మూగ బాలికపై రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అత్యాచారం
గుంటూరు: మహిళలు, బాలికల రక్షణకు కఠిన శిక్షలతో అభయ చట్టం రూపొందించినప్పటికీ ఫలితంలేకుండా పోయింది. అత్యాచారాల వంటి అమానుష ఘటనలు ఏమాత్రం అదుపులోకి రాలేదు. రోజురోజుకి పెరిగిపోతున్నాయి. విజయవాడలో ఓ బాలికను గదిలో బంధించి నెల రోజులుగా అయిదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఈ ఉదయమే వెలుగులోకి వచ్చింది.
గుంటూరు జిల్లా నగరం మండలం చినమట్లపూడి గ్రామంలో ఇప్పుడు మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఇక్కడ మూగ బాలికపై రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు.