e-Panchayat
-
డిజిటల్ వైపు జీపీలు
సాక్షి, జనగామ: గ్రామ పాలనను మరింత జవాబుదారీతనంగా తీర్చిదిద్దడానికి గ్రామ పంచాయతీల్లో డిజిటల్ సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ధ్రువీకరణ పత్రాల జారీ నుంచి బిల్లుల చెల్లింపుల వరకు అన్నీ ఆన్లైన్లోనే అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో ఇ–గవర్నెన్స్ అమలు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ ప్రక్రియ ద్వారానే పంచాయతీల్లోని పనులను నిర్వహించనున్నారు. డిజిటల్ సేవలపై ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలో మరో 20 రోజుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చేతి రాతకు చెల్లు చీటీ గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం అమలు పర్చుతోంది. అందులో భాగంగా పంచాయతీ రాజ్ చట్టం–2018ను అమలులోకి తీసుకొచ్చింది. 500 జనాభా కలిగిన గిరిజన తండాతోపాటు శివారు గ్రామాలను సైతం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శిని సైతం నియమించింది. ఇక పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది. గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఉన్న మ్యానువల్ విధానానికి స్వస్తి చెప్పనున్నారు. ఇ–గవర్నెన్స్ అమలులో భాగంగా డిజిటల్ సేవలను అమలు చేయనున్నారు. గ్రామ పంచాయతీ నుంచి పొందే ప్రతి ధ్రువీకరణ పత్రాన్ని ఆన్లైన్ నుంచే తీసుకునే విధంగా చర్యలను ప్రారంభించారు. ఇక నుంచి ఇ–పంచాయతీ అప్లికేషన్లు, భవన నిర్మాణ అనుమతులు, పేరు మార్పిడి, లైసెన్సుల జారీ, ఇంటి పన్ను వసూళ్లు, లే–అవుట్ అనుమతులు అన్నీ ఆన్లైన్ ద్వారా జారీచేస్తారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హరితహారం కార్యక్రమం ప్రొగ్రెస్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయనున్నారు. ఆన్లైన్లోనే చెక్‌లు.. గ్రామ పంచాయతీలో రాత చెక్కులకు స్వస్తి చెప్పనున్నారు. పాత చెక్కుల విధానానికి చెక్‌పెట్టి పూర్తి పారదర్శకతతో చెక్కులను అందించడానికి డిజిటల్ కీ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పాత విధానంతో గ్రామపంచాయతీల్లో నిధుల దుర్వినియోగం అవుతున్నాయనే భావనతో ఈ దిద్దుబాటు చర్యలను చేపట్టారు. ఇది వరకు గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం చేసిన ఖర్చులను చెక్ రూపంలో చెల్లించే వారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సంతకం చేసిన చెక్‌ను ట్రెజరీ ద్వారా బ్యాంకుకు పంపించేది. అన్నీ సరి చూసుకున్న తరువాత బ్యాంకు ద్వారా నగదు విడుదలయ్యేది. ఈ విధానం ద్వారా పనులు తక్కువ.. నిధుల వినియోగం ఎక్కువగా ఉండి ప్రజాధనం ఎక్కువగా దుర్వినియోగం అయ్యేది. మారిన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారంగా ప్రతి పైసాకు లెక్క చూపే విధంగా డిజిటల్ కీ అమలు చేయబోతున్నారు. సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ అధికారం ఇచ్చారు. గ్రామంలో చేపట్టిన పనుల వివరాలను ముందుగా ఇ–పంచాయతీ సాఫ్ట్‌వేర్‌లో గ్రామ కార్యదర్శులు నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను నమోదుచేసిన తరువాత ఆన్లైన్ చేస్తే డిజిటల్ చెక్ బయటకు వస్తుంది. సర్పంచ్, ఉప సర్పంచ్ల సెల్‌నంబర్లకు ఓటీపీ వస్తుంది. డిజిటల్ చెక్‌పై సర్పంచ్, ఉససర్పంచ్ సంతకాలు చేసి కార్యదర్శి ఎస్టీఓకు పంపిస్తారు. అప్పుడు నిధులు విడుదల అవుతాయి. ఏమాత్రం తప్పులు దొర్లినా నిధుల విడుదల చేతికి రావడం కష్టం. ఈ–పంచాయతీ సేవలపై శిక్షణ కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం డిజిటల్ సేవలు అమలు చేయబోతున్నాం. ఆన్లైన్లోనే చెక్కులను అందిస్తాం. సంతకాలను స్కాన్ చేసి ఆన్లైన్ చేయాలి. డిజిటల్ సేవలపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చాం. త్వరలో జిల్లాలో ఇ–గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. – డి. వెంకటేశ్వరరావు, డీపీఓ -
పంచాయతీల్లో ఇక అన్ని సేవలూ ఒకేచోట..!
