eamcet 2015
-
ఎంసెట్-2015.. ఎన్ని మార్కులు.. ఏ ర్యాంకు!?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ కోలాహలం ముగిసింది. ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చరల్ కోర్సుల్లో ప్రవేశానికి రెండేళ్లపాటు శ్రమించిన విద్యార్థులు.. ఇక ఎన్ని మార్కులు వస్తే ఏ ర్యాంకు వస్తుంది? ఇంటర్మీడియెట్ వెయిటేజీతో కలిపి వచ్చే ర్యాంకు ఎంత ? అనే లెక్కలు వేసుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంసెట్-2015లో ఇంటర్మీడియెట్ మార్కులు; ఎంసెట్ మార్కులతో కలిపితే ఆశించదగిన ర్యాంకులపై నిపుణుల అంచనాలు.. గతేడాది వరకు తెలుగు విద్యార్థులందరికీ ఎంసెట్ ఉమ్మడిగా జరిగిన విషయం; ఈ సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వేర్వేరుగా నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి ర్యాంకుల అంచనాపై ఇటు విద్యార్థుల్లో, అటు తల్లిదండ్రుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో గత సంవత్సరంతో పోల్చితే కొంచెం తక్కువ మార్కులు వచ్చినా మెరుగైన ర్యాంకు ఆశించేందుకు అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ర్యాంకుల సరళి అంచనా.. ఇలా: ఈసారి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ర్యాంకుల పరంగా కొన్ని సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. గతేడాది వరకు ఆంధ్రప్రదేశ్ రీజియన్ విద్యార్థులు కూడా ఎంసెట్‌లో పోటీ పడగా.. ఈసారి ఆ ప్రాంతానికి చెందిన దాదాపు 80 వేల మంది పోటీ తగ్గింది. దీంతో టీఎస్ ఎంసెట్ 2015లో మార్కులు తక్కువగా వచ్చినా.. కాస్త మెరుగైన ర్యాంకు పొందొచ్చు. ఉదాహరణకు ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 135 మార్కులకు 100లోపు ర్యాంకు పొందేందుకు ఆస్కారముంది. గత సంవత్సరం ఇవే మార్కులకు 150 వరకు ర్యాంకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెద్దగా మార్పులు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఇంజనీరింగ్ విభాగంలో పోటీ దాదాపు గతేడాది స్థాయిలోనే ఉంది. అంతేకాకుండా టీఎస్ ఎంసెట్ కంటే దాదాపు 40 వేల మంది విద్యార్థులు అధికంగా ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో పోటీ పడ్డారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. ఇంజనీరింగ్ విభాగంలో కటాఫ్ 118 నుంచి 125 మధ్యలో ఉండొచ్చని అంచనా. మెడికల్ ఇలా: ఎంసెట్ మెడికల్ విభాగంలో రెండు రాష్ట్రాల్లోనూ పోటీ దాదాపు దగ్గరగా ఉంది. టీఎస్ ఎంసెట్‌లో 84,678; ఏపీ ఎంసెట్‌లో 81,027 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో ఎంసెట్ కటాఫ్ మార్కులు 115-120 మధ్యలో ఉంటాయని నిపుణుల అభిప్రాయం (ఇంటర్మీడియెట్‌లో 530 మార్కులకు పైగా సాధించిన నేపథ్యంలో). అంతేకాకుండా గతేడాది ఉమ్మడిగా జరిగిన ఎంసెట్‌తో పోల్చినా పెద్దగా మార్పులు ఉండవని అంచనా. వెయిటేజీ! ఇంటర్మీడియెట్‌లోని గ్రూపు సబ్జెక్టుల 600 మార్కులను 25కు కుదించి ఎంసెట్‌లో వెయిటేజీ నిర్ణయిస్తారు. అంటే ఐపీఈలో సాధించిన ప్రతి 24 మార్కులు ఎంసెట్‌లో 1 మార్కుకు సమానం. అలాగే ఎంసెట్‌లో 160 మార్కులను 75కు కుదిస్తారు. ఈ రెండింటి మొత్తం వెయిటేజీ ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు. -
ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
రాంనగర్: ఈనెల 14న నిర్వహించే ఎంసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జేసీ ఎన్.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అదనపు జాయింట్ కలెక్టర్ చాంబర్లో ఎంసెట్ నిర్వహణపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంజినీరింగ్, మెడిసిన్ ఎంసెట్ పరీక్షలకోసం37 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10గంటల నుండి ఒంటి గంట వరకు, మెడిసిన్ మధ్యాహ్నం 2-30 గంటల నుండి 5-గంటల వరకు జరుగుతుందని ఆయన చెప్పారు. నల్లగొండలో ఇంజినీరింగ్‌కు 15 పరీక్షా కేంద్రాలు, కోదాడలో 7 పరీక్షా కేంద్రాలు, మెడిసిన్‌కు నల్లగొండలో 9 పరీక్షా కేంద్రాలు, కోదాడలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇంజినీరింగ్ పరీక్షకు 10329 మంది విద్యార్ధులు, మెడిసిన్‌కు 7045 మంది విద్యార్ధులు హాజరవుతారని ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో వున్నందున ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్ధులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ నుంచి నల్లగొండలోని ఎన్జీ కాలేజీ వరకు, కోదాడలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ వరకు ఇంజనీరింగ్ విద్యార్ధుల సౌకర్యార్ధం ఉదయం 6గంటల నుంచి, మెడిసిన్ విద్యార్ధులకు ఉదయం 11గంటల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీ నుంచి పరీక్షా కేంద్రాలకు, కోదాడలో ప్రభుత్వ బాలుర హైస్కూల్ నుండి పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు. మండల కేంద్రాల నుండే కాకుండా విద్యార్ధులు అధికంగా వున్న ప్రాంతాల నుంచి నల్లగొండకు, కోదాడకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ బస్సులు సంబంధిత మండలాల పోలీస్ స్టేషన్ల నుండి బయలుదేరి బస్టాండు మీదుగా నిర్ధేశించిన ప్రాంతాలకు వెళతాయని ఈ బస్సులకు ఎంసెట్-2015 అని ప్రత్యేక బ్యానర్లు, స్టిక్కర్లు ఉంటాయని ఆయన తెలిపారు. అంతరాయం లేకుండా... పరీక్షా కేంద్రాలకు నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చూడాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద గ ట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. సెంటర్స్ దగ్గర 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు జిరాక్స్ షాప్‌లను కూడ విధిగా మూసి ఉంచేట్లు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా పరీక్షల కేంద్రాల వద్ద మంచినీరు, ఫస్ట్‌ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి అదనపు జేసీ నిరంజన్, డీఆర్వో రవినాయక్, ఎంసెట్ కో-ఆర్డినేటర్ నాగేందర్‌రెడ్డి, రవాణాశాఖ డిప్యూటీ కమీషనర్ చంద్రశేఖర్, ఆర్ఐవో ప్రకాశ్, నల్లగొండ ఆర్డీవో వెంకటాచారి, డీఎస్పీ రాములునాయక్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, విద్యుత్ శాఖాధికారులు పాల్గొన్నారు. కోదాడకు ఉచిత బస్సులు- ఎమ్వీఐ శ్రీనివాస్‌రెడ్డి కోదాడ టౌన్ : ఎంసెట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల కోసం పలు పట్టణాల నుంచి కోదాడకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు కోదాడ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. మిర్యాలగూడెం, సూర్యాపేట, హుజూర్నగర్ బస్టాండ్లనుంచి ఇంజినీరింగ్ విద్యార్ధుల కోసం ఉదయం 7:30 గంటలకు, మెడిసిన్ విద్యార్ధుల కోసం మధ్యాహ్నం 12:30 గంటలకు ఉచిత బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. కోదాడ బస్టాండ్ నుంచి కేఆర్ఆర్ కళాశాలకు, ఇతర సెంటర్లకు ఉదయం 7:30 నుండి 8:45 వరకు ఉచిత బస్సులు ఉంటాయని తెలిపారు. సమ్మెతో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ కళాశాలల నిర్వాహకులు కల్పిస్తున్న ఈ ఉచిత సౌకర్యంపై ఇబ్బందులు ఉంటే 96186 51213 నెంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. సెంటర్ల వివరాల్లో ఇబ్బం దులు ఉంటే కోదాడ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్ సహాయం తీసుకోవాలని రీజినల్ కో-ఆర్డినేటర్ తెలిపారు. -
సజావుగా ఎంసెట్
95 శాతం హాజరు ముందు రోజే నగరానికి చేరుకున్న విద్యార్థులు ఫలించిన రెవెన్యూ యంత్రాంగం ముందస్తు చర్యలు యూనివర్సిటీ : ఎంసెట్-2015 రాత పరీక్షలు జిల్లాలో సజావుగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశాల రాత పరీక్ష 17 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. మెత్తం 8, 275 మంది (95.6శాతం) అభ్యర్థులు హాజరుకాగా, 385 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ కోర్సు ప్రవేశాల రాత పరీక్షలు 6 కేంద్రాలలో నిర్వహించారు. మెత్తం 3058 (93.2 శాతం) మంది అభ్యర్థులు హాజరుకాగా 226 మంది గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కోర్సులకు రెండు కలిపి 95శాతం హాజరు నమోదు అయిందని రీజనల్ కో ఆర్డినేటర్ ఆచార్య బి. ప్రహ్లాదరావు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. జేఎన్టీయూ అనంతపురం సెంటర్లో జామర్లు ఏర్పాటు చేశారు. సమ్మె నేపధ్యంలో ముందస్తు జాగ్రత్తలు: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో జిల్లా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంసెట్‌కు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో సఫలీకృతులయ్యారు. దీంతో తాజాగా ఊహాగానాల నడుమ జరిగిన ఎంసెట్ విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించారు. ఎంసెట్ పరీక్షలకు అరగంట ఆలస్యమైనా అనుమతించండని జిల్లా కలెక్టర్ కోనశశిధర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఎవరూ ఈ వెసులుబాటును ఉపయోగించుకోలేదు. సమ్మె ప్రభావం, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతిచ్చిలేదనే ముందస్తు హెచ్చరికలతో ముందు రోజే నగరానికి చేరుకున్నారు. ప్రవేటు కళాశాలల ఉచిత తాయిలాలు: ఎంసెట్‌కు గణనీయ స్థాయిలో అభ్యర్థులు హాజరుకావడంతో అనుబంధ కళాశాలల యాజమాన్యాల అంచనాలు రెట్టింపయ్యాయి. గత ఏడాది ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి, లోకల్ క్యాటగిరి వివాదం, సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఆలస్యంగా ఎంసెట్ నిర్వహణ, కౌన్సెలింగ్ దృష్ట్యా పొరుగు రాష్ట్రాల వైపు విద్యార్థులు మళ్లారు. ఇందుకు భిన్నంగా తాజా ఎంసెట్ జరగడంతో ప్రవేటు కళాశాలలో గత ఏడాదితో పోలిస్తే ప్రవేశాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఇంజనీరింగ్ రాత పరీక్ష ముగిసిన వెంటనే అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలు తాయిలాలు మెదలెట్టాయి. కళాశాలలో అడ్మిషన్ పొందితే ఉచిత ల్యాప్‌టాప్ కంప్యూటర్లు, బస్ ఫీజు ప్రీ, హాస్టల్ ప్రీ అంటూ ఎన్నికల ప్రచారాన్ని తలపించే విధంగా తాయిలాలు ఇస్తుండడం విశేషం. మెడిసిన్‌కు ఎండ దెబ్బ: ఉదయం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షల కంటే మధ్యాహ్నం జరిగిన మెడిసిన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు హాజరయ్యే వారికి అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని పరీక్ష కేంద్రాలలో ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అవస్థలు పడ్డారు. -
ఎమ్సెట్కు భారీగా అప్లికేషన్లు!
-
ఎమ్సెట్-2015 తేది ఖరారు!
-
సంయుక్తంగా ఎంసెట్ నిర్వహణ