drink water
-
ప్రత్యామ్నాయ మార్గాల్లో అదనపు ఆదాయం: పువ్వాడ
అఫ్జల్‌గంజ్: ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే కార్గో సర్వీసులు, పెట్రోల్ పంపులతో పాటు తాజా గా మంచినీటి బాటిళ్ల విక్రయానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. సోమవారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుద్ధి చేసిన మంచినీటి బాటిళ్ల (జీవా జలం) విక్రయాలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్... టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, ఈడీలు వినోద్‌కుమార్, యాదగిరి, ఆర్ఎం శ్రీధర్‌తో కలిసి ప్రారంభించారు. -
కోతికి దాహమేసింది.. తర్వాత ఏం జరిగింది?
ఎండల వల్లో, మరేమో కానీ ఈ వానరానికి దాహమేసింది. చుట్టుపక్కల నీళ్లు కన్పించలేదు. ఎదురుగా మాత్రం వాటర్ క్యాన్ ఉంది. దాన్ని కిందకు పడేసింది. అయినా నీరు అందకపోవడంతో చేతితో క్యాన్‌లోని నీటిని లాగి ఇలా దాహం తీర్చుకుంది. ఈ దృశ్యం కర్నూలు జిల్లా మహానందిలో ‘సాక్షి’ కెమెరా కంటపడింది. – మహానంది -
గంగా నీళ్లు శుభ్రంగా తాగొచ్చు..
డెహ్రాడూన్: కరోనా వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్‌డౌన్‌తో పలు నదుల్లోని నీటి కాలుష్యం తగ్గి నాణ్యత పెరుగుతోంది. దేశంలోనే పెద్ద నదిగా గుర్తింపు పొందిన గంగానదిలోని నీరు తేటగా మారుతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాలు స్థానికంగా ఉన్న గంగా నదిలోకి వెళ్లి కలవటం వల్ల తీవ్ర కాలుష్యానికి గురైన విషయం తెలిసిందే. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గంగా నదిలోని కాలుష్యాన్ని తగ్గించడానికి పలు కార్యక్రమాలు చేపట్టాయి. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు రాలేదు. ఇక లాక్‌డౌన్‌తో హరిద్వార్, రిషికేశ్‌లో ప్రవహించే గంగనది నీరు మునుపెన్నడు లేని విధంగా శుభ్రపడి తాగడానికి కూడా ఉపయోగపడతాయని ఉత్తరాఖాండ్ కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. ఇలా గంగానది నీరు తాగే విధంగా కాలుష్యం తగ్గటం 2000వ సంవత్సరంలో ఉత్తారఖాండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అని పేర్కొంది. (లాక్‌డౌన్‌తో మెరుగైన గంగా నది నీటి నాణ్యత) నాణ్యతను బట్టి గంగానది నీరు రెండు వర్గాలుగా విభజించబడింది. మొదటిది నీటిని వడపోసిన తర్వాత తాగడానికి ఉపయోగించడం. మరోకటి తాగకుండా కేవలం స్నానానికి వినియోగించటం. కాగా హరిద్వార్‌లోని హర్ కి పౌరి ప్రాంతంలో ప్రవహించే గంగానది మొదటి వర్గంగా మార్పు చెందింది. ప్రస్తుతం ఈ నీటిని వడపోసిన తర్వాత తాగడానికి వీలుంటుందని శాస్తవేత్తలు తెలిపారు. ఇక గంగానదిలోని ఆక్సిజన్ స్థాయి కూడా పెరిగిందని బయోలాజిక్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ) పేర్కొంది. సాధారణంగా గంగానదిలో 80 శాతం ధూళి, మురుగు నీరు, కాలుష్యం ఉండగా.. లాక్‌డౌన్‌తో గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గంగా నదితోపాటు యమునా నదిలోని నీటి నాణ్యత కూడా మెరుగుపడిందన్నారు. -
నీళ్లగంట మోగెనంట
