Eamcet Counselling.
-
కంప్యూటర్ కోర్సులు ‘కేక’
సాక్షి, హైదరాబాద్: తొలి విడత ఇంజనీరింగ్ సీట్లను ఆదివారం కేటాయించారు. మొత్తం 82,666 సీట్లు అందుబాటులో ఉంటే, 70,665 భర్తీ చేసినట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ వెల్లడించారు. 12,001 సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 1,56,879 మంది అర్హత సాధించారు. 76,821 మంది ఎంసెట్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 75,708 మంది వివిధ కాలేజీలు, వివిధ బ్రాంచీలకు ఆప్షన్లు ఇచ్చారు. మొత్తం 50,44,634 ఆప్షన్లు అందాయి. 5,043 మంది ఎలాంటి ఆప్షన్లు ఇవ్వలేదు. 5,576 మందికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాలో సీట్లు వచ్చాయి. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 173 పాల్గొన్నాయి. 28 కాలేజీల్లో వందశాతం సీట్ల కేటాయింపు మూడు యూనివర్సిటీలు, 28 ప్రైవేటు కాలేజీల్లో వందశాతం సీట్ల కేటాయింపు జరిగినట్టు సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22లోగా సెల్ఫ్ రిపోరి్టంగ్ చేయాలని ఎంసెట్ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఆగస్టు 9 నుంచి 11 వరకూ కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. సగానికిపైగా కంప్యూటర్ కోర్సులే మొదటి దశ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఎక్కువగా కంప్యూటర్ కోర్సులనే విద్యార్థులు కోరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్రాంచీల్లో కలిపి 82,666 సీట్లుంటే, కంప్యూటర్ కోర్సుల్లోనే 55,876 సీట్లున్నాయి. వీటిల్లో భర్తీ అయిన సీట్లు 52,637. అన్ని బ్రాంచీలకు కలిపి ఉన్న సీట్లలో 67.5 శాతం కంప్యూటర్ కోర్సులవైతే, 32.5 శాతం ఇతర బ్రాంచీలకు చెందినవి ఉన్నాయి. కంప్యూటర్ కోర్సుల్లో సీఎస్సీ, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటాసైన్స్, ఐటీతో కలుపుకుని మొత్తం 18 రకాల కోర్సులున్నాయి. ఎక్కువ మంది ఈ కోర్సులకే ఆప్షన్లు ఇవ్వడంతో 94.20 శాతం సీట్లు భర్తీ చేశారు. మిగిలిపోయిన సీట్లు 3,239 ఉన్నాయి. ఇవి కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినవే. ఈ కోర్సుల్లో వందశాతం భర్తీ ఆర్టిఫిషియల్ఇంటిలిజెన్స్ కోర్సులో 137సీట్లు ఉండగా.. అన్నీ భర్తీ అయ్యాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో 91, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టంలో 318, సీఎస్సీ (సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ)లో 133, సీఎస్సీ (నెట్వర్క్)లో 91, సీఎస్సీ (ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్)లో 870 సీట్లు ఉండగా.. అన్నీ భర్తీ అయినట్టు అధికారులు వెల్లడించారు. భారీగా సీట్లు మిగిలిన సివిల్, మెకానికల్, ఈఈఈ కౌన్సెలింగ్‌లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల పట్ల విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. గత ఏడాది కూడా ఇదే విధంగా ఉండటంతో చాలా కాలేజీలు ఈ బ్రాంచీల్లో సీట్లు రద్దు చేసుకోవడంతో 7 వేల సీట్లు తగ్గాయి. అయినప్పటికీ ఈ కోర్సుల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాటి అనుబంధ బ్రాంచీల్లో 17,274 సీట్లు అందుబాటులో ఉంటే, 13,595 సీట్లు మాత్రమే కేటాయించారు. 3,679 సీట్లు మిగిలిపోయాయి. మెకానికల్, సివిల్ సహా వాటి అనుబంధ బ్రాంచీల్లోనూ 3,642 సీట్లు మిగిలిపోయాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 44.76 శాతం, మెకానికల్ 38.50 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. ఈఈఈలోనూ 58.38 శాతం సీట్లు భర్తీ చేశారు. -
