DT
-
రైస్‌మిల్లు వ్యవహారంపై హైడ్రామా .. డీటీపై క్రిమినల్ కేసు
సాక్షి, గద్వాల(ఖమ్మం): ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సంరక్షించాల్సిన అధికార యంత్రాంగమే కక్కుర్తి పడింది. పేదలకు సబ్సిడీ బియ్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అయితే అక్రమార్కులు రూ.లక్షల్లో దండుకునేందుకు జిల్లాలో నెలకు వేల మెట్రిక్ టన్నుల సబ్సిడీ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. గత అక్టోబర్ 2న జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రేఖా రైస్‌మిల్లుపై రెవెన్యూ, పోలీసు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది దాడులు నిర్వహించారు. 170.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని డీసీఎం వాహనాన్ని సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అయితే విజిలెన్స్ విచారణలో నమ్మలేని వాస్తవాలు వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం అయోమయంలో పడ్డారు. మూడు నెలల్లోనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్య తీసుకోవాలని నివేదికలు ఇచ్చినా పెడచెవిన పెట్టారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు. చివరకు గత నెల 21న డీటీ గణపతిరావుపై గద్వాల పట్టణ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసినా బయటకు వెల్లడించలేదు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో హాట్‌టాపిక్‌గా మారింది. ముందు నుంచి ఈ కేసు విచారణలోనే క్లోజ్ చేయాలని ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పారు. మార్చి చివరి వారంలో బదిలీ అయ్యారు. మూడు నెలల తర్వాతే రేఖా రైస్ మిల్లు వ్యవహారంపై ఇక్కడి అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. కొత్త మలుపులు.. ఈ వ్యవహారంలో కొందరు పోలీసు, రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఉండటంతో విజిలెన్స్ బృందంపై తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో సీఐడీ లేదా ఏసీబీకి బదిలీ చేయాలని కోరినట్టు తెలిసింది. అయితే సీఐడీకి అప్పగిస్తే తమ శాఖపై అపవాదు వస్తుందనే గ్రహించి ఏసీబీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసు విచారణలో ప్రలోభాలకు గురిచేసే వారిపై మరింత దూకుడుగా చర్యలు తీసుకోవచ్చనే భావిస్తున్నారు. బియ్యం పట్టుబడిన క్రమంలో ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన అంశాలపై లోతైన విచారణ చేయాలనే ఆదేశాలు ఉన్నట్టు సమాచారం. మూడు శాఖల అధికారులపై కొరడా ఝుళిపించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు నిందితుడు డీటీ గణపతిరావు పరారీలో ఉన్నాడు. అయితే కాల్‌డేటా ఆధారంగా నిఘా ఉంచాం. త్వరలో అదుపులోకి తీసుకుంటాం. బాధ్యులపై కఠినచర్యలు తప్పవు. ప్రత్యేక నిఘా బృందంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఆశాఖ అధికారుల కాల్‌డేటాను సైతం పరిశీలిస్తాం. బంధువులు, స్నేహితుల వివరాలపై ఆరా తీస్తున్నాం. – రమాదేవి, పట్టణ రెండో ఎస్ఐ, గద్వాల ఆదేశాలు వస్తే విచారణ చేపడ్తాం రేఖా రైస్‌మిల్లులో పట్టుబడిన బియ్యం కేసుపై ఆదేశాలు వచ్చిన వెంటనే విచారణ చేపడ్తాం. అయితే కొన్ని రోజులుగా ఈ వ్యవహారంపై మీడియాలో వస్తున్న కథనాలను పరిశీలిస్తున్నాం. ఏదిఏమైనా ప్రజాధనం దుర్వినియోగం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. విజిలెన్స్, ఏసీబీ సంయుక్తంగా పనిచేస్తాయి. అక్రమార్కులపై నిఘా ఉంచాం. – కృష్ణయ్యగౌడ్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఏసీబీ అధికారి -
ఫోర్జరీ సంతకాలతో బ్యాంకు రుణం
తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు విజయనగరం ,జియ్యమ్మవలస : తహసీల్దార్, వీఆర్ఓ, డీటీల సంతకాలు ఫోర్జరీ చేసి రుణం పొందిన సంఘటన మండలంలోని పెదబుడ్డిడి గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సీమల రమాదేవికి మూడెకరాల జిరాయితీ పొలం ఉంది. దీనిపై ఆమె (సర్వే నంబర్లు 259/9, 258/10, 264/1, 3, 271/4) రావివలస ఆంధ్రాబ్యాంక్ బ్రాంచిలో లక్ష రూపాయల రుణం కూడా తీసుకుంది. అయితే శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం విక్రమపురానికి చెందిన మాచర్ల అచ్యుతరావు నకిలీ కౌలుపత్రాలు సృష్టించి పల్లి కొండయ్య అనే వ్యక్తిని జామీనుగా చూపించి లక్ష రూపాయల రుణం తీసుకున్నారు. వీరిద్దరు కూడా ఆంధ్రాబ్యాంక్ రావివలస బ్రాంచిలో తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితురాలు రమాదేవి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్‌కు సోమవారం వినతిపత్రం అందజేసింది. దీనిపై తహసీల్దార్ కేవీఎస్ భాస్కరరావు స్పందిస్తూ ఈ విషయమై విచారణ చేపడతామన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో ఎంపీటీసీ సభ్యుడు బాబూ భువనమోహనరావు, గ్రామపెద్దలు ఉన్నారు. -
