Dr.N.Anantha Lakshmi
-
చీమలా పని చేయటం
నెమ్మదిగా పనిచేసే వారిని చీమలాగా పని చేస్తున్నారు అని అంటాం. అది తక్కువ చేసి మాట్లాడటంలా అని పిస్తుంది. ఎప్పుడైనా ఒక్క చీమ నిద్రపోతూగానీ, కదల కుండాగానీ కనపడుతుందేమో చూడండి. చూడటానికి నెమ్మదిగా చేస్తున్నట్టుండటంతో పని తెమిలినట్టు ఉండదు. కానీ దాని పుట్ట చూస్తే తెలుస్తుంది. ఎంత ధాన్యం సేకరించి ఉన్నదో. చీమ శరీరమెంత? దానిలో కాలెంత? ఆ కాలితో భూమిని తొలుచుకుంటూ అవి తమ నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. వాటికి సాధన సంపత్తి, పరికరాలు ఉండవు. చేతనయిన పని చేసుకుంటూ పోవటమే. త్వరగా చేయాలనే తొందర, ఆందోళన, ఒత్తిడి ఉండవు. సంఘీభావంతో, కలసికట్టుగా చీమలు తయారు చేసుకున్న నివాసం ఎంత అద్భుతంగా ఉంటుందో చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఏర్పాటు చేసుకున్నది నేల లోపలే అయినా చిన్న నలుసు కూడా ఉండదు. చాలా పరిశుభ్రంగా ఉంటుంది. చక్కగా అలికినట్టు నున్నగా ఉంటుంది. నేలని ఎంత తెలివిగా తొలుస్తాయంటే ఒక్క చుక్క నీరు కూడా వాటి కన్నాల్లోకి చొరబడదు. వాటి గృహ నిర్మాణ విజ్ఞా నానికి జోహార్లు. వీలైతే మనుషులు వాటి నుంచి నేర్చు కోవాలి. అయితే, ఆ విజ్ఞానాన్ని మానవులు కాదు కానీ, పాములు బాగా ఉపయోగించుకుంటున్నాయి. తాము ఉండటానికి తగిన ఇల్లు నిర్మించుకోవటం పాములకి తెలియదు. బొరియల్లో ఉంటాయి. కానీ చీమలు చక్కని పుట్ట పెడితే హాయిగా వాటిని సొంతం చేసుకుంటాయి. అయినా చీమలు తమ పని మానవు. చీమలాగా పని చెయ్యటమంటే నిబద్ధతతో మాత్రమే కాదు. క్రమశిక్షణతో పనిచేయటం. చీమల గుంపు ఒక దారిలో వెడుతుంటే ఒక్కటి కూడా పక్కకి వెళ్లదు. ఒకదాని వెనుక మరొకటి శిక్షణ పొందిన సైనికుల్లాగా కదులు తాయి. చూడముచ్చటగా ఉండే ఆ వరుసని చూసి ఏదైనా అలా క్రమంగా ఉంటే చీమలబారు అని పోలుస్తారు. ఎటువంటి ఆర్భాటం హడావుడి లేకుండా నెమ్మదిగా తమ మానాన తాము పని చేసుకుంటూ పోయే చీమల పుట్ట లోపల చూస్తే ఎంత ధాన్యం నిలువ ఉంటుందో! తాము తినగా, తమ వారందరూ వర్షాకాలంలో తినటానికి సరిపడినంత ధాన్యం ఉంటుంది. తెలివైన వారు చేసే పని అదే కదా? పగటిపూట రాత్రి కోసం, వేసవిలో వర్షాకాలం కోసం, యవ్వనంలో వార్ధక్యం కోసం, ఇహలోకంలో పర లోకం కోసం జాగ్రత్తపడాలని మనిషికి చెప్పి, హెచ్చ రించవలసిన అవసరం వచ్చింది. చీమకు ఎవరూ చెప్ప లేదు. అందుకే ఎవరైనా కొద్ది కొద్దిగా కూడబెడితే చీమ లాగా కూడబెట్టాడు అంటారు. క్రమశిక్షణ, పరిశుభ్రత, పనిచేసే మనస్తత్వం, సంపా దించినదంతా ఖర్చు చేయకుండా కావలసినంత తిని, మిగిలినది దొరకని రోజుల కోసం కూడబెట్టడం, సంఘీ భావం మొదలైనవి చీమల పనికి ఉన్న లక్షణాలు. కనుక చీమలాగా పనిచేశారు అంటే కుదురుగా, నిలకడగా, నిబ ద్ధతతో, ఓర్పుతో, క్రమశిక్షణతో, పనిచెయ్యటమే తమ ధ్యేయంగా, ప్రతిఫలాపేక్ష రహితంగా పనిచేశారు అని అర్థం. అందువల్ల చీమలాగా పని చేస్తున్నారని అనడం అంటే మెచ్చుకోవడమే అవుతుంది. – డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి -
