Dropping
-
పావురాల విసర్జితాలతో రోగాల ముప్పేనా..?
సాక్షి, హైదరాబాద్: శాంతికి చిహ్నం.. భాగ్యనగర సంస్కృతిలో భాగమైన కపోతాలు.. ప్రజారోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయా..? జీవవైవిధ్య పరిరక్షణ.. ఆహ్లాదం కోసమో లేక అన్ని విధాలా కలిసి వస్తుందన్న నమ్మకంతో నగరవాసులు పెంచుకునే పావురాలు జనానికి తీవ్రమైన శ్వాసకోస వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయా..? ఇటీవల ఓ ప్రముఖ సినీనటి భర్త మరణానికి పావురాల విసర్జితాలే కారణమా..? ఈ ప్రశ్నలన్నీ సామాజిక మాధ్యమాల్లో ఇటీవలి కాలంలో వైరల్‌గా మారడంతో పాటు పలు చర్చోపచర్చలకు కారణమైన విషయం విదితమే. అయితే తన భర్త మరణానికి పావురాలు కారణం కాదని ఆ నటి స్పష్టత ఇచ్చింది. కాగా ఇదే తరుణంలో నగరంలో పావురాల సంఖ్య పెరిగితే రాజధాని గ్రేటర్ హైదరాబాద్ సిటీ రోగాల అడ్డాగా మారడం తథ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా విడుదల చేసిన తాజా అధ్యయన నివేదిక హెచ్చరించిందని సెలవిస్తున్నారు. పావురాల విసర్జితాల నుంచి ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి వల్ల డజనుకుపైగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. ప్రధానంగా ఈ ఇన్ఫెక్షన్లతో చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనం సైతం తేల్చి చెప్పింది. నగరంలో 6 లక్షలకు చేరుకున్న పావురాలు..? రాష్ట్ర రాజధానిలో పావురాల సంఖ్యను కచ్చితంగా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేనప్పటికీ దాదాపు 6 లక్షల పావురాలు నగరంలో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పావురాలతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో తేటతెల్లం చేసేందుకు ప్రాఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వాసుదేవరావు బృందం గతంలో అధ్యయనం జరిపింది. నగరంలో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించకుంటే సమీప భవిష్యత్తులో ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఈ బృందం హెచ్చరించింది. తమ అధ్యయన నివేదికను ప్రభుత్వానికి నివేదించినట్లు బృందం సభ్యులు ‘సాక్షి’కి తెలిపారు. పావురాల విసర్జితాలతో హాని ఇలా.. పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలామారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా పీల్చే వారు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మగతగా అనిపించడం, తలనొప్పి రావడం, కొద్దిరోజులకే పక్షవాతానికి దారితీస్తుంది. అది చివరకు మృత్యువుకు కారణమవుతుందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వాసుదేవరావు తెలిపారు. అందుకు పావురాలు కారణమన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదని, వాటిని పెంచుతూనే ఉన్నారని చెబుతున్నారు. నగరంలో మరో రెండు, మూడేళ్లలో పావురాల సంఖ్య 10 లక్షలు దాటే పరిస్థితి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇవీ వాస్తవాలు.. ► శ్వాస సంబంధ వ్యాధులతో ఆస్పత్రులపాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలు కారణమవుతున్నట్లు గతంలో ఢిల్లీలో గుర్తించారు. ► రాజధాని హైదరాబాద్ నగరంలో రెండేళ్ల క్రితం పావురాలకు బహిరంగంగా దాణా వేసే ప్రాంతాలు 490 