ట్రిపుల్ తలాక్ అంతరించిన విధానం
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతుండటంతో దీనికి పునరుజ్జీవం వచ్చిందని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) పేర్కొంది. మూడు సార్లు తలాఖ్ చెప్పే విధానం దాదాపు కనుమరుగైందని, సుప్రీంకోర్టుల లాంటి సెక్యులర్ వేదికలపై చర్చించడం లేదా సవాలు చేయడంతో మళ్లీ దీనికి మళ్లీ ప్రాణం పోసినట్టైందని వ్యాఖ్యానించింది.
ట్రిపుల్ తలాక్, ముఖిక విడాకుల రాజ్యాంగ బద్ధతను సవాల్ చేయడం ముస్లిం సమాజానికి ఎదురుదెబ్బగా ఏఐఎంపీఎల్బీ తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ట్రిపుల్ తలాక్ అంశంపై వాదోపవాదనలతో వ్యతిరేక ప్రభావం చూపే అవకాశముందని కోర్టుకు తెలిపారు. బహుభార్యత్వం, మౌఖిక విడాకులు విధానాలకు ఊతం లభించనుందని అభిప్రాయపడ్డారు. ముస్లిం సమాజంలో ట్రిపుల్ తలాక్ విధానాన్ని పాటించే వారు చాలా స్వల్పమని చెప్పారు.
నిఖానామా, వివాహ ఒప్పందం సందర్భంలో సమయం నమోదు చేయాలని మతపెద్దలను ఏఐఎంపీఎల్బీ ఆదేశిస్తుందా.. ట్రిపుల్ తలాక్ ఆమోదయోగ్యమా, కాదా అని మహిళలను అడుతారా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ప్రశ్నించారు. సభ్యులందరితో మట్లాడిన తర్వాతఏఐఎంపీఎల్బీ దీనిపై స్పందిస్తుందని కపిల్ సిబల్ సమాధామిచ్చారు.