తొలి జాబితాలో తహశీల్దార్లు, డీటీలు,మరో రెండు రోజుల్లో మిగిలిన కేడర్లు సిఫారసులపై అధికారుల కుస్తీ
శ్రీకాకుళం పాతబస్టాండ్ : రెవెన్యూ శాఖలో బదిలీలు గురువారం ప్రారంభమయ్యాయి. రెండు నెలలుగా బదిలీలపై తర్జన భర్జన, సిపారసులకు తెర పడనుంది. బుధ, గురువారాల్లో ఈ సిపార్సులు మరింతగా వచ్చా యి. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మధ్య అధికారులు ఇబ్బందులు పడుతూనే తుది జాబి తాలు సిద్ధం చేస్తున్నారు. గురువారానికి తహశీల్దారు, డిప్యూటీ తహశీల్దార్లు బదిలీలు జాబితాలు వెలుగు చూశాయి. ఈ బదిలీల్లో పదోన్నతి పొందిన ఉప తహశీల్దార్లకు స్థానాలు కల్పించారు.
ఈ బదిలీలు ఉద్యోగుల ఇష్టాఇష్టాల కంటే పాలకులు సిఫారసులకే పెద్ద పీటవేశారు. రాజకీయ నాయకుల లేఖల ఆధారంగానే బదిలీలు చేపట్టారు. మరో రెండు రోజుల్లో సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, వీఆర్‌ఓల బదిలీల జాబితాలు విడుదలకానున్నాయి.
ఈ బదిలీలు ఎప్పటికప్పుడు పెరగడం, మార్పుచేడంతో ఇంకా ఒక కొలిక్కి రాలేదు. జిల్లాలో 21 మంది తహశీల్దార్లను బదిలీ చేశారు. 77 మంది ఉప తహశీల్దార్లకు బదిలీలు జరిగాయి. 310 మంది గ్రామ రెవెన్యూ అధికారులకు, 41 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఇతర కేడర్లు అటెండర్లు, టైపిస్టులకు బదిలీలు జరిగాయి. వీరిలో కొంతమంది పదోన్నతులు కూడా కలిపి బదిలీలు నిర్వహిస్తున్నారు.
రెవెన్యూ శాఖలో బదిలీలు ప్రారంభం
Published Fri, Nov 14 2014 4:45 AM | Last Updated on Thu, Apr 4 2019 2:48 PM
Advertisement
Advertisement