E pass-book
-
గుట్టు విప్పుతున్న ఈ–పాస్..!
సాక్షి,సిటీబ్యూరో: ప్రజా పంపిణీ వ్యవస్థలో అమలులోకి వచ్చిన ఈ–పాస్ విధానం అనర్హుల గుట్టువిప్పుతోంది. ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాల్లో సుమారు 25 నుంచి 35 శాతం వరకు నిందుకు అనర్హులని స్పష్టమవుతోంది. ఏడాదిగా ప్రతి నెల సరుకుల డ్రాకు దూరం ఉంటున్న కుటుంబాల సంఖ్య పెరుగుతూనే ఉంది. పీడీఎస్ బియ్యం అవసరం లేనివారు సరుకులకు దూరంగా ఉంటోన్నట్లు తెలుస్తోంది. ప్రతి కుటుంబానికి బియ్యం అవసరం ఉంటుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బియ్యం ధర రూ.50 పైగా పలుకుతోంది. నాణ్యతను బట్టి ధర ఎక్కువగా ఉంటోంది. మార్కెట్ ధర ప్రకారం బియ్యం కొనాలంటే దారిద్యరేఖకు దిగువ నున్న నిరుపేద కుటుంబాలకు పెను భారమే. ప్రభుత్వ చౌకధరల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం ధర కిలో రూ.1 మాత్రమే. కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం ఆరు కిలోల చొప్పున ప్రతి నెల రేషన్ కోటా విడుదల చేస్తోంది. అయితే ప్రతి నెల ఆహార భద్రత కార్డు దారుల్లో కొన్ని కుటుంబాలు సరుకులను తీసుకోవడం లేదు. ఒక వేళ స్థానికంగా లేకున్నా రాష్ట్ర, జిల్లా పోర్టబిలిటి విధానంలో ఎక్కడైనా డ్రా చేసుకునే వెసులు బాటు ఉంటుది. అయినా సరుకుల డ్రా కు మాత్రం దూరం పాటిస్తున్నారు. బహిరంగ మార్కెట్ ధర కంటే 50 రెట్ల తక్కువ ధరకు బియ్యం పంపిణీ చేస్తున్నా పలువురు ఆసక్తి చూపడం లేదు. నాణ్యమైన బియ్యాన్నే రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నా ఆహార భద్రత కార్డుదారులు మాత్రం బియ్యం తీసుకునేందుకు ఆసక్తి కనబర్చడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వెసలు బాటుతో... పేదల బియ్యం పక్కదారి పడుతుండటంతో దానికి అడ్డుకట్టవేసేందుకు పౌరసరఫరాల శాఖ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల నుంచి వరసగా సరుకులు డ్రా చేయని కుటుంబాల ఆహార భద్రత కార్డులను ఎట్టి పరిస్ధితిల్లో తొలగించబోమని సరిగ్గా ఏడాది క్రితం పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు. అప్పటి వరకు కార్డు రద్దవుతుందని కొందరు అప్పుడప్పుడు బియ్యం కొనుగోలు చేస్తుండగా, మరికొందరు బియ్యం కొనుగోలు చేసి కిరాణం, టిఫిన్ సెంటర్లకు రూ.10 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆహార భద్రత కార్డుదారుల్లో సగానికి పైగా మధ్య తరగతి కుటుంబాలు ఉండటంతో రేషన్ బియాన్ని కేవలం అల్పహార తయారీకి మా త్రమే వినియోగిస్తుంటారు. రేషన్ బియ్యం అవసరం పెద్దగా ఉండదు. సరుకులు డ్రా చేయ కున్నా పర్వాలేదన్న వెసులు బాటుతో ఇక సరుకులు డ్రా చేయడమే నిలిపివేసినట్లు తెలుస్తోంది. అవసరం లేకపోయినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు రద్దు చేసి ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. గతంలో తెల్లరేషన్ కార్డు బహుళ ప్రయోజన కారి కావడంతో నిరుపేదలతో పాటు మధ్య తరగతి, ప్రయివేటు ఉద్యోగులు సైతం భారీగా ఆహార భద్రత కార్డులు పొందారు. ప్రభుత్వం కార్డు దారుడి కుటుంబంలో సభ్యుడు (యూనిట్)కు ఆరు కిలోల చొప్పున బియ్యం కోటా కేటాయిస్తోంది. మూడేళ్ల క్రితం వరకు మ్యానువల్ పద్దతిలో బియ్యం పంపిణీ కొనసాగేది. గత రెండేళ్ల క్రితం ఈ–పాస్ ద్వారా సరుకులు పంపిణీ ప్రారంభం కావడంతో డీలర్ల చేతివాటానికి అడ్డుకట్ట పడింది. దీంతో రేషన్ బియ్యం అత్యవసరం లేనివారు రెండు మూడు నెలలకోసారి బియ్యం కొనుగోలు చేసి కార్డు రద్దు కాకుండా కాపాడుకుంటున్నారు. బియ్యం తీసుకోకున్నా కార్డులు రద్దు చేయబోమని అధికారులు ప్రకటించడం బియ్యం అవసరం లేని వారికి ఉపశమనం కలిగినట్లయింది. బియ్యం అవసరం లేని మధ్య తరగతి వర్గాలకు ఆహార భద్రత కార్డు అవసరమా,,? అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
