DRO office
-
AP: కలెక్టరేట్లో డీఆర్వో అలసత్వం.. ఫోన్లో గేమ్ ఆడుతూ..
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అధికారులు రిలాక్స్ అవుతున్నారు. తమ బాధ్యతలు మరచి.. కీలక సమావేశంలో సైతం సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ కీలక సమావేశంలో రెవెన్యూ అధికారి రమ్మీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలా నిర్వాకం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ క్రమంలో అధికారులందరూ బిజీగా ఉన్నారు. కానీ, డీఆర్వో మలోలా మాత్రం ఈ సమావేశంతో తనకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా వ్యవహరించారు. కీలకమైన సమావేశంలో డీఆర్వో మలోలా తన సెల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఓవైపు సమావేశం జరుగుతున్నా డీఆర్వో మాత్రం కాలక్షేపం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో, సదరు అధికారి తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. -
పోలీస్‌లకే ‘ప్రజావాణి’
- ప్రజావాణిపై అధికారులు నిర్లక్ష్యం - డీఆర్వో కార్యాలయం గేట్లకు తాళాలు - దరఖాస్తులు తీసుకున్న పోలీస్ సిబ్బంది హన్మకొండ అర్బన్ : ప్రజావాణి నిర్వాహణలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. వందల కి లోమీటర్ల దూరం నుంచి జనం తమ బాధలు చెప్పుకునేందుకు వస్తే డీఆర్వో కార్యాలయంలో అధికారులు తలుపులకు తాళాలు వేసుకుని జనాన్ని గంటల కొద్దీ నిలబెట్టారు. ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజలనుంచి డీఆర్వో, రిటైర్డ్స్ ఎస్డీసీ ప్రసాద్‌రావు వినతులు స్వీకరించారు. గత రెండు వారాలుగా ప్రజావాణి లేక పోవడంతో ఈ సారి జనం ప్రజావాణికి పోటెత్తారు. సుదూర ప్రాంతాలనుంచి ఉన్నతాధికారులకు తమ గోడు వెళ్ల బోసుకుందామని కలెక్టరేట్‌కు జనం వ స్తే అధికారులు మాత్రం జనం సహనానికి పరీక్ష పెట్టారు. వచ్చిన దరఖాస్తును నమోదు చేసుకునేందుకు డీఆర్వో కార్యాలయం వద్ద ఒక్కొకరిని సుమారు మూడు గంటలపాటు నిలబెట్టారు. వారినుంచి దరఖాస్తులు తీసుకునేవారు లేరు. ఒక తరుణంలో జనం అధికారులతో వాగ్వాదానికి దిగారు. వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడి అధికారుల తీరును తీవ్రంగా నిరసించారు. జనం ఆందోళన ఉధృతం అవుతుండటంతో అక్కడ కాపలాగా ఉన్న పోలీస్ సిబ్బంది జనం నుంచి దరఖాస్తులన్నీ సేకరించి కుప్పపోశారు. ఇప్పటికైనా అధికారులు ప్రయోగాలు మాని ఒక పద్ధతి ప్రకారం ప్రజావాణి నిర్వహించాలని జనం కోరుతున్నారు.