నలుగురు ఉపాధ్యాయుల వేతనం నిలిపివేత
Published Fri, Sep 2 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
ఏటూరునాగారం : మండలంలోని ఏటూ రు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయు లు అమర్‌దాస్, లలితకు ఆగస్టు వేతనం నిలిపివేసినట్లు ఎంఈఓ అనంతుల సురేం దర్ తెలిపారు.
అలాగే మధ్యాహ్న భోజ నం, పాఠశాల నిర్వహణ సక్రమంగా లేనందున చెల్పాక పంచాయతీలోని ఎలిశెట్టిపల్లిలో పనిచేస్తున్న గొడ్డె ముత్తయ్య, ఉ న్నత విద్యనభ్యసిస్తూ మూడునెలల అటెం డె¯Œæ్స సర్టిఫికెట్లు సమర్పించని లంబాడీతం డా ఉపాధ్యాయుడు ఎల్.శ్రీనివాస్ ఆగస్టు నెల వేతనాన్ని నిలిపివేసినట్లు ఎంఈఓ పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలలు, మధ్యాహ్న భోజనాన్ని సక్రమం గా నిర్వహించాలని ఆదేశించారు. ఏ మా త్రం అవకతవకలు జరిగినా చర్యల కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి
మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు శుక్రవారం కార్మిక సంఘం పిలుపునిచ్చిన సమ్మెలో పాల్గొంటే మండలంలోని అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని ఎంఈఓ ఆదేశించారు.
Advertisement