ఏసీబీ వలలో వీఆర్వో
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: డిజిటల్ ఈ పాస్‌బుక్ కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ ఒక రైతును డిమాండ్ చేసిన వీఆర్వో సోమవారం రాత్రి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మండలంలోని సీహెచ్ పోతేపల్లికి ఇన్చార్జి వీఆర్వోగా పని చేస్తున్న పి.సుబ్రహ్మణ్యం రైతు కుమారుడు రాయపాటి లీలాకృష్ణమూర్తి నుంచి రూ. 4 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులు పన్నిన వలకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ సమాచారం ప్రకారం దొరసానిపాడుకు చెందిన రైతు రాయపాటి నాగేశ్వరరావుకు సీహెచ్ పోతేపల్లిలో 4.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమికి ప్రస్తుతం మేన్యువల్ పాస్‌బుక్ ఉండగా, దాన్ని డిజిటల్ ఈ పాస్‌బుక్‌గా మార్చమని కొద్ది నెలల క్రితం రైతు రాయపాటి కుమారుడు లీలాకృష్ణమూర్తి మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. కనీసం దాన్ని పరిశీలించకుండా వీఆర్వో తిరస్కరించాడు. ఈ క్రమంలో ఈ నెల 11న మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తరువాత వీఆర్వోను కలసి, తమకు ఈ పాస్‌బుక్ ఇప్పించాలని కోరాడు. ఇలా ఎన్నిసార్లు ఆన్లైన్లో దరఖాస్తులు చేసినా ఈ పాస్‌బుక్‌లు రావని, ఇక్కడొక రేటుంటుందని, అది చెల్లిస్తేనే పనులవుతాయని వీఆర్వో చెప్పాడు. ఈ క్రమంలోనే రూ. 4 వేలను ఇస్తే డిజిటల్ ఈ పాస్‌బుక్ వస్తుందంటూ తెలిపాడు. దీంతో లీలాకృష్ణమూర్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీనిపై ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ పథకం ప్రకారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలోని కంప్యూటర్ గదిలో లీలాకృష్ణమూర్తి నుంచి రూ. 4 వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్వో సుబ్రహ్మణ్యంను రెడ్‌హేండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తహసీల్దారు ఎం.కృష్ణమూర్తికి సమాచారాన్ని అందించారు. దీనిపై కేసు నమోదు చేశామని, వీఆర్వోను ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు డిఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సిఐ కె.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. చిన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు కోడిగూడెం వీఆర్వో సుబ్రహ్మణ్యం సీహెచ్ పోతేపల్లి ఇన్చార్జి వీఆర్వో సుబ్రçహ్మణ్యం మీసేవా ద్వారా తాను పెట్టుకున్న దరఖాస్తును కనీసం పరిశీలించలేదని ఫిర్యాది లీలాకృష్ణమూర్తి వాపోయారు. రెండోసారి మళ్లీ దరఖాస్తు చేసి ఆయన్ను సంప్రదించానన్నారు. డబ్బుల కోసం గట్టిగా డిమాండ్ చేశారన్నారు. లంచం ఇవ్వకుంటే ఇక్కడ పని జరగదని తెగేసి చెప్పాడన్నారు. ఎంతో మంది చిన్న చిన్న రైతులు ఇలాంటి అధికారుల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారు ఎవరికి చెప్పుకోలేక పోతున్నారు. అందుకే తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. -
పాస్ బుక్కులకు బ్రేక్!