రెవెన్యూ శాఖలో బదిలీలు ప్రారంభం
తొలి జాబితాలో తహశీల్దార్లు, డీటీలు,మరో రెండు రోజుల్లో మిగిలిన కేడర్లు సిఫారసులపై అధికారుల కుస్తీ శ్రీకాకుళం పాతబస్టాండ్ : రెవెన్యూ శాఖలో బదిలీలు గురువారం ప్రారంభమయ్యాయి. రెండు నెలలుగా బదిలీలపై తర్జన భర్జన, సిపారసులకు తెర పడనుంది. బుధ, గురువారాల్లో ఈ సిపార్సులు మరింతగా వచ్చా యి. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మధ్య అధికారులు ఇబ్బందులు పడుతూనే తుది జాబి తాలు సిద్ధం చేస్తున్నారు. గురువారానికి తహశీల్దారు, డిప్యూటీ తహశీల్దార్లు బదిలీలు జాబితాలు వెలుగు చూశాయి. ఈ బదిలీల్లో పదోన్నతి పొందిన ఉప తహశీల్దార్లకు స్థానాలు కల్పించారు. ఈ బదిలీలు ఉద్యోగుల ఇష్టాఇష్టాల కంటే పాలకులు సిఫారసులకే పెద్ద పీటవేశారు. రాజకీయ నాయకుల లేఖల ఆధారంగానే బదిలీలు చేపట్టారు. మరో రెండు రోజుల్లో సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, వీఆర్ఓల బదిలీల జాబితాలు విడుదలకానున్నాయి. ఈ బదిలీలు ఎప్పటికప్పుడు పెరగడం, మార్పుచేడంతో ఇంకా ఒక కొలిక్కి రాలేదు. జిల్లాలో 21 మంది తహశీల్దార్లను బదిలీ చేశారు. 77 మంది ఉప తహశీల్దార్లకు బదిలీలు జరిగాయి. 310 మంది గ్రామ రెవెన్యూ అధికారులకు, 41 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఇతర కేడర్లు అటెండర్లు, టైపిస్టులకు బదిలీలు జరిగాయి. వీరిలో కొంతమంది పదోన్నతులు కూడా కలిపి బదిలీలు నిర్వహిస్తున్నారు. -
ఏసీబీ వలలో కపిలేశ్వరపురం డీటీ
కపిలేశ్వరపురం, న్యూస్‌లైన్ :కపిలేశ్వరపురం మండల డిప్యూటీ తహశీల్దారు (డీటీ) పి.శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. సోమవారం సాయంత్రం తహశీల్దారు కార్యాలయంలో కపిలేశ్వరపురానికి చెందిన ఓ రేషన్ షాపు డీలరు నుంచి రూ.ఐదు వేలు లంచం తీసుకుంటుండగా రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోని బృందం వలపన్ని పట్టుకుంది. డీఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సత్యసాయి మహిళా శక్తి సంఘం అధ్యక్షురాలు అనుకుల చిట్టిరత్నం 30వ నంబరు రేషన్‌షాపును నిర్వహిస్తున్నారు. సరుకుల పంపిణీ పూర్తయ్యాక స్టాకు రిజిస్టర్, మిగిలిన కూపన్లు, సంబంధిత రిక్టారులను తహశీల్దారు కార్యాలయంలో జమ చేసి కొత్త సేల్స్ రిజిస్టర్ తీసుకోవడం ప్రతి నెలా జరిగే ప్రక్రియ. చిట్టిరత్నంకు జనవరి నెలకు సంబంధించిన కొత్త సేల్స్ రిజిస్టర్‌ను ఇచ్చేందుకు డిప్యూటీ తహశీల్దారు శ్రీనివాసరావు రూ.ఆరు వేలు లంచం డిమాండ్ చేశారు. దాంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారి సూచనల మేరకు రూ.ఐదు వేలు లంచం ఇచ్చేందుకు అంగీకరించిన చిట్టిరత్నం తహశీల్దారు కార్యాలయానికి వెళ్లి ఆ మొత్తం ఇస్తుండగా పట్టుకున్నారు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్లు సంజీవరావు, రాజశేఖర్ పాల్గొన్నారు. కాగా డిప్యూటీ తహశీల్దారు అవినీతికి పాల్పడిన సంఘటనపై విచారణ జరుపుతున్నామని డీఎస్పీ వెంకటేశ్వరరావు విలేకరులకు తెలిపారు. కార్యాలయంలో రసాయనిక పరీక్షలు జరిపామని, సంబంధిత రికార్టులను పరిశీలించామని, మండపేటలోని శ్రీనివాసరావు నివాసంలో కూడా సోదాలు చేస్తామని చెప్పారు. ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పర్చుతామన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే 94404 46160, 94404 46161, 94404 46163 నంబర్లకు తెలపాలని కోరారు. మండలంలో పెచ్చుమీరిన అవినీతి కపిలేశ్వరపురం మండలంలో రెవెన్యూ అధికారుల అవినీతి పెచ్చుమీరింది. ఏసీబీకి చిక్కిన శ్రీనివాసరావు 2012 ఆగస్టులో ఇక్కడ డిప్యూటీ తహ శీల్దారుగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు అదే హోదాలో కాజులూరు మండలంలో పని చేశారు. లంక భూములు విస్తారంగా ఉన్న మండలంలో తరచూ మట్టి తవ్వకాలు జరగడం, లంక భూములు వివాదాల్లో ఉండటం తదితర కారణాల రీత్యా ఎవరు వచ్చినా ‘పై సంపాదన’ హెచ్చుగానే ఉంటోంది. 2013 జూన్ నాలుగున అప్పటి తహశీల్దారు వి.చిట్టిబాబు అంగరకు చెందిన ఓ చేనేత సహకార సంఘానికి కమ్యూనిటీ హాలు నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. చిట్టిబాబుకు ముందు తహశీల్దారుగా పనిచేసిన డి.నాగేశ్వరరావు కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.