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 560కి చేరుకుంది. ► భారీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణదారులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పావురాలకు దాణా వేసే ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పావురాలకు దాణా వేస్తే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది ప్రజలు వాటికి ఆహారం అందిస్తున్నారు. (క్లిక్: ఆకట్టుకుంటున్న వెరైటీ కప్పుల గణపయ్య) -
రాత్రివేళల్లో డ్రాపింగ్‌కు అభయ్ వాహనాలు
చిత్తూరు అర్బన్ : మహిళల భద్రత కోసం చిత్తూరు పోలీసులు వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో చోటుచేసుకున్న దిశ హత్యాచారం దేశ వ్యాప్తంగా చర్చలకు, నిరసనలను దారితీసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు.. మహిళల భద్రత కోసం గురువారం నుంచే పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ వివరాలను ఎస్పీ సెంథిల్‌కుమార్ వివరించారు. ఆయన మాటల్లోనే.. అభయ్ వాహనాలు.. జిల్లా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నిలయం కావడంతో జాతీయ రహదారులపై నిత్యం వాహనాల రాకపోకలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారిలో మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. ఇక ఉన్నత విద్యను అభ్యసించే యువతులు కూడా ఉన్నారు. మహిళలు ఒంటరిగా వెళ్లాల్సినప్పుడు నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నా, రాత్రివేళ, రవాణా సౌకర్యం లేకున్నా, వాహనాలకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా వెంటనే డయల్–100కు ఫోన్ చేయాలి. సహాయార్థులను గమ్యస్థానానికి చేర్చడానికి అభయ్ వాహనాలను ఏర్పాటు చేశాం. ఫోన్ చేసిన కొద్దిసేపట్లోనే పోలీసు వాహనాలు వచ్చి వారి వెళ్లాల్సిన చోటుకు చేరుస్తారు. ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. మహిళా మిత్ర ఏర్పాటు.. మహిళలు, బాలికల సంరక్షణ కోసం మహిళామిత్ర పేరిట కొత్త కార్యక్రమాన్ని రూపొందించాం. రెండు మూడు రోజుల్లో దీన్ని ప్రారంభిస్తున్నాం. చిత్తూరు కేంద్రంగా పనిచేస్తున్న ఉమెన్–జువైనల్ వింగ్‌ను జిల్లా మొత్తం విస్తరిస్తాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళామిత్ర ఉంటారు. సర్కిల్ పరిధిలో కనీసం ఎనిమిది మంది పోలీసులతో ప్రత్యేక బృందాలను నియమిస్తున్నాం. ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ బృందాలు మహిళలకు అండగా నిలవడంతో పాటు కళాశాలలు, విద్యాసంస్థలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సంచరిస్తూ మహిళల భద్రతను పర్యవేక్షిస్తాయి. వీడియోల ప్రదర్శన.. పిల్లలకు మంచి ఏదో, చెడు ఏదో తెలియాల్సిన సమయం ఇది. ఎదుటి వ్యక్తి పైన చెయ్యి వేస్తే ఏ ఉద్దేశంతో వేస్తున్నాడో పిల్లలు పసిగట్టాలి. ఇందుకోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో గుడ్, బ్యాడ్ టచ్ పేరిట వీడియోలు రూపొందించాం. వీటిని పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శించనున్నాం. ఇబ్బందికర పరిస్థితుల్లో ఏం చేయాలి..? చాకచక్యంగా తప్పించుకోవడం ఎలా..? పోలీసులకు ఎలా సమాచారం ఇవ్వాలి..? అనే దానిపై జిల్లా వ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
బడియా.. బారా?!