‘ఈ-పంచాయతీ’ పథకంపై సమీక్షలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో అన్ని సేవలు ఒకేచోట ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘ఈ-పంచాయతీ’ పథకంపై పం చాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షిం చారు. అన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఆసక్తి చూపిస్తున్న సర్వీసు ప్రొవైడర్ల కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అదించేందుకు, ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలకు, అవినీతికి అవకాశ ం లేకుండా పారదర్శకత పెంచడానికి ఈ పథకాన్ని వినియోగించుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఆయన సర్వీసు ప్రొవైడర్లకు ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. నాలుగేళ్లలో మిగులు విద్యుత్ రాష్ర్టంగా.. రాబోవు నాలుగేళ్లలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణాను మారుస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నగరంలోని ఫ్యాప్సీ భవనంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్ మెనేజ్మెంట్ అసోసియేషన్ గోల్డన్జూబ్లీ ఉత్సవాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తెలంగాణలో 39 శాతం అర్బన్, 61 శాతం గ్రామీణ ప్రాంతం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రాబోవు మూడేళ్లలో 75 లక్షల ఎకరాల భూమికి నీరు అందించి సాగులోకి తేవడం ఖాయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అతి పెద్ద సాంకేతిక హబ్ దేశంలోనే అతిపెద్ద సాంకేతికపరమైన హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇందులో సుమారు 15 వందల సాంకేతిక సంస్థలకు అవకాశం కల్పిస్తున్నుట్లు పేర్కొన్నారు. ఐటీ రంగంలో నూతన సాంకేతిక పరి జ్ఞానాన్ని జోడించి మరింత అభివృద్ధి పర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ రాష్ర్టంలోని 40 శాతం భూ భాగాన్ని హైదరాబాద్ మహానగరం విస్తరించి ఉందన్నారు. దేశంలోనే ఉత్తమ నివాసయోగ్యమైన సురక్షిత మహానగరం హైదరాబాద్ అని అభివర్ణించారు. అపోలో గ్రూప్ హస్పిట ల్స్ ఎండీ సంగీతా రెడ్డి మాట్లాడుతూ ప్రజలను, వారి అవసరాలను తక్కువగా అంచనా వేయ డం వల్లే ప్రభుత్వ యంత్రాంగాలు విఫలమవుతున్నాయన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంఎ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రముఖ పాత్రికేయుడు కింగ్సుక్ నాగ్, ఉపేందర్ పాల్గొన్నారు. -
319 ఈ-పంచాయతీలు
గ్రామాల్లో ఆన్లైన్ పాలన - పనులు వేగవంతం... పారదర్శకత - ఇప్పటికే 26 పంచాయతీల్లో అమలవుతున్న ఆన్లైన్ - 173 మంది డేటా ఆపరేటర్లకు శిక్షణ - పల్లెలకు చేరిన కంప్యూటర్లు కరీంనగర్ సిటీ : గ్రామపంచాయతీల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పరిపాలనకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి గ్రామ స్వరూపాలను మార్చేందుకు నడుం కట్టింది. అవినీతి నిర్మూలన, వేగవంతమైన పాలన అందించేందుకు ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తూ ఈ-పంచాయతీలకు రూపకల్పన చేసిన ప్రభుత్వం ఈ-సేవలను మరింత విస్తరించనుంది. పరిమిత సంఖ్యలో ఉన్న ఈ-పంచాయతీలను పూర్తిస్థాయి విస్తరించేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఈ-పంచాయతీ అంటే... ఆన్లైన్ విధానంలో పరిపాలనను కొనసాగించే పద్ధతినే ఈ-పంచాయతీ అంటారు. గ్రామానికి సంబంధించిన అన్ని విభాగాలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చి, పారదర్శకపాలనను అందించడం ప్రధాన లక్ష్యం. పన్నులు, వేలం తదితర మార్గాల ద్వారా గ్రామాలకు వచ్చే ఆదాయం, రోడ్లు, తాగునీటి సరఫరా, వీధిదీపాలు తదితర ప్రజల అవసరాల కోసం వెచ్చించిన ఖర్చు వివరాలు, వివిధ రకాల పింఛన్ల చెల్లింపు, ధ్రువీకరణ పత్రాలు ఇలా మొత్తం వివరాలను ఆన్లైన్లో సమగ్రంగా పొందుపరుస్తారు. ఒక్క క్లిక్‌తో గ్రామపంచాయతీ ఆదాయం, వ్యయం, పనుల వివరాలు కంప్యూటర్లో ప్రత్యక్షమవుతాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు మీసేవలో లభించే సేవలను కూడా త్వరలోనే ఈ-పంచాయతీల ద్వారా అందించనున్నారు. ఎంపిక చేసిన క్లస్టర్ గ్రామపంచాయతీలను ఈ-పంచాయతీలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘కార్వీ’ డేటా మేనేజ్మెంట్కు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం, కార్వీ కంపెనీలు కలిపి ఈ-పంచాయతీల నిర్వహణను చేపట్టనున్నాయి. పంచాయతీలవారీగా ప్రత్యేక ‘ఐడీ’ ‘పాస్వర్డ్’ రూపొందిస్తారు. ప్రస్తుతానికి కంపెనీ 173 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించగా, ఎంపిక చేసిన గ్రామాల్లో వారు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీనికోసం డేటా ఎంట్రీ ఆపరేటర్లకు తిమ్మాపూర్ మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. లోకల్ గవర్నమెంట్ డెరైక్టరీ, ఏరియా చా ప్రొఫైలర్, నేషనల్ పంచాయతీ పోర్టల్ అప్లికేషన్స్, ప్రియా సాఫ్ట్, ప్లాన్‌ప్లస్, యాక్షన్ సాఫ్ట్, యూనిఫైడ్ బర్త్, డెత్ అప్లికేషన్స్‌తోపాటు ఇతర అప్లికేషన్స్‌పై ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే చేరిన కంప్యూటర్లు ఈ-పంచాయతీలను క్లస్టర్ల వారీగా ఏర్పాటుచేయనున్నారు. జనాభా ఆధారంగా ఒకటి, రెండు లేదా మూడు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తారు. జిల్లాలో 1207 గ్రామపంచాయతీలు ఉండగా, జిల్లా అధికారులు 621 క్లస్టర్ పంచాయతీలను గుర్తించారు. డివిజన్, మండలాలవారీగా క్లస్టర్ గ్రామపంచాయతీల వివరాలను అధికారులు ఇప్పటికే వెల్లడించారు. వీటిలోంచి 319 క్లస్టర్ గ్రామాలను ఈ-పంచాయతీలుగా ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో ఈ-పంచాయతీ విధానం అమలులోకి తీసకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. చందుర్తి, కాటారం, మహదేవపూర్, సారంగాపూర్ లలో ఒక్కోటిగా మండల కేంద్రాలనే ఎంపిక చేయగా, మానకొండూరు మండలంలో అత్యధికంగా 13 క్లస్టర్ గ్రామాలను ఎంపిక చేశారు. జిల్లాలో ఇప్పటికే 26 గ్రామపంచాయతీల్లో ఈ-పంచాయతీ సేవలు