భాగ్యనగరంలోనూ శనివారం కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నీళ్లగంట మోగింది.స్కూలు విద్యార్థులు సకాలంలో నీరు తాగక పోవడం వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలను గుర్తించిన కేరళ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయులు ‘నీళ్ల గంట’మోగించి వారిని చైతన్యపరిచారు. సత్ఫలితాలిస్తున్న ఈ వార్తలకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం లభించడంతో ఇతర రాష్ట్రాల వారూ దాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇదే స్ఫూర్తితో హైదరాబాద్ డీఈవో వెంకటనర్సమ్మ ‘నీళ్ల గంట’విధానాన్ని నగరంలోని పాఠశాలల్లో అమలు చేసేందుకు నడుంకట్టారు. ఈ మేరకు తన వాట్సాప్ ఆదేశాలతో కొన్ని పాఠశాలల్లో దీన్ని శనివారం ప్రయోగాత్మకంగా అమలు చేయించారు. ఇలా బంజారాహిల్స్ రోడ్ నం.11లోని ఉదయ్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు నీరు తాగేందుకని స్కూల్ సమయంలో మూడుసార్లు ‘వాటర్ బెల్’మోగించారు. పిల్లలంతా హుషారుగా ఆ సమయంలో తాము తెచ్చుకున్న నీటిని తాగారు. ఆరోగ్య సూత్రాన్ని పాటించారు. -
రూ. 500కు ట్రిప్పు నీళ్లు
వేములవాడ : వేములవాడలో భూగర్భ జలాలు అడుగంటిపోయి... చుక్కనీరు దొరకడం కష్టంగా మారింది. ఇండ్లలో ఉన్న బోర్లతో పాటు మున్సిపాలిటీ వారు వేసిన బోర్లు సైతం ఎండిపోతుండటంతో జలఘోష పెరిగిపోతుంది. ఎండాకాలమంతా ఎట్లా గడవాలంటూ జనం ఆందోళన చెందుతున్నారు. రూ. 500 వెచ్చించి ట్యాంకర్ నీళ్లు కొనుక్కొని అవసరాలు తీర్చుకుంటున్నారు. పట్టించుకోని పాలకులు నీటి కొరతపై పాలకులు పట్టించుకోకపోవడంతో కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఇంటిబోర్లు ఎండిపోయాయి. అర్ధరాత్రి వరకు పైప్‌లైన్ నీరు పట్టుకునేందుకు ఆరాటం తప్పడం లేదు. సుట్టపోళ్లు వస్తే ఇక నీళ్ల గోస చెప్పరాదు. వేసవి సెలవులు కొనసాగుతుండటంతో బంధుగణం రాక పెరిగిపోతుందని జనం చెప్పుకుంటున్నారు.మున్సిపాలిటీ వాళ్లు సరఫరా చేసే నీళ్లు ఏమాత్రం సరిపోవడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. రూ. 500కు ట్రిప్పు నీళ్లు నీళ్లు లేనిదే దినం గడవదు. అలాంటి నీళ్ల కోసం ఎములాడ జనం అష్టకష్టాలు పడుతున్నారు. ఇంటి అవసరాల కోసం నీళ్లు కావాలంటే రూ. 500 పెట్టి ట్యాంకర్ నీళ్లు కొనాల్సిందే. చిల్లరగా డ్రమ్మునీళ్లకు రూ. 50 చొప్పున హోటళ్లు, నిరుపేదలు, సామాన్య ప్రజానీకం కొనుక్కుంటున్నారు. జనవరి మాసం నుంచే నీటి పరిస్థితి ఇలా కొనసాగుతుందని జనం మొత్తుకుంటున్నారు. ఎటు చూసినా ట్యాంకర్లే.... భూగర్భ జలాలు అడుగంటి పోతుండటంతో వేములవాడలో నీటి కొరత పెరిగిపోయింది. దీంతో ఇక్కడి ట్రాక్టర్ యజమానులు ఓ ట్యాంకర్ తయారు చేసుకుని నీటి వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇసుక రవాణాపై ప్రభుత్వం, అధికారులు కాస్త కట్టడి చేయడంతో నీళ్ల వ్యాపారం చేసుకున్నది మేలనుకుంటూ ఈ వంక చూస్తున్నారు. దీంతో వేములవాడలో ఇటీవల వందకు పైగా ట్యాంకర్లు రోడ్లపై కనిపిస్తున్నాయి. ప్రైవేట్ బోర్ల వద్ద రూ. 100 చొప్పున నీటిని కొనుగోలు చేసి రూ. 500 ఒక ట్రిప్పు నీళ్లు అమ్మకాలు సాగిస్తున్నారు. అన్నీ వార్డుల్లో అవస్థలే... వేములవాడ పట్టణంలోని 20 వార్డులలో తాగు నీటి కొరత తీవ్రమైంది. అయినప్పటికీ మున్సిపాలిటీ అధికారులు నీటి సరఫరాపై సరైన ప్రణాళికలు రూపొం దించడం లేదు. ఓట్ల కోసం తమ వద్దకు వచ్చుడే కానీ... మా బాధలు పట్టించుకున్న పాపాన పోవడం లేదంటూ బాహాటంగా ఆరోపిస్తున్నారు. తాగునీటి కోసం రూ. 30 లక్షల నిధులు కేటాయిస్తున్నామంటూ మున్సిపల్ సమావేశంలో తీర్మానించారు. ఇబ్బందులు తీరుస్తాం వేములవాడ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించాం. రూ. 30 లక్షలతో తాగునీటి సరఫరా చేసేందుకు ఇటీవలే తీర్మానించాం. అలాగే ఎల్ఎండీ, మానేరు డ్యాం నుంచి వచ్చే నీటిని పొదుపుగా వాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -
మంచినీళ్ల కోసం ఆశ్రమానికి వెళితే..