నారాయణపేట/ మాగనూర్ (మక్తల్): అక్కడ పొద్దున ఆ పాఠశాల గేట్లు తెరిస్తే చాలు మద్యం ఖాళీ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. వాటిని తొలగించడం విద్యార్థులు.. ఉపాధ్యాయులకు వంతైంది. ఉదయం శుభ్రంగా ఉంటే రాత్రి మాత్రం మందుబాబులకు అడ్డాగా మారింది. మద్యం తాగి ఖాళీ బాటిళ్లను పడేసిపోతున్నారు. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు, విద్యార్థులు వాపోతున్నారు. ఇదీ నారాయణపేట జిల్లాలోని మాగనూర్ జెడ్పీహెచ్ఎస్ పరిస్థితి. ఈ పాఠశాలకు ప్రహరీ, గేటు ఉన్నా వాచ్‌మన్‌ను మాత్రం నియమించలేదు. అలాగే ప్రహరీ ఎత్తు తక్కువగా ఉండటంతో గోడ దూకి రాత్రివేళ మందుబాబులు ఇక్కడికి వచ్చి తమ పని కానిచ్చేస్తున్నారు. పక్కనే మద్యం విక్రయాలు బడి అంటేనే ఓ పవిత్రమైన స్థలం.. అలాంటిది మందుబాబులు తమను ఎవరూ ఏమీ చేయలేరని అనుకుంటున్నారేమో మరి.. ఈ పాఠశాల ఆవరణలో తాగుడు.. మద్యం బాటిళ్లను పడేసుడు.. అంతే! ఖాళీ బాటిళ్లను ఎత్తేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు రోజురోజుకూ విసుగు చెందుతున్నారు. గ్రామంలోని బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నా.. వారి కంట పడకుండా ఇలా చీకటి దాందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మాగనూరులోని ఓ వ్యక్తి గుడి దారిలో బెల్ట్ దుకాణం నిర్వహిస్తున్నాడు.. అతనే ఈ పాఠశాల పక్కన ఉన్న తన స్వగృహంలో రాత్రివేళ మద్యం విక్రయిస్తున్నాడు. దీనిపై విద్యార్థి సంఘాలు, గ్రామ యువకులు పలుసార్లు ఆందోళనలు చేపట్టినా అధికారులు, పాలకుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్య తీసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. మా దృష్టికి రాలేదు మాగనూర్‌లో బెల్ట్ దుకణాలు పెట్టి మద్యం విక్రయిస్తున్నట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అలాంటిది మా దృష్టికి వస్తే చట్టారీర్యా చర్యలు తీసుకుంటాం. – నాగేందర్, ఎక్సైజ్ సీఐ, నారాయణపేట -
రూ.100 నోట్ల ప్రింటింగ్ నిలిపివేత...!
ఇంకో దారుణమైన విషయం ఏంటంటే.. కొత్త నోట్ల ప్రింటింగ్‌లో బిజీగా ఉన్న ప్రెస్‌లు రూ.100 నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసినట్లు ఆర్బీఐ వర్గాలను ఉటంకిస్తూ... ‘బ్లూంబర్గ్’ పేర్కొంది. పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు ఇది నిజంగా మింగుడుపడని అంశమే. అరుుతే, నోట్ల రద్దుపై వార్తల్లో వస్తున్న ఈ అభిప్రాయాలు, అంచనాలను ఆర్థిక శాఖ అధికార ప్రతినిధి డీఎస్ మాలిక్ తోసిపుచ్చారు. ‘ఇది పూర్తిగా అవాస్తవం. త్వరలోనే పరిస్థితులు మెరుగుపడతారుు. రూ.500, 100 నోట్ల సరఫరా పెరిగి.. ఏటీఎంల రీ-కాలిబ్రేషన్ పూర్తరుుతే ఇప్పుడున్న ఇబ్బందులన్నీ చాలా వేగంగానే తొలగిపోతారుు’ అని ఆయన పేర్కొన్నారు. అరుుతే, అవసరానికి సరిపడా రూ.100 నోట్ల సరఫరా లేదని, కొరత ఉన్నట్లు ఆర్థిక శాఖకు చెందిన అధికారులు(పేరు వెల్లడించడానికి ఇష్టపడని) చెబుతున్నారు. కాగా, రెండు నెలల క్రితమే నోట్ల ప్రింటింగ్ మొదలైందని.. దీనివల్ల కరెన్సీ సరఫరా తగినంతగానే ఉందని ఆర్బీఐ గురువారం ఒక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. -
నలుగురు ఉపాధ్యాయుల వేతనం నిలిపివేత
ఏటూరునాగారం : మండలంలోని ఏటూ రు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయు లు అమర్దాస్, లలితకు ఆగస్టు వేతనం నిలిపివేసినట్లు ఎంఈఓ అనంతుల సురేం దర్ తెలిపారు. అలాగే మధ్యాహ్న భోజ నం, పాఠశాల నిర్వహణ సక్రమంగా లేనందున చెల్పాక పంచాయతీలోని ఎలిశెట్టిపల్లిలో పనిచేస్తున్న గొడ్డె ముత్తయ్య, ఉ న్నత విద్యనభ్యసిస్తూ మూడునెలల అటెం డె¯Œæ్స సర్టిఫికెట్లు సమర్పించని లంబాడీతం డా ఉపాధ్యాయుడు ఎల్.శ్రీనివాస్ ఆగస్టు నెల వేతనాన్ని నిలిపివేసినట్లు ఎంఈఓ పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలలు, మధ్యాహ్న భోజనాన్ని సక్రమం గా నిర్వహించాలని ఆదేశించారు. ఏ మా త్రం అవకతవకలు జరిగినా చర్యల కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు శుక్రవారం కార్మిక సంఘం పిలుపునిచ్చిన సమ్మెలో పాల్గొంటే మండలంలోని అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని ఎంఈఓ ఆదేశించారు. -
వాన జోరుకు బొగ్గు ఉత్పత్తి నిలిపివేత
-
ఉగాదికి తీపిలేదు!
