economic times
-
భారత్‌లో ఐఫోన్ల తయారీ నిలిపివేత..వ్యాపారంలో లాభాలు లేక సతమతం?
భారత్‌లో ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాభాల్ని గడించే విషయంలో విస్ట్రాన్ అసంతృప్తిగా ఉంది. కాబట్టే వచ్చే ఏడాది నాటికి దేశీయంగా మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లలో ఐఫోన్ల తయారీని దశల వారీగా నిలిపి వేయనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ అంశంపై