DRS Call
-
Mohammad Rizwan: నువ్వు చెప్పు బ్రో.. డీఆర్ఎస్ తీసుకోమంటావా..? వద్దా..?
AUS Vs PAK 2nd Test: డీఆర్ఎస్ విషయంలో ప్రత్యర్ధి బ్యాటర్ అభిప్రాయాన్ని కోరిన విచిత్ర ఘటన పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య కరాచీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఆటలో భాగంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సాగుతుండగా (ఇన్నింగ్స్ 70.3వ ఓవర్) స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ వేసిన బంతి స్టీవ్ స్మిత్ ప్యాడ్‌కు తాకడంతో పాక్ ఆటగాళ్లంతా ఎల్బీ కోసం అప్పీల్ చేశారు. అయితే అంపైర్ ఆ అప్పీల్‌ను తిరస్కరించి నాటౌట్ అని తల ఊపాడు. To DRS or not to DRS 🤔 #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/X3b9mp8uaF — Pakistan Cricket (@TheRealPCB) March 12, 2022 దీంతో నౌమన్ అలీ అక్కడే స్లిప్‌లో ఉన్న సారథి బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌ల వైపు చూస్తూ డీఆర్ఎస్ విషయంలో వారి అభిప్రాయాన్ని కోరాడు. ఈ క్రమంలో రిజ్వాన్.. క్రీజ్‌లో ఉన్న స్మిత్ వద్దకు వెళ్లి, అతడి భుజంపై చేయి వేసి.. ‘నువ్వే చెప్పు బ్రో.. డీఆర్ఎస్కు వెళ్లమంటావా..? వద్దా..? అని ఫన్నీగా అడిగాడు. ఎవరి ఔట్ కోసం అప్పీల్ చేశారో ఆ ఆటగాడి అభిప్రాయాన్నే రిజ్వాన్ కోరడంతో పాక్ ఆటగాళ్లంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకున్నారు. ఆఖరికి స్మిత్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఫైనల్‌గా స్మిత్ తో చర్చించాక రిజ్వాన్ డీఆర్ఎస్ వద్దని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (127; 13 ఫోర్లు, సిక్స్) అజేయ శతకంతో చెలరేగగా, స్టీవ్ స్మిత్ (72) అర్ధ సెంచరీతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (48 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా, లబూషేన్ డకౌటయ్యాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్ తలో వికెట్ దక్కించుకోగా, లబుషేన్ రనౌటయ్యాడు. తొలి టెస్ట్‌లో 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న ఖ్వాజా, ఈ మ్యాచ్‌లో పట్టుదలగా ఆడి కెరీర్లో పదో శతకాన్ని నమోదు చేశాడు. చదవండి: మాతృదేశంపై సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ అరుదైన ఘనత -
'అది వైడ్‌బాల్ ఏంటి' రోహిత్ అసహనం.. కోహ్లి సలహా
డీఆర్ఎస్ విషయంలో రోహిత్ శర్మ పట్టిందల్లా బంగారమే అవుతుంది. అతను ఎప్పుడు రివ్యూకు వెళ్లినా ఫలితం అనుకూలంగానే వస్తుండడంతో రోహిత్‌కు రివ్యూల రారాజు అనే అభిమానులు పేరు కూడా పెట్టేశారు. వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో రోహిత్ శర్మ.. డీఆర్ఎస్ విషయంలో కోహ్లి సలహా తీసుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కీపర్ పంత్‌ను కాదని కోహ్లి అడ్వైజ్‌తో రివ్యూ కోరి ఫలితం సాధించాడు. తాజాగా విండీస్‌తో తొలి టి20 మ్యాచ్‌లోనూ డీఆర్ఎస్ విషయంలో రోహిత్ మరోసారి కోహ్లి సలహా కోరాడు. ఈసారి కోహ్లి నిర్ణయం తప్పుకావొచ్చు.. కానీ రోహిత్‌కు కోహ్లిపై ఉన్న నమ్మకం ఏంటనేది మరోసారి తెలిసొచ్చింది. చదవండి: IND Vs WI 1st T20I: అదే జోరు.. టీమిండియా తగ్గేదే లే విషయంలోకి వెళితే.. డెబ్యూ బౌలర్ రవి బిష్ణోయి తన బంతులతో విండీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో బిష్ణోయి వేసిన బంతి రోస్టన్ చేజ్‌ను తాకుతూ కీపర్ పంత్ చేతుల్లో పడింది. రవి బిష్ణోయి, పంత్‌లు అప్పీల్ చేశారు. అయితే అంపైర్ దానిని వైడ్‌బాల్‌గా ప్రకటించాడు. దీంతో రోహిత్.. అది వైడ్ బాల్ ఏంటి అంటూ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ఇంతలో కోహ్లి అక్కడికి రావడంతో.. రోహిత్ రివ్యూకు వెళ్లాలా వద్దా అంటూ కోహ్లిని అడిగాడు. దానికి కోహ్లి.. చేజ్ బ్యాట్‌తో పాటు ప్యాడ్లను కూడా తాకినట్లు సౌండ్ వచ్చింది. అని పేర్కొన్నాడు. కోహ్లిపై ఉన్న నమ్మకంతో రోహిత్ రివ్యూ కోరాడు. కానీ రిప్లైలో బంతి చేజ్ బ్యాట్‌ను ఎక్కడా తగిలినట్లు కనిపించలేదు. దీంతో చేజ్ నాటౌట్ అంటూ అంపైర్ ప్రకటించాడు. కోహ్లి.. రోహిత్, పంత్‌లను చూస్తూ ''పాయే.. రివ్యూ పాయే..'' అనడంతో వారి మొహాల్లో నవ్వులు విరిశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రోహిత్ శర్మ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్(34 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్(24 నాటౌట్) టీమిండియాను గెలిపించారు. చదవండి: Ravi Bishnoi: 24 బంతుల్లో 17 డాట్‌బాల్స్.. సూపర్ ఎంట్రీ రవి బిష్ణోయి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) rohit and kohli lol pic.twitter.com/hZqMWPMJd0 — Aarav (@xxxAarav) February 16, 2022 -
IND VS WI 1st ODI: కోహ్లినా మజాకా.. పంత్‌ను కాదని మాజీ కెప్టెన్ సలహా కోరిన హిట్‌మ్యాన్
అహ్మదాబాద్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో విండీస్ బ్యాటింగ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చహల్ వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్ ఆఖరి బంతికి విండీస్ బ్యాటర్ షమ్రా బ్రూక్స్ వికెట్‌కీపర్ క్యాచ్ ఔట్ కోసం టీమిండియా ఆటగాళ్లు అపీల్ చేశారు. అయితే ఈ అపీల్‌ను అంతగా పట్టించుకోని ఫీల్డ్ అంపైర్ బ్రూక్స్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీనిపై రివ్యూకి వెళ్లేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలుత వికెట్‌కీపర్ పంత్‌ను సంప్రదించగా, అతను బంతి బ్యాట్‌కు తాకలేదని చెప్పాడు. ఇంతలో కోహ్లి వారి దగ్గరికి వచ్చి బంతి బ్యాట్‌కు కచ్చితంగా తాకిందని చెప్పడంతో రోహిత్ ఏమాత్రం ఆలోచించకుండా రివ్యూకి వెళ్లాడు. Kohli - 100% bat Rohit Reviews Decision overturned pic.twitter.com/ynMKaXCrfX — `` (@KohlifiedGal) February 6, 2022 అనంతరం రివ్యూలో బ్రూక్స్ ఔట్ అని తేలడం, ఆ తర్వాత విండీస్ 176 పరుగులకే ఆలౌట్ కావడం చకచకా జరిగిపోయాయి. కాగా, రివ్యూ సందర్భంగా రోహిత్ అండ్ కో మధ్య మైదానంలో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కోహ్లినా మజాకా అని అతని ఫ్యాన్స్ గొప్పలకుపోతున్నారు. మరికొందరేమో రోహిత్‌కు కోహ్లిపై అపారమైన నమ్మకముందని, ఎంతైనా కోహ్లి 7 ఇయర్స్ ఇండస్ట్రీ అని, రోహిత్-కోహ్లి మధ్యలో ఎలాంటి విభేదాలు లేవనడానికి ఇంతకుమించి సాక్ష్యమేముంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. 