లక్నో: సామాన్యుడి నుంచి ప్రధాని వరకు దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు ఓ పక్క ఖండిస్తుండగానే అలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఎక్కువగా దళితులపై దాడులు జరిగే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఆశ్రమంలోని చేతిపంపు వద్ద ఓ దళిత తండ్రి, కూతురు నీళ్లు తెచ్చుకున్నారనే కారణంతో కొందరు వ్యక్తులు దాడి చేశారు. వారిని ఇష్టం వచ్చినట్లు కొట్టి గాయపరిచారు. శంబాల్ జిల్లాలోని గున్నార్ ప్రాంతంలోని దుండా అనే ఓ ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పొలంలో పనిచేస్తున్న 13 ఏళ్ల బాలిక దాహంతో నీళ్ల కోసం వెళ్లి ఆశ్రమం వద్ద ఉన్న చేతిపంపువద్దకు వెళ్లగా ఆ బాలికను నీళ్లు తీసుకొవద్దని కొట్టారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు ఆ పాప తండ్రిని కూడా దయలేకుండా దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. దళితులపై దాడి విషయంలో మోదీ ఇటీవల కాస్తంత ఎమోషనల్ గా మాట్లాడిన విషయం తెలిసిందే. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా అంటరానితనం ఇంకా పాటించడం పాపం అని మోదీ అన్నారు. ఎవరికైనా దళితులను కొట్టాలని ఉన్నా, వారిని షూట్ చేయాలని ఉన్నా ముందు తనను కొట్టండని, తనను షూట్ చేయండని.. తన దళిత సోదరీసోదరులను కాదని మోదీ చెప్పారు. అయినప్పటికీ దళితులపై దాడుల ఘటనలు పెరుగుతుండటం గమనార్హం. -
మెట్ట ప్రాంత అభివృద్ధే ధ్యేయం
మర్రిపాడు, న్యూస్‌లైన్: మెట్ట ప్రాంతంలో సాగు,తాగునీరు లేక అవస్థలు పడుతున్నారని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నమాచనూరు, పెద్దమాచనూరు, కదిరినేనిపల్లి, ఖాదర్పూర్ గ్రా మాల్లో ఆయన ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో స మస్యలను తెలుసుకునేందుకు ప్రతి గ్రా మంలో పాదయాత్ర చేస్తున్నానన్నారు. నియోజకవర్గంలో నీళ్లు లేక పొలాలు బీళ్లు అయ్యాయని, పంటలు చేతికందే పరిస్థితి లేదని గౌతమ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కావాలంటూ యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎవరినోట విన్నా జగన్ పేరే వినపడుతోందన్నారు. జగన్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని గౌతమ్‌రెడ్డి కోరారు. జగనన్న సీఎం అయితేనే అభివృద్ధి: ఎమ్మెల్యే మేకపాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పా లన అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఆత్మకూ రు నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నియోజకవర్గ ప్రజలను విస్మరించి తన స్వార్థం కోసం పనులు కేటాయిస్తున్నారని విమర్శించారు. మర్రిపాడు మండలంలో మంత్రి పర్యటనను ప్రజలు బహిష్కరిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను విస్మరించి కాంట్రాక్టర్ స్వార్థం కోసం పనులు చేసి నేడు ప్రజల ముందుకు రావడం భావ్యమా అని మేకపాటి ప్రశ్నించారు. మంత్రి పర్యటించిన మూడుచోట్ల చేదు అనుభవాలు ఎదురయ్యాయన్నారు. భీమవరంలో ప్రొటోకాల్ పాటించకపోవడం దారుణమన్నారు. అధికార బలం ఉందని పోలీసులను వెంట పెట్టుకుని పర్యటించే మంత్రికి త్వరలో ప్రజలు గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే మేకపాటి హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో పుట్టగతులుండవని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు పాపకన్ను రాజశేఖరరెడ్డి, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ పాండురంగారెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ ఇందూరు నారసింహారెడ్డి, నాయకులు బిజివేముల వెంకటసుబ్బారెడ్డి, సన్నపురెడ్డి పెంచలరెడ్డి, మల్లు సుధాకర్‌రెడ్డి, సింహపురి వాణిజ్యమండలి అధ్యక్షుడు శ్రీరామ్‌సురేష్, నెల్లూరు దాల్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, వాసవీ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచికంటి శ్రీనివాసులు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, శంకర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, హజరత్‌బాబు, దశరథరామిరెడ్డి, చంద్రికారెడ్డి పాల్గొన్నారు.