కంప్యూటర్ ఇంజనీరింగ్కే క్రేజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం జరిగిన రెండో దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో కన్వీనర్ కోటా కింద 75.18 శాతం సీట్లు కేటాయించినట్లు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 79,790 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే ఇప్పటివరకు 59,993 సీట్ల కేటాయింపు పూర్తయింది. ఇంకా 19,797 సీట్లు మిగిలిపోయాయి. రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారిలోనూ చాలా మంది కంప్యూటర్ సైన్స్ సహా కొత్త కోర్సులకే ప్రాధాన్యమిచ్చారు. దీంతో కంప్యూటర్ సైన్స్ సీట్లు హాట్ కేకుల్లా భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ సీట్లకు తక్కువ ఆప్షన్లు ఇవ్వడంతో ఎక్కువగా మిగిలిపోయాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) సీట్లను 95.98 శాతం కేటాయించగా మెకానికల్ ఇంజనీరింగ్‌లో కేవలం 32.57 శాతమే సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్ ఇంజనీరింగ్‌కు కూడా విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో 41.87 శాతమే సీట్ల కేటాయింపు జరిగింది. 20 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్... రెండో దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన సీటును రద్దు చేసుకొనేందుకు ఈ నెల 18 వరకు అవకాశం ఇచ్చారు. ఈలోగా సీటురద్దు చేసు కున్న వారికి చెల్లించిన ఫీజులో 50 శాతం వెనక్కి ఇస్తారు. గడువు తర్వాత రద్దు చేసుకుంటే ఎలాంటి ఫీజు తిరిగి ఇవ్వరు. ప్రస్తుతం భర్తీకాని సీట్లు, రెండో దశలో ఖాళీగా మిగిలే సీట్లను పరిగణలోకి తీసుకొని ఈ నెల 20 నుంచి ప్రత్యేక రౌండ్ సీట్ల కేటాయింపు చేపడతారు. సీటు పొందిన అభ్యర్థులకు ఇప్పటికే వారి రిజిస్టర్డ్ మొబైల్‌కు సంక్షిప్త సందేశం పంపా రు. వివిధ కారణాల చేత 1,861 మంది ఆప్షన్స్ ఇచ్చి నా సీట్లు కేటాయించలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్ కోటా) 4,973 సీట్లు కేటాయించారు. -
నాణ్యతకే పెద్దపీట వేసిన విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు నాణ్యతకే పెద్దపీట వేశారు. కేవలం రూ. 30 వేల ఫీజు ఉన్న కళాశాలలకు ఒకటి రెండు అడ్మిషన్లు మాత్రమే వచ్చాయి. ఆయా కళాశాలల్లో నాణ్యత లేదని భావించిన విద్యార్థులు వాటి జోలికి వెళ్లలేదని సీట్ల కేటాయింపు జాబితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక లక్ష రూపాయల వరకు ఫీజు ఉన్న కళాశాలల్లోనూ పూర్తి సీట్లు నిండాయి. మరోవైపు సీమాంధ్ర ప్రాంత విద్యార్థులు ఈ ఏడాది హైదరాబాద్‌లోని కళాశాలలను ఎంచుకునేందుకు ఇష్టపడలేదని జాబితాలను బట్టి స్పష్టమవుతోంది. 20 శాతం ఓపెన్ కేటగిరీలో ఏయూ, ఎస్వీయూ రీజియన్ల విద్యార్థులు కొన్ని అగ్రశ్రేణి కళాశాలల్లో మాత్రమే సీట్లు ఎంచుకున్నారు. రాజధాని నగరంలో సైతం నాణ్యమైన కళాశాలలను మాత్రమే విద్యార్థులు ఆదరించారు. ఈ ఏడాది 60 ప్రైవేటు కళాశాలల్లో, 34 యూనివర్సిటీ కళాశాలల్లో మొత్తం సీట్లు నిండగా... 256 కళాశాలల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. తొలివిడత కౌన్సెలింగ్ అనంతరం గణాంకాలను విశ్లేషించగా.. 