మెట్ట ప్రాంత అభివృద్ధే ధ్యేయం | Focusing on the development of dry | Sakshi
Sakshi News home page

మెట్ట ప్రాంత అభివృద్ధే ధ్యేయం

Published Mon, Dec 30 2013 4:05 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

Focusing on the development of dry

మర్రిపాడు, న్యూస్‌లైన్: మెట్ట ప్రాంతంలో సాగు,తాగునీరు లేక అవస్థలు పడుతున్నారని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నమాచనూరు, పెద్దమాచనూరు, కదిరినేనిపల్లి, ఖాదర్‌పూర్ గ్రా మాల్లో ఆయన ఆదివారం పాదయాత్ర నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో స మస్యలను తెలుసుకునేందుకు ప్రతి గ్రా మంలో పాదయాత్ర చేస్తున్నానన్నారు. నియోజకవర్గంలో నీళ్లు లేక పొలాలు బీళ్లు అయ్యాయని, పంటలు చేతికందే పరిస్థితి లేదని గౌతమ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కావాలంటూ యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎవరినోట విన్నా జగన్ పేరే వినపడుతోందన్నారు. జగన్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని గౌతమ్‌రెడ్డి కోరారు.

 జగనన్న సీఎం అయితేనే
 అభివృద్ధి: ఎమ్మెల్యే మేకపాటి
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పా లన అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఆత్మకూ రు నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నియోజకవర్గ ప్రజలను విస్మరించి తన స్వార్థం కోసం పనులు కేటాయిస్తున్నారని విమర్శించారు. మర్రిపాడు మండలంలో మంత్రి పర్యటనను ప్రజలు బహిష్కరిస్తున్నారన్నారు.
 
 ప్రజా సమస్యలను విస్మరించి కాంట్రాక్టర్ స్వార్థం కోసం పనులు చేసి నేడు ప్రజల ముందుకు రావడం భావ్యమా అని మేకపాటి ప్రశ్నించారు. మంత్రి పర్యటించిన మూడుచోట్ల చేదు అనుభవాలు ఎదురయ్యాయన్నారు. భీమవరంలో ప్రొటోకాల్ పాటించకపోవడం దారుణమన్నారు. అధికార బలం ఉందని పోలీసులను వెంట పెట్టుకుని పర్యటించే మంత్రికి త్వరలో ప్రజలు గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే మేకపాటి హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో పుట్టగతులుండవని మండిపడ్డారు.
 
 ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ  సీఈసీ సభ్యుడు పాపకన్ను రాజశేఖరరెడ్డి, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ పాండురంగారెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ ఇందూరు నారసింహారెడ్డి, నాయకులు బిజివేముల వెంకటసుబ్బారెడ్డి, సన్నపురెడ్డి పెంచలరెడ్డి, మల్లు సుధాకర్‌రెడ్డి, సింహపురి వాణిజ్యమండలి అధ్యక్షుడు శ్రీరామ్‌సురేష్, నెల్లూరు దాల్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, వాసవీ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచికంటి శ్రీనివాసులు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, శంకర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, హజరత్‌బాబు, దశరథరామిరెడ్డి, చంద్రికారెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement