ ప్రవర్తన కూడా అనుమానాలకు తావిస్తోంది. తోటి నటీనటులు అతడికి కాల్ చేసేందుకు ప్రయత్నించినా అతడి ఫోన్ మాత్రం స్విచాఫ్ చేసి ఉన్నట్లే వస్తోంది. దీంతో అతడి మీద అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె మరణం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని స్థానికులు, తోటి నటీనటులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప అసలు ఏం జరిగిందో స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. ఇక ప్రత్యూష సూసైడ్ నోట్ విషయం గురించి కూడా పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఆమె ఎలాంటి సూసూడ్ నోట్ రాయలేదని నిన్నటి నుంచి వినిపిస్తుండగా.. తాజాగా మాత్రం ఆమె ఒక నోట్ రాసిందని పోలీసు వర్గాల ద్వారా అనధికారికంగా తెలిసింది. అదే నిజమైతే, చిట్టచివరిగా ఆమె తన ఆవేదన ఎలా వ్యక్తం చేసింది, ఎవరిమీదైనా అనుమానాలు వ్యక్తం చేసిందా.. అసలు నిజంగానే ఆత్మహత్య చేసుకుందా, ఆ లేఖ ఆమె చేతిరాతతోనే ఉందా అనే అనుమానాలన్నీ నివృత్తి అవుతాయి. మరోవైపు, రాహుల్ రాజ్సింగ్ను ముంబై పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అతడి వాంగ్మూలన్ని తాము రికార్డు చేస్తున్నట్లు తెలిపారు.