43.5 ఓవర్లలో 176 పరుగులకే విండీస్‌ను ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్(4/49), వాషింగ్టన్ సుందర్(3/30), పేసర్లు ప్రసిద్ద్ కృష్ణ(2/29), మహ్మద్ సిరాజ్(1/26)లు రెచ్చిపోవడంతో ప్రత్యర్ధి స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. విండీస్ జట్టులో ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. చదవండి: Virat Kohli: డొక్కు కారు పంపి ఆర్సీబీ యాజమాన్యం అవమానించింది..! -
పంత్ వద్దన్నా వినలేదు, సిరాజ్ మాట విన్నాడు.. మూల్యం చెల్లించుకున్నాడు
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్సాహం మరోసారి టీమిండియా పాలిట శాపంలా మారింది. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో వికెట్ కీపర్ పంత్ ఎంత చెప్పినా వినకుండా రివ్యూ తీసుకొని వృథా చేశాడు. దాంతో భారత కెప్టెన్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ ఎప్పుడూ ఇలానే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని జట్టు విజయావకాశాలను దెబ్బ తీస్తాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. Mohammad Siraj convinced Virat Kohli to take the review of Joe Root, but Rishabh Pant was denying. pic.twitter.com/WepEASpDWH — Mufaddal Vohra (@mufaddal_vohra) August 13, 2021 వివరాల్లోకి వెళితే.. ఇన్నింగ్స్ 23వ ఓవర్ వేసిన సిరాజ్.. నాలుగో బంతిని లైన్ అండ్ లెంగ్త్‌తో వికెట్లపైకి విసిరాడు. బంతిని డిఫెన్స్ చేసేందుకు రూట్ ప్రయత్నించగా.. అది కాస్తా బ్యాట్‌కి దొరకకుండా ఫ్యాడ్‌ని తాకుతూ వెళ్లింది. దాంతో టీమిండియా ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయగా.. అంపైర్ తిరస్కరించాడు. అయితే, బంతి కచ్చితంగా వికెట్లను తాకేలా కనిపించిందని సిరాజ్ చెప్పడంతో కోహ్లీ రివ్యూ తీసుకోవాలని భావించాడు. ఈ విషయమై పంత్ మాత్రం సిరాజ్ అభిప్రాయంతో ఏకీభవించలేదు. బంతి లెగ్ స్టంప్‌కు బయటగా వెళ్తోందని కోహ్లీతో వాదించాడు. Kohli saab noooo. #ENGvsIND pic.twitter.com/jr7r09KOaa — Manya (@CSKian716) August 13, 2021 రివ్యూ వద్దని పంత్ ఎంత వారిస్తున్నా వినని కోహ్లీ.. సరదాగా నవ్వుకుంటూనే రివ్యూకి వెళ్లాడు. తీరా అందులో నాటౌట్‌గా తేలడంతో భంగపడ్డాడు. దీంతో కోహ్లీపై నెటిజన్లు ఫైరవుతున్నారు. సిరాజ్‌పై గుడ్డి నమ్మకంతో కొంప ముంచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రివ్యూ తీసుకునే విషయంలో ధోని వద్ద కోచింగ్ తీసుకుంటే బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. సిరాజ్‌పై సెటైర్ విసిరాడు. డీఆర్ఎస్ అంటే " డోంట్ రివ్యూ సిరాజ్" అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఇటీవల కాలంలో పంత్ చాలా వరకూ డీఆర్ఎస్ కోరడంలో కోహ్లీకి సాయపడుతున్నాడు. కానీ.. లార్డ్స్‌లో పంత్ అభిప్రాయాన్ని పక్కనపెట్టిన కోహ్లీ.. సిరాజ్‌పై గుడ్డి నమ్మకంతో డీఆర్ఎస్ తీసుకొని మూల్యం చెల్లించుకున్నాడు. Rishabh pant to Kohli after review: pic.twitter.com/e8kDoYOIcO — Rajasthani Memer (@Memes_Raj) August 13, 2021 ఇదిలా ఉంటే, ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. ఆండర్సన్(5/62) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 129; 12 ఫోర్లు, సిక్స్) మరో 2 పరుగులు మాత్రమే జోడించి ఔటవ్వగా.. మిగితా జట్టంతా పేకమేడలా కూలింది. 86 పరుగుల వ్యవధిలో భారత్.. తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. పంత్(37), జడేజా(40) పర్వాలేదనిపించగా.. రహానే(1) మరోసారి నిరాశపరిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆదిలో సిరాజ్(2/34) దెబ్బతీయగా, బర్న్స్(49), రూట్(48 బ్యాటింగ్) ఆదుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. Kohli , Siraj and pant discussing whether to take review or not. pic.twitter.com/5ydv2mwuYk — Avneet Singh (@AvneetsinghAs) August 13, 2021 -
విరాట్ కోహ్లీ.. ఓ ఆసక్తికర సీన్!
-
విరాట్ కోహ్లీ.. ఓ ఆసక్తికర సీన్!
హైదరాబాద్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో తొలిరోజు ఆటలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ కెప్టెన్, కీపర్ ముష్ఫికర్ రహీమ్ చేసిన ఓ పనికి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి కాసేపు నవ్వు ఆగలేదు. నాన్ స్ట్రైకర్ విజయ్ కి విషయాన్ని చెప్పి మరీ నవ్వుకున్నాడు. స్డేడియంలో కాసేపు అందరికీ ఈ సీన్ వినోదాన్ని పంచింది. అసలే ఏమైందంటే.. సెంచరీ వీరుడు మురళీ విజయ్ 101 పరుగులు, విరాట్ కోహ్లీ 31 పరుగుల వద్ద ఉన్నారు. ఆ సమయంలో ఇండియా స్కోరు 223/2. బంగ్లా లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ వేసిన ఇన్నింగ్స్ 62వ ఓవర్లో ఓ బంతిని కోహ్లీ డిఫెన్స్ చేశాడు. సరిగ్గా ఆ బంతి కోహ్లీ బ్యాట్ కు మిడిల్ లో తగిలింది. అయితే దీన్ని కెప్టన్ కమ్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అంచనా వేయడంలో పొరపాటు చేశాడు. బంతి కోహ్లీ ప్యాడ్ కు తగిలిందా అని షార్ట్ లెగ్ ఫీల్డర్ తో చర్చించిన ముష్ఫికర్ వెంటనే అంపైర్ ను ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరాడు. దీంతో కోహ్లీకి పట్టరాని సంతోషం వేసింది. బంగ్లా ఓ రివ్యూను ఇంత సులువుగా కోల్పోతుందన్న విషయం తెలిసిన కోహ్లీ, నాన్ స్ట్రైకర్ విజయ్ తో కలిసి బంతి, బ్యాట్ కు ఎక్కడ తగిలిందో చెప్పి రివ్యూ నిర్ణయం వెలువడే వరకు నవ్వుతూ కనిపించాడు. అనంతరం విజయ్ (108) ఔట్ కాగా, కోహ్లీ మాత్రం తొలిరోజు ఆట నిలిపివేసే సమయానికి అజేయ శతకం(111, 141 బంతుల్లో 12 ఫోర్లు)తో, రహానే 45 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. తొలిరోజు భారత్ 90 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది.