డా.రెడ్డీస్ ప్లాంట్లో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు
హైదరాబాద్: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ప్లాంట్ లో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్ఎఫ్డీఏ) తనిఖీలు మొదలుకానున్నాయి. సంస్థకు చాలా కీలకమైన శ్రీకాకుళం ప్లాంటులో యూఎస్ఎఫ్డీఏ ఈ నెలాఖరున తనిఖీలు చేపట్టనుంది.
మార్చి 27 న ఈ తనిఖీలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు అమెరికా డ్రగ్ రె గ్యులేటరీ మీడియా కు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం ప్లాంట్ సక్రియాత్మక ఔషధ అంశాల (API) సరఫరా పరంగా చాలా కీలకం. ఫిబ్రవరి- మార్చి 2017లో మిర్యాల గూడ ప్లాంటులో తనిఖీలు చేపట్టిన యూఎస్ఎఫ్డీఏ 3 లోపాలు(అబ్జర్వేషన్స్) నమోదు చేసింది. ఇక విశాఖకు దగ్గర్లోగల దువ్వాడ ప్లాంటు తనిఖీల్లో భాగంగా 13 అబ్జర్వేషన్స్ నోట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ తనిఖీలుచేపట్టనుంది. నవంబర్ 2015 లో ఈ మూడు ప్లాంట్లపైనా యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ డ్రగ్మేకర్ చిక్కుల్లోపడింది. కాగా కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ మూడు ప్లాంట్ల వాటా 10-12 శాతంగా ఉంది.