256 కళాశాలల్లో 0 నుంచి 100లోపు సీట్లు భర్తీ అయ్యాయి. అందులో ఒక్క సీటు కూడా భర్తీ కాని కళాశాలలు 13 కాగా... 5 సీట్ల లోపు భర్తీ అయిన కళాశాలలు 20. మొత్తంగా 103 కళాశాలల్లో 30 లోపు సీట్లు మాత్రమే భర్తీ కావడం గమనార్హం. రాష్ట్రంలో ఈ ఏడాది తొలి విడత కౌన్సెలింగ్‌లో 609 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు, 34 యూనివర్సిటీ కళాశాలలు పాల్గొనగా.. వాటిలో 100 సీట్లలోపు భర్తీ అయినవి 256 కళాశాలలు, 150లోపు సీట్లు భర్తీ అయినవి 335 కళాశాలలు ఉన్నాయి. అంటే సగానికి పైగా ప్రైవేటు కళాశాలల భవితవ్యం అంధకారంలో పడింది. తక్కువ అడ్మిషన్లు పొందిన కళాశాలల విద్యార్థులు తర్వాతి విడత కౌన్సెలింగ్‌లో మరింత మంచి కళాశాల కోసం ప్రయత్నిస్తే.. వాటి పరిస్థితి మరీ దారుణంగా మారనుంది. దాంతో ఒక్క సీటు కూడా భర్తీకాని కళాశాలల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అగ్రశ్రేణి కళాశాలల్లో ఇలా: కనీసం 50 శాతం సీట్లు భర్తీ అయితేనే ఆయా కళాశాలలు మనుగడ సాధించేందుకు అవకాశం ఉంటుందని పలు యాజమాన్య సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఆ లెక్కన కనీసం 150 పైగా సీట్లు భర్తీ కావాలి. దీన్ని బట్టి చూస్తే దాదాపు 300 క ళాశాలల పరిస్థితి మాత్రమే మెరుగ్గా ఉంది. 151 నుంచి 200 సీట్ల వరకు 70 కళాశాలలు, 201 నుంచి 250 మధ్య 49 కళాశాలలు, 251 నుంచి 300 సీట్ల వరకు 41 కళాశాలల్లో భర్తీ అయ్యాయి. ఇక 500పైన సీట్లు భర్తీ అయిన కళాశాలలు 56 ఉన్నాయి. ఈ ఏడాది కాస్త ప్రమాణాలున్న అగ్రశ్రేణి కళాశాలల్లో మాత్రమే 50 శాతానికంటే ఎక్కువ సీట్లు భ ర్తీ అయ్యాయి. దాదాపు 60 ప్రైవేటు కళాశాలల్లో మొత్తం సీట్లు భర్తీ అయ్యాయి. కళాశాలలు ఏమంటున్నాయంటే: ‘‘రూ. 35 వేల ఫీజు ఉన్న కళాశాలల్లో 75 శాతం సీట్లు నిండితే తప్ప వాటికి మనుగడ ఉండదు. జీతాలు చెల్లించడం, ప్రమాణాలతో బోధించడం సాధ్యపడదు’’ అని శ్రీదత్తా ఇంజనీరింగ్ విద్యాసంస్థల చైర్మన్ జి.పాండురంగారెడ్డి అభిప్రాయపడ్డారు. ‘‘కన్వీనర్ కోటా సీట్లు మాత్రమే భర్తీ అయితే సరిపోదు. యాజమాన్య కోటా సీట్లు కూడా భర్తీ అయితేనే కళాశాలలు అత్యుత్తమ ప్రమాణాలతో పనిచేసే పరిస్థితి ఉంటుంది..’’ అని సీఎంఆర్ గ్రూప్ కార్యదర్శి సి.హెచ్.గోపాల్‌రెడ్డి చెప్పా రు. ‘‘హైదరాబాద్‌లో ఉన్న మా గ్రూప్ కళాశాలల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాశాలల్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లోని అనేక కళాశాలల్లో కన్సల్టెన్సీల ద్వారా సీట్లను భర్తీ చేశారు. రవాణా ఉచితం, హాస్టల్ వసతి ఉచితం అంటూ ఎరచూపారు. చివరకు ఇలాంటి పద్ధతులు ఆయా కళాశాలలకే కష్టాలను తెచ్చిపెడతాయి..’’ అని అనురాగ్ గ్రూప్ కళాశాలల చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కారణాలేమిటి? చాలా ఇంజనీరింగ్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో వెల్లడవడం 195 కళాశాలలకు తాత్కాలిక ఫీజును రూ. 30 వేలుగా నిర్ణయించడం. ఆ కళాశాలల్లో నాణ్యత లేదని విద్యార్థులు భావించడం ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత నామమాత్రంగా ఉండడం ఉపాధి తగ్గిపోయి ఇంజనీరింగ్ కోర్సులపై విద్యార్థులకు తగ్గిపోయిన మోజు ఐటీ వంటి విభాగాలకు తగ్గిన ఆదరణ రాష్ట్రంలో ఏటా అక్టోబర్ వరకు తరగతులు ప్రారంభం కాక విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లడం కళాశాలల్లో అత్యుత్తమ బోధనా సిబ్బంది లేకపోవడం.