పంచాయతీల్లో ఇక అన్ని సేవలూ ఒకేచోట..!
‘ఈ-పంచాయతీ’ పథకంపై సమీక్షలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో అన్ని సేవలు ఒకేచోట ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘ఈ-పంచాయతీ’ పథకంపై పం చాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షిం చారు. అన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఆసక్తి చూపిస్తున్న సర్వీసు ప్రొవైడర్ల కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అదించేందుకు, ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలకు, అవినీతికి అవకాశ ం లేకుండా పారదర్శకత పెంచడానికి ఈ పథకాన్ని వినియోగించుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఆయన సర్వీసు ప్రొవైడర్లకు ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.
నాలుగేళ్లలో మిగులు విద్యుత్ రాష్ర్టంగా..
రాబోవు నాలుగేళ్లలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణాను మారుస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నగరంలోని ఫ్యాప్సీ భవనంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్ మెనేజ్‌మెంట్ అసోసియేషన్ గోల్డన్‌జూబ్లీ ఉత్సవాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తెలంగాణలో 39 శాతం అర్బన్, 61 శాతం గ్రామీణ ప్రాంతం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రాబోవు మూడేళ్లలో 75 లక్షల ఎకరాల భూమికి నీరు అందించి సాగులోకి తేవడం ఖాయమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో అతి పెద్ద సాంకేతిక హబ్
దేశంలోనే అతిపెద్ద సాంకేతికపరమైన హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇందులో సుమారు 15 వందల సాంకేతిక సంస్థలకు అవకాశం కల్పిస్తున్నుట్లు పేర్కొన్నారు. ఐటీ రంగంలో నూతన సాంకేతిక పరి జ్ఞానాన్ని జోడించి మరింత అభివృద్ధి పర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ రాష్ర్టంలోని 40 శాతం భూ భాగాన్ని హైదరాబాద్ మహానగరం విస్తరించి ఉందన్నారు. దేశంలోనే ఉత్తమ నివాసయోగ్యమైన సురక్షిత మహానగరం హైదరాబాద్ అని అభివర్ణించారు. అపోలో గ్రూప్ హస్పిట ల్స్ ఎండీ సంగీతా రెడ్డి మాట్లాడుతూ ప్రజలను, వారి అవసరాలను తక్కువగా అంచనా వేయ డం వల్లే ప్రభుత్వ యంత్రాంగాలు విఫలమవుతున్నాయన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎంఎ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రముఖ పాత్రికేయుడు కింగ్‌సుక్ నాగ్, ఉపేందర్ పాల్గొన్నారు.