♦ రేషన్ చక్కెరకు ప్రభుత్వం మంగళం ♦ రెండు నెలలుగా విడుదలకాని కోటా ♦ ఇప్పటికే కందిపప్పు ఆపేసిన సర్కారు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పేద ప్రజలకు ఇది చే దు వార్త. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే చక్కెరకు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రతి కార్డుకు అరకిలో చొప్పున పంచ దార సరఫరా చేస్తున్న ప్రభుత్వం రెండు నెలలుగా పంపిణీని నిలిపివేసింది. మార్చి, ఏప్రిల్‌కు సంబంధించి 1,170 మెట్రిక్ టన్నుల చక్కెర కోటా రాకపోవడంతో తొలిపండగ ఉగాది పచ్చడిలో తీపికి అవకాశంలేకుండా పోయింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 11.40 లక్షల రేషన్‌కార్డులకు ప్రతినెలా అరకేజీ చొప్పున 585 టన్నుల చక్కెరను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. అయితే, ఈ కోటాను గత రెండు నెలలుగా విడుదల చేయకపోవడంతో 120 టన్నుల బఫర్‌స్టాకును జిల్లా పౌరసరఫరాల శాఖ సర్దుబాటుచేసింది. కాప్రా, రామంతాపూర్, యాచారం, వికారాబాద్, పరిగి, ఘట్కేసర్, మహేశ్వ రం కేంద్రాల్లో ఉన్న నిల్వలను కార్డుదారులకు అందజేసింది. అయితే, తాజా పరిస్థితులను గమనిస్తే చక్కెరను కూడా ఎత్తివేసే అవకాశం కనిపిస్తోందని అధికారవర్గా లు అంటున్నాయి. ఇప్పటివరకు ప్యాకింగ్‌కు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరాచేసే సరుకులను తగ్గించుకుంటూ వస్తున్న సర్కారు.. మూడు నెలలుగా కంది పప్పు పంపిణీ నిలిపివేసింది. తాజాగా పంచదారనూ పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో కేవలం చౌక బియ్యం పంపిణీకే పరిమితం కానున్నట్లు అర్థమవుతోంది. -
బాల్య వివాహం నిలిపివేత
వేపాడ: జాకేరు గ్రా మంలో బాల్య వివాహం జరగకుండా జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు అడ్డుకున్నారు. వల్లంపూడికి చెందిన బాలికను జాకేరుకు చెందిన యువకునిచ్చి ఆదివారం వివాహం చేస్తున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీకి సమాచారం అందింది. పీడీ ఆదేశాలతో రెండు కుటుంబాలకు జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి బి.హెచ్.లక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బంది నాగరాజు, చిట్టిబాబు, కౌన్సిలర్ సంధ్య కౌన్సిలింగ్ నిర్వహించి వివాహాన్ని నిలుపు చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ పి.ఆదిలక్ష్మి, ఏఎస్ఐ మల్లేశ్వర్రావు, సర్పంచ్ బుద్దా అప్పలనాయుడు, దళిత నేత జేసుదాసు, ఐసీడీఎస్ పీవో ఆర్.ఉషారాణి, సూపర్వైజర్ వెనీసాసుందరి పాల్గొన్నారు.