అందుతున్నాయి. ముల్కనూరు, చొప్పదండి, ధర్మపురి, గంభీరావుపేట, గంగాధర, హుస్నాబాద్, హుజూరాబాద్, ఇబ్రహీంపట్నం, బండలింగాపూర్, జమ్మికుంట, కమలాపూర్, ఉప్పల్, కొత్తపల్లి, కొడిమ్యాల, కోరుట్ల, మల్లాపూర్, మల్యాల, మంథని, మెట్పల్లి, ముస్తాబాద్, పెద్దపల్లి, రాయికల్, పాలకుర్తి, సుల్తానాబాద్, వేములవాడ, ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీల్లో ఇప్పటికే ఈ-పంచాయతీ విధానం అమలులో ఉంది. పాతవి 26, కొత్తవి 319 కలిపి మొత్తం 345 గ్రామపంచాయతీలు ప్రస్తుతానికి ఈ-పంచాయతీ పరిధిలోకి రానున్నాయి. ఇందుకు అవసరమైన కంప్యూటర్లు ఇప్పటికే జిల్లాకు చేరాయి. 319 గ్రామాలకు 319 కంప్యూటర్లు రాగా, జిల్లా ప్రజాపరిషత్‌కు రెండు, 57 మండల పరిషత్ కార్యాలయాలకు, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ డీఎల్పీవోలకు ఒక్కోటి చొప్పున మూడు, జిల్లా పంచాయతీ కార్యాలయానికి రెండు కంప్యూటర్లను కార్వీ కంపెనీ అందజేసింది. వేగవంతం... పారదర్శకత రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు పదిరోజుల క్రితం జెడ్పీ హాల్లో నిర్వహించిన కరీంనగర్ మండల ప్రణాళికలో ఈ పంచాయతీలను విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఆయన ప్రకటించడంతో ఇప్పుడు విస్తరించిన సేవలతోపాటు మరికొన్ని రోజుల్లోనే జిల్లా మొత్తం ఈ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. ఈ-పంచాయతీలతో ఆయా గ్రామాల్లో ప్రజలకు పరిపాలనాపరంగా మెరుగైన సేవలు అందనున్నాయి. ఆన్లైన్ తో పనులు వేగంగా సాగడంతోపాటు అవినీతికి తావులేని పారదర్శక పాలన అందనుంది. -
ఈ-పంచాయతీ
మందమర్రి రూరల్ : గ్రామాల అభివృద్ధే లక్ష్యంతో దూసుకెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. గ్రామ పాలన ను అంతర్జాలానికి అనుసంధానం చేస్తోంది. మారుమూల గ్రామాల్లోనే పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ-పాలనను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా పంచాయతీలను ప్రపంచంతో అనుసంధానం చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 8,778 గ్రామ పంచాయతీలకు గాను.. 2చ440 పంచాయతీలను ఈ-పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు కావాల్సిన మార్గదర్శకాలనూ సూచించింది. అందులో భాగంగా జిల్లాలో మొత్తం 866 గ్రామ పంచాయతీలకు గాను వీటిని 580 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఒక క్లస్టర్ కింద రెండు లేదా మూడు పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం 145 క్లస్టర్ల పంచాయతీలను ఈ-పంచాయతీలుగా ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా చకాచకా సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాకు కంప్యూటర్లు కూడా చేరుకున్నాయి. బీఎస్ఎన్ల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. జిల్లాలోని మూడు డివిజన్లలో మొదటిసారిగా ఈ-పంచాయతీ పాలన అమలులోకి రానుంది. ఎంపిక చేసిన 145 క్లస్టర్ పంచాయతీలలో ఆదిలాబాద్ డివిజన్లో 51, ఆసిఫాబాద్ డివిజన్లో 34, నిర్మల్ డివిజన్లో 60 పంచాయతీలకు కంప్యూటర్లు ఇవ్వనున్నారు. 145 కంప్యూటర్ల పంపిణీ.. ఈ-పంచాయతీల కోసం జిల్లాకు 145 కంప్యూటర్లు మంజూరయ్యాయి. వీటిని జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యలయాలకు ఒకటి చొప్పున, జిల్లా పరిషత్ కార్యాలయాలకు రెండు, డివిజన్ స్థాయి కార్యాలయాలకు ఒకటి చొప్పున పంపిణీ చేశారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ డివిజన్లలో, డీపీవో కార్యాలయంలో, 52 మండల పరిషత్‌లలో కంప్యూటర్లు పంపిణీ చేశారు. ఎంపికైన పంచాయతీలకు ఈ కంప్యూటర్లు పంపిణీ చేయాల్సి ఉంది. కంప్యూటర్ల పంపిణీ అనంతరం బీఎస్ఎన్ల్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. గతంలో ఏడింటిలో ‘ఈ’ పాలన గతంలోనూ జిల్లా వ్యాప్తంగా ఏడు పంచాయతీలను ఎంపిక చేశారు. ఇచ్చోడ, ఉట్నూర్, ముథోల్, బాసర, ఆసిఫాబాద్, క్యాతన్‌పల్లి, నస్పూర్‌లలో ఈ పాలన సాగుతోంది. ప్రస్తుతం ఉన్న ఏడు, ఇప్పుడు మంజూరైన 145 గ్రామ పంచాయతీలతో కలిపి జిల్లాలో 152 పంచాయతీలలో ఈ-పాలన సాగనుంది. ఇక ప్రభుత్వ సేవలు అందుబాటులోకి.. ఈ- పాలనాలో అన్ని ప్రభుత్వ సేవలు పారదర్శకంగా నిర్వహించనున్నారు. పంచాయతీలకు ఆదాయం ఎలా వ చ్చింది. ఎంత ఖర్చు చేశారనే వివరాలను ఆన్లైన్లో ఉం చుతారు. ఎలాంటి దాపరికం లేకుండా గ్రామపాలన సాగే అవకాశం ఉంది. అధికారులు ఎలాంటి అవకతవకులకు పాల్పడే వీలులేకుండా పోతుంది. అంతే కాకుండా గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని రకాల పింఛన్లు, ఉపాధి హామీ వేతనాల పంపిణీ కూడా ఆన్లైన్లో ఉంచుతారు. ప్రభుత్వం నుంచి విడుదల అయ్యే ప్రతి పైసా లెక్క ఉం టుంది. ఈ- పాలనలో ప్రస్తుతం కొన్ని కార్యక్రమాలనే చే పడుతున్నారు. విజయవంతమైతే మీ-సేవలో పొందే ప్ర తీ సేవలను పొందొచ్చు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, అంగన్వాడీ కార్యకర్త, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితోపా టు మరికొందరిని భాగస్వాములను చేసే అవకాశం ఉంది. కంప్యూటర్లు పంపిణీ చేయాల్సి ఉంది.. - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి, ఆదిలాబాద్ ప్రస్తుతం క్లస్టర్ పంచాయతీలకు కంప్యూటర్లు పంపిణీ చేయాల్సి ఉంది. కొన్ని ప్రాంతాలలో బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంది. లేని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం సర్వే నడుస్తోంది. అది పూర్తి కాగానే కంప్యూటర్లు పంపిణీ చేస్తాం. -
కరీంనగర్ జిల్లాలో ఈ- గ్రామపంచాయతీలు: కేటీఆర్
సిరిసిల్ల (కరీంనగర్ జిల్లా): ఇరాక్‌లో ఉన్న తెలంగాణవారిని క్షేమంగా తీసుకొస్తామని ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) తెలిపారు. జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీని ఈ- గ్రామపంచాయతీగా ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశిస్తున్నట్టు చెప్పారు. సిరిసిల్లను పంచాయతీరాజ్ కేంద్రంగా మార్చాలని అధికారులకు సూచించామన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి శాశ్వత మంచినీటి పథకం ద్వారా నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు కృషిచేస్తామని కేటీఆర్ వాగ్దానం చేశారు.