డీఆర్‌ఎస్ విషయంలో రోహిత్ శర్మ పట్టిందల్లా బంగారమే అవుతుంది. అతను ఎప్పుడు రివ్యూకు వెళ్లినా ఫలితం అనుకూలంగానే వస్తుండడంతో రోహిత్‌కు రివ్యూల రారాజు అనే అభిమానులు పేరు కూడా పెట్టేశారు. వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో రోహిత్ శర్మ.. డీఆర్‌ఎస్ విషయంలో కోహ్లి సలహా తీసుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కీపర్ పంత్‌ను కాదని కోహ్లి అడ్వైజ్‌తో రివ్యూ కోరి ఫలితం సాధించాడు. తాజాగా విండీస్‌తో తొలి టి20 మ్యాచ్‌లోనూ డీఆర్‌ఎస్ విషయంలో రోహిత్ మరోసారి కోహ్లి సలహా కోరాడు. ఈసారి కోహ్లి నిర్ణయం తప్పుకావొచ్చు.. కానీ రోహిత్‌కు కోహ్లిపై ఉన్న నమ్మకం ఏంటనేది మరోసారి తెలిసొచ్చింది.
చదవండి: IND Vs WI 1st T20I: అదే జోరు.. టీమిండియా తగ్గేదే లే
విషయంలోకి వెళితే.. డెబ్యూ బౌలర్ రవి బిష్ణోయి తన బంతులతో విండీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో బిష్ణోయి వేసిన బంతి రోస్టన్ చేజ్‌ను తాకుతూ కీపర్ పంత్ చేతుల్లో పడింది. రవి బిష్ణోయి, పంత్‌లు అప్పీల్ చేశారు. అయితే అంపైర్ దానిని వైడ్‌బాల్‌గా ప్రకటించాడు. దీంతో రోహిత్.. అది వైడ్ బాల్ ఏంటి అంటూ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ఇంతలో కోహ్లి అక్కడికి రావడంతో.. రోహిత్ రివ్యూకు వెళ్లాలా వద్దా అంటూ కోహ్లిని అడిగాడు. దానికి కోహ్లి.. చేజ్ బ్యాట్‌తో పాటు ప్యాడ్లను కూడా తాకినట్లు సౌండ్ వచ్చింది. అని పేర్కొన్నాడు. కోహ్లిపై ఉన్న నమ్మకంతో రోహిత్ రివ్యూ కోరాడు. కానీ రిప్లైలో బంతి చేజ్ బ్యాట్‌ను ఎక్కడా తగిలినట్లు కనిపించలేదు. దీంతో చేజ్ నాటౌట్ అంటూ అంపైర్ ప్రకటించాడు. కోహ్లి.. రోహిత్, పంత్‌లను చూస్తూ ''పాయే.. రివ్యూ పాయే..'' అనడంతో వారి మొహాల్లో నవ్వులు విరిశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రోహిత్ శర్మ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్(34 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్(24 నాటౌట్) టీమిండియాను గెలిపించారు.
చదవండి: Ravi Bishnoi: 24 బంతుల్లో 17 డాట్‌బాల్స్.. సూపర్ ఎంట్రీ రవి బిష్ణోయి
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
rohit and kohli lol pic.twitter.com/hZqMWPMJd0
— Aarav (@xxxAarav) February 16, 2022
Comments
Please login to add a commentAdd a comment