లక్ష్య శుద్ధి
ఏదైనా సాధించాలంటే లక్ష్య శుద్ధి ఉండాలి. లక్ష్య శుద్ధి ఉంటేనే లక్ష్య సిద్ధి ఉంటుంది. చాలామంది తమ జీవితంలో ఏదీ సాధించలేక పోవటానికి కారణం తమకేం కావాలో తెలియక పోవటమేనట. నీకేం కావాలి? అని అడిగితే చాలామంది వెంటనే చెప్పలేరు. ఎంతోమంది ఆలోచించినా చెప్ప లేరు. ఎక్కువ మందికి అసలు ఏం కావాలో వారికే తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. పైగా తమకు ఏదీ కలిసి రావటం లేదని, దేవుడిని, ఇంకా వీలైనంత మందిని ఆడిపోసుకుంటారు. ఈ లక్ష్యం నిశ్చయించుకో వటం చిన్నతనం నుండి అలవాటు చేయవలసి ఉంది. నేటి యువత రంలో ఇటు వంటి నిర్దిష్ట లక్ష్యం కనపడటం అరుదు. చిన్నతనం నుంచి దిశా నిర్దేశం చేయటం అవసరం. చిన్న పిల్ల లను ఎవరినైనా– నువ్వు పెద్ద అయినాక ఏమవాల నుకుంటున్నావు? అని, పోనీ, నువ్వేం చదవాలనుకుం టున్నావు? అని అడగండి. ఏదో ఒకటిలే అంటారు. దేనిలో సీటు వస్తే అదే చదువుతానంటారు. అంకెలను చూస్తే కంగారుపడేవాడు లెక్కలు ప్రధానంగా ఉండే ఇంజనీరింగ్ చదవవలసి వస్తే...? తరువాత ఎప్పుడో నేను ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను నాకిష్టం లేదని అనే మాటలు తప్పవు. అందుకే చిన్నతనం నుండి ప్రతివారికి ఒక లక్ష్యం ఉండాలి. అపుడు ఈ నిరాశా నిస్పృహలు ఉండే అవ కాశం తక్కువ. జీవితం లక్ష్య సాధనతో సాగుతుంది. సరిగ్గా చెప్పాలంటే ఫలితం కన్న ప్రయత్నంలోనే తృప్తి ఎక్కువ కనుక తనవంతు కృషి చేయటంలో ఆనందం పొందుతూ ఉంటారు. సరైన లక్ష్యమే లేనప్పుడు జీవి తం గాలివాటంగా సాగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక పిల్లవాడిని తల్లి డాక్టరు చెయ్యాలనుకుంటుంది. తండ్రి ఇంజనీర్ని చెయ్యాలను కుంటాడు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడి బుర్ర లోకి ఎక్కిస్తారు. ఏ ఒక్కదాని మీదా దృష్టి కేంద్రీ కరించటం జరుగదు. దొరికిన కోర్సులో చేరిపోయి, ఏ గుమస్తాగానో స్థిరపడటం జరుగుతుంది. అలా కాకుండా ఒక్కదానినే అనుకొని, దానిమీదే సర్వ శక్తులు కేంద్రీకరించి ఉంటే అతడు దానిలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యేవాడు. ఒక్కటే తెలుసుకుని మిగి లినవి మానెయ్యాలా అనే సందేహం రావచ్చు. ప్రధా నమైన దానిమీద ఎక్కువ దృష్టి పెట్టి మిగిలినవి ఆను షంగికంగా నేర్చుకోవాలి. అవన్నీ ప్రధాన లక్ష్యానికి సహకరించేట్టు చేసుకోవాలి. లక్ష్య శుద్ధికి ప్రబలోదహరణం అర్జునుడు పక్షి కంటిని కొట్టమంటే అతడికి అది ఉన్న చెట్టుగానీ, ఆకులుగానీ, పక్షి శరీరంగానీ కనపడలేదు. పక్షి కన్ను మాత్రమే కనపడింది. అదీ లక్ష్య శుద్ధి అంటే. దేని గురించి అయినా అటువంటి ఏకాగ్ర దృష్టి ఉంటే తప్పక సాధిస్తారు. అలా దృష్టి కేంద్రీకరించాలంటే తన లక్ష్యం ఏమిటో నిర్ధారించుకోవటం ప్రధానం. సాధించవలసిన లక్ష్యాన్ని గుర్తించటం నేర్పితే చాలు. పెద్దలు ఇంకేమీ చెప్పనవసరం లేదు. తమకు కావ లసిన దాని కోసం వారే పాటుపడతారు. – డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి