ఉద్యోగం ఇప్పిసానని టోకరా..!
దేవరకొండ: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు... ప్రతిఫలంగా రూ. 5.50 లక్షలు డిమాండ్ చేశాడు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ఓ నకిలీ జాయినింగ్ ఆర్డర్ తయారు చేసి ఇచ్చారు. దీనికి తోడు ముఖ్యమంత్రే స్వయంగా వీఆర్వో జాబ్ ఇవ్వాలని సూచించినట్లు ఆ కార్యాలయం నుంచి ఒక రికమండేషన్ లెటర్ కూడా తయారు చేసి ఇచ్చారు. కాని ఉద్యోగానికెళ్తే ఆ యు వకుడికి చేదు అనుభవమే ఎదురైంది. బాధితుడు తెలి పిన వివరాల ప్రకారం..దేవరకొండ పట్టణానికి చెందిన జెల్దా వేణు స్థానికంగా ఓ లేడీస్ కార్నర్ నిర్వహిస్తున్నాడు.
అతడికి తెలిసిన ఓ వ్యక్తి ద్వారా ఉద్యోగం వస్తుందని తెలపడంతో ఆశ పడా డడు. ఈక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బోధనపల్లి విజయభాస్కర్‌తో పరిచయం ఏర్పడింది. అతను తనకున్న పరిచయాలతో వీఆర్వో ఉద్యో గం ఇప్పిస్తానన్నాడు. అందుకు ప్రతిఫలంగా డిమా ండ్ చేసిన అయిదున్నర లక్షలను వేణు గత జనవరిలో విజయభాస్కర్‌రెడ్డికి ముట్టజెప్పాడు. ఇందు కు భరోసాగా విజయభాస్కర్‌రెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట గల రూ. 5లక్షల చెక్కులను వేణుకు ఇచ్చాడు.
ఆ తర్వాత ఉద్యోగం గురిం చి భాస్కర్‌రెడ్డిని అడగటంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రికమండేషన్ లెటర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ల్యాం డ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మునగాల మండలం రంగాపురం వీఆర్వోగా నియామకమైనట్లు బోగస్ జాయినింగ్ ఆర్డర్ కూడా వేణుకు ఇచ్చాడు. దీంతో వేణు గత అక్టోబర్ 29న ఉద్యోగంలో చేరడానికి ఆ మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా అవి నకిలీవని తేల్చిచెప్పడంతో నివ్వెరపోయాడు.
అయితే కొంత కాలంగా తన డబ్బు తన కు ఇవ్వాలని విజయభాస్కర్‌రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తుండగా తప్పించుకుని తిరుగుతుండటంతో వేణు బోరుమంటున్నాడు. నిరుపేదనైన తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఈ విషయమై దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వేణు పేర్కొన్నాడు. దీనిపై సీఐని వివరణ కోరగా తమకు లిఖితపూర్వకమైన ఫిర్యాదు అందితే విచారిస్తామన్నారు.