ప్రత్యూష బాధ్యతలకు 'దుర్గాబాయి దేశ్ ముఖ్'
హైదరాబాద్: ఎట్టకేలకు ప్రత్యూషకు అండగా నిలిచేందుకు ప్రముఖ సంస్థ ముందుకొచ్చింది. ఆమెమంచి చెడులు చూసేందుకు, పూర్తిస్థాయి బాధ్యతలు చూసేందుకు దుర్గాబాయి దేశ్ ముఖ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్ధ శనివారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది.
కన్నతండ్రి, సవతి తల్లి చేతిలో దారుణంగా చిత్ర హింసలకు గురై ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రత్యూష పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందరూ ఉన్నా.. ఆమె సంరక్షణకు ఎవరూ ముందుకు రాకపోవడం బాధకలిగిస్తోందని హైకోర్టు పేర్కొంది. కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు పలువురిని కదిలించాయి. అంతకుముందు ఎవరూ ముందుకు రాకుంటే ప్రత్యూష బాధ్యతలు తాను తీసుకుంటానంటూ నటుడు పోసాని కృష్ణమురళి ముందుకొచ్చిన విషయం తెలిసిందే.