Drinking water grid scheme
-
సుజలం.. సుఫలం
వేసవి ఆరంభమైతే చాలు.. పల్నాడు ప్రాంతాన గుక్కెడు నీళ్లు లేక ఎండిన గొంతులో ఎక్కిళ్లు ఆగేవి కాదు. బోర్ల కోసం రాళ్లను తొలిచి వందల అడుగులు తవ్వినా పాతాళాన ఉన్న గంగమ్మకు పైకి వచ్చే దారి కనిపించేది కాదు. చుట్టాలు గుమ్మంలోకి వచ్చినా ఆప్యాయత పలకరింపులేగానీ, ఆనందంగా చెంబుడు నీళ్లిచ్చే భాగ్యం ఉండేది కాదు. వేసవిలో జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే పరిస్థితులు ఉన్నా గత పాలకులకు పట్టేది కాదు. అందుకే మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం వైపు నూతన ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇకపై సుజలం.. ప్రతి ఇంటా సుఫలం కావాలని నిర్ణయించింది. ప్రతి మనిషికీ రోజుకు వంద లీటర్ల నీరు అందించేలా ప్రణాళికలు రూపొందించింది. జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోనుంది. సాక్షి, అమరావతి : జిల్లాలో తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం కొత్త ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి మనిషికీ 100 లీటర్ల నీరు ఇచ్చేలా సన్నాహాలు చేస్తోంది. జిల్లా రూరల్ పరిధిలో 32.25 లక్షల మంది, అర్బన్ పరిధిలో 12.75 లక్షల మంది ప్రజలకు నీటి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. మరో వైపు జిల్లా వ్యాప్తంగా ఉన్న 9.55 లక్షల పశువులకు నీటి కొరత రాకుండా చేసేందుకు సిద్ధమైంది. దీనికి కోసం సంబంధిత అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం ల్లాలోని కొన్ని ప్రాంతాలకు వాటర్ గ్రిడ్ పథకాన్ని రూపొందించింది. టెండర్లు పిలిచినప్పటీకి పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రస్తుతం ఆ పనులను నిలిపివేశారు. ఎన్నికలకు ముందే ప్రస్తుతం గురజాల శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి జిల్లాకు తాగు నీరు అందించే ప్రణాళికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందించి ప్రాజెక్టు రూపకల్పనకు ప్రాధానత్య ఇవ్వాలని కోరారు. జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండ, పెదకూరపాడు, తాడికొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకరరావు, ఉండవల్లి శ్రీదేవిలు సమావేశంలో తాగునీటి సమస్యను ప్రస్తావించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలు కవరయ్యేలా శాశ్వత ప్రాతిపదికన తాగునీటి పథకానికి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యేక ప్రతిపాదనలు రూపొందించారు. పల్నాడులో తీవ్ర తరం.. జిల్లాలో ప్రధానంగా పల్నాడు ప్రాంతాన్ని తాగునీటి సమస్య పట్టి పీడిస్తోంది. వినుకొండ, చిలకలూరిపేట, రేపలె, సత్తెనపల్లి, మాచర్ల మున్సిపాలిటీలతోపాటు గురజాల, వెల్దుర్తి, బొల్లాపల్లి, ఈపూరు, తాడికొండ, ప్రత్తిపాడు, తుళ్లూరు ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఏడాది జిల్లాలోని పలు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీరు సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసేందులకు కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్తగా రూపొందించిన ప్రతిపాదనలు ఇవే.. జిల్లాలోని 1773 గ్రామాలు, గుంటూరు కార్పొరేషన్‌తోపాటు 13 మున్సిపాలిటీలకు నీరిచ్చేలా అంచనాలు రూపొందించారు. ఇందుకోసం 7.75 టీఎంసీలు, అర్బన్ ప్రాంతంలో 1.88 టీఎంసీల నీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో తాజా ప్రతి మనిషికీ 100 లీటర్లు, పశుజాతికి 30 లీటర్లు నీరు ఇచ్చేలా ఆర్డబ్ల్య ఎస్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దీంతోపాటు 10 శాతం పరిశ్రమలు, టూరిజానికి అదనంగా ఉండేలా చూస్తున్నారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి మాచర్ల, గురజాల, పిడుగురాళ్ల నియోజకవర్గాలకు, బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, నియోజక వర్గాలకు నీరందించనున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి సత్తెనపల్లి, తాడికొండ, ప్రత్తిపాడు, ప్రకాశం బ్యారేచి నుంచి మంగళగిరి, తెనాలి, వేమూరు, రేపల్లె, బాపట్ల ప్రాంతాలకు నీరు ఇవ్వాలని ప్రాథమికంగా అంచనాలు రూపొందించారు. ఇందుకోసం రూ.6090 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు అధికారులు వాటర్ గ్రిడ్ రూపకల్పన చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం దీనిని పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. -
వారి గోడు వినేదెవరు?