♦ వెబ్‌ల్యాండ్ అప్డేషన్ తర్వాతే పంపిణీ ♦ ఈ -పాస్‌బుక్కులపై సర్కారు కసరత్తు ♦ రెవెన్యూ రికార్డులను సరిదిద్దకుండా జారీచేస్తే కొత్త సమస్యలు రాష్ర్టం ఏర్పడిన తర్వాత జిల్లాలో 60వేల పట్టాదారు పాసు పుస్తకాలను రెవెన్యూ యంత్రాంగం ముద్రించింది. వీటిలో ఇప్పటివరకు దాదాపు 35వేల మంది రైతులకు అందజేసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 11,12,029 సర్వేనంబర్లకు సంబంధించి ఆరు లక్షల క్లెరుుమ్‌లు అధికారుల దృష్టికి వచ్చారుు. వీటిన్నింటిని సవరించి కంప్యూటరీకరించడమే సవాలుగా మారింది. పట్టాదారు పాస్‌పుస్తకాల జారీకి ప్రభుత్వం బ్రేక్ వేసింది. రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ నేపథ్యంలో పాస్‌పుస్తకాల జారీని నిలిపివేసింది. త్వరలోనే ఈ-పాస్ బుక్కులను అందుబాటులోకి తేవాలని భావిస్తున్న సర్కారు.. ప్రస్తుతం జారీచేస్తున్న వాటికి మంగళం పాడాలని నిర్ణరుుంచింది. ఈ మేరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ రేమాండ్‌పీటర్ ఉత్తర్వులు జారీచేయడంతో జిల్లాలో పాసుపుస్తకాల పంపిణీ ఆగిపోరుుంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం దాదాపు ఏడాదిపాటు కొత్త పాసు పుస్తకాలను ప్రభుత్వం జారీ చేయలేదు. ప్రభుత్వ చిహ్నం మార్పు తదితర కారణాల వల్ల పుస్తకాల ముద్రణ ఆలస్యమైంది. దీంతో భూ క్రయవిక్రయాలు జరిగినా యాజమాన్య హక్కుల్లో కీలకంగా భావించే పాసు పుస్తకాలను ఇవ్వకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పట్లో కష్టమే! తప్పులతడకగా ఉన్న రెవెన్యూ రికార్డులను సరిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందుకనుగుణంగా ప్రతి భూమి చరిత్ర, పట్టాదారు, అనుభవదారులు, పహనీల్లో నమోదైన పేర్లను కంప్యూటరీకరించాలని భావించింది. ఈ మేరకు వెబ్‌ల్యాండ్ అప్డేషన్ పేరిట సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీనికి అనుగుణంగా క్షేత్రస్థారుులో సర్వే చేసిన రెవెన్యూ సిబ్బంది ప్రతి సర్వే నంబర్ భూమి పుట్టుపుర్వోత్తరాలను సేకరించారు. అదేసమయంలో రికార్డుల్లో మార్పులు, చేర్పులను కూడా నమోదు చేసుకున్నారు. ఇవేకాకుండా అభ్యంతరాలను కూడా తెలుసుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 11,12,029 సర్వేనంబర్లకు సంబంధించి ఆరు లక్షల క్లెరుుమ్‌లు అధికారుల దృష్టికి వచ్చారుు. వీటిన్నింటిని సవరించి కంప్యూటరీకరించడం ద్వారా రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా తయారు చేయాలని ప్రభుత్వం అనుకుంది. ఇంతవరకు ప్రక్రియ సజావుగానే సాగినా.. సేకరించిన సమాచారాన్ని కంప్యూటరీకరించడం రెవెన్యూ అధికారులకు తలకుమించిన భారంగా మారింది. ఆరు లక్షల క్లెరుుమ్‌లు జిల్లావ్యాప్తంగా ఆరు లక్షల సవరణలు రావడం, వీటన్నింటిని కంప్యూటర్లలో అప్లోడ్ చేయడంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. దీంతో వెబ్‌ల్యాండ్ అప్డేషన్ లో జిల్లా వెనుకబడింది. ఈ ప్రక్రియంతా పూర్తరుుతేనే.. ఈ -పాస్‌పుస్తకాల జారీకి సార్థకత చేకూరుతుంది. క్షేత్రస్థారుులో వెలుగులోకి వచ్చిన తప్పులను సరిదిద్దుకోకుండా.. సవరించిన వాటినీ కంప్యూటరీకరించకుండా ఈ- పట్టాదారు పాస్‌పుస్తకాలను ఇవ్వాలనుకుంటే మాత్రం సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ -పుస్తకాల్లోనే సమగ్ర సమాచారాన్ని పొందుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పట్టాదారుకు సంబంధించిన పహనీల్లో సదరు భూమిపై ఏమైనా రుణాలు తీసుకున్నారా? బ్యాంకుల్లో ఏమైనా కుదవ పెట్టారా? తదితర సమాచారాన్ని కూడా ఆ పుస్తకంలో నమోదు చేయనున్నారు. ఈ సమాచారాన్ని ఆన్ లైన్ లో ఎవరైనా పరిశీలించుకునే వెసులుబాటు కలగనుంది. ముఖ్యంగా బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు, ఇతరులు కూడా సంబంధిత సర్వే నంబర్ భూమి వివరాలను ఆన్ లైన్ లో పరిశీలించుకోవచ్చు. రికార్డులన్నీ సవరించిన తర్వాత ఈ -పాస్ పుస్తకాలను జారీచేస్తే బాగుంటుంది తప్ప.. వాటిని గాలికొదిలేసి.. ప్రస్తుతం మాన్యువల్‌గా ఇస్తున్న పీటీ బుక్కులను నిలిపివేయాలనే నిర్ణయం సరికాదని రైతులు అంటున్నారు.