వారంతా మారుమూల గిరిజన గ్రామంలోనివసిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే నేతలకు వారు గుర్తుకొస్తారు. మైదాన ప్రాంతానికి రావాలంటే సరైన రహదారి సౌకర్యం ఉండదు. తాగడానికి సురక్షిత నీరు లభ్యం కాదు.అత్యవసర వేళ వైద్యం అందదు. ఇన్ని కష్టాలకోర్చి జీవిస్తున్న వారిని అనుకోకుండా మండల తహసీల్దార్ ఆదివారం అక్కడకు వెళ్లారు. దాదాపు పదికిలోమీటర్ల దూరం కొండలు... గుట్టలు ఎక్కి వెళ్లి అక్కడివారి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. శృంగవరపుకోట రూరల్ : గిరిజన పల్లెల్లో సౌకర్యాలు లేక అక్కడ నివసిస్తున్నవారి పరిస్థితులు అగమ్యగోచరంగా మారుతున్నాయి. మండలంలోని దారపర్తి గిరిశిఖర పంచాయతీ శివారు రాయపాలెం గిరిజనుల బాధలు చూస్తే ఎంతటివారికైనాగుండె తరుక్కుపోతుంది. ఆదివారం కాలినడకన దారపర్తి పంచాయతీ పల్లపుదుంగాడలో పోలింగ్ కేంద్రం పరిశీలనకు వెళ్లిన తహసీల్దార్ పి.రామారావు మార్గమధ్యంలో కనిపించిన రాయపాలెం గిరిజనులను పలకరించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ గెడ్డలో ఏర్పాటు చేసిన వాటర్ టబ్బులో నీటి ఊట అడుగంటడంతో కలుషితం లేని మంచినీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ టబ్బులో నీటి ఊట అడుగంటడంతో సమీపంలోని గెడ్డలో గల చలమల నీరే దిక్కవుతోందని పేర్కొన్నారు. గ్రామానికి సమీపంలో గల మరో బావిలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ కొద్ది సంవత్సరాల క్రితం ఒక గిరిజన మహిళ అందులో పడి ఆత్మహత్య చేసుకోవటంతో ఆ నీటిని అప్పటి నుంచి తెచ్చుకోవటం మానేశామని గిరిజనులు వివరించారు. తక్షణమే బావిని పునరుద్ధరిస్తా... వాడకుండా వదిలేసిన బావి పరిసరాలను గిరిజనులంతా కలిసి శుభ్రం చేసి తనకు తెలియజేస్తే వెంటనే బావి నీటిని జనరేటర్ సాయంతో రెండుసార్లు తోడించి బయటకు వదిలేద్దామని, అనంతరం ఊరే నీటిని మోటార్ సాయంతో గ్రామ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసే ట్యాంక్‌కు వచ్చేలా పనులు చేయిస్తామని, దీనిపై సంబంధిత గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఏఈ, ఇతర అధికారులతో చర్చించి, సమస్యను పరిష్కరిస్తానని తహసీల్దార్ పి.రామారావు హామీనిచ్చారు. గిరిజనులతో కలిసి గెడ్డలో అడుగంటిన వాటర్ టబ్బు, గిరిజనులు తాగే గెడ్డలో చలమను పరిశీలించారు. వేసవి వచ్చిందంటేకష్టాలు మొదలైనట్టే వేసవి సమీపిస్తుంటే మా పంచా యతీ గిరిజనులు పడే మంచి నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో వృధాగా వదిలేసిన మంచినీటి బావి నీటిని మోటార్ల సాయంతో పైకి తోడించి శుభ్రం చేయిస్తామని అధికారులు చెప్పారు. తరువాత మా గ్రామం వైపు చూడలేదు. ఇప్పటికైనా గిరిజనులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలి.– కాకర అప్పలస్వామి, రాయపాలెం గిరిజనుడు చలమల నీరే దిక్కు.. దారపర్తి పంచాయతీ పరిధి గిరిజనులకు చలమల నీరే దిక్కవుతోంది. వాటర్ టబ్బులను ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా నీటి ఊటలు లేకపోవటంతో మంచినీటి సమస్య తలెత్తుతోంది. గ్రామంలో వాడకుండా వదిలేసిన మంచినీటి బావిని వాడుకలోకి తెస్తామని తహసీల్దార్ ఇచ్చిన హామీ నెరవేరితే మాకు మంచినీటి కష్టాలు తప్పుతాయి.– గెమ్మెల అప్పారావు, రాయపాలెం -
వా(ట)ర్ గ్రిడ్
సాక్షి, హైదరాబాద్: నగర, పట్టణ ప్రాంతాల్లో సైతం డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణ బాధ్యతలను గ్రామీణ నీటి సరఫరా విభాగానికే (ఆర్డబ్ల్యూఎస్) అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రిడ్ నిర్మాణ బాధ్యతల నుంచి ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగాన్ని తప్పించాలని కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. సొంత నియోజకవర్గ కేంద్రమైన ‘గజ్వేల్’ పట్టణంలో గ్రిడ్ నిర్మాణ పనులను ఆర్‌డబ్ల్యూఎస్‌కే అప్పగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడం చర్చకు దారితీసింది. వాటర్ గ్రిడ్ పనులపై ఆయన సోమవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి కె.తారకరామారావు, ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, పురపాలక శాఖ డెరైక్టర్ బి.జనార్దన్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్ రెడ్డితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం ఈ చర్చకు బలాన్ని చేకూరుస్తోంది. ప్రపంచ బ్యాంక్ రుణం రూ.60 కోట్లతో గజ్వేల్‌లో పథకం పనులను ఆర్డబ్ల్యూఎస్ నిర్వహిస్తుండగా.. వాటర్ గ్రిడ్ పనుల్నీ అదే విభాగానికి అప్పగించాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆర్‌డబ్ల్యూఎస్‌తో పోల్చితే ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం ముందుంది. కానీ దాన్ని శివార్లలోని ఆర్డబ్ల్యూఎస్ పైప్లైన్ల నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి ఇంటింటికి సరఫరా చేయడం వరకే పరిమితం చేశారు. తాజా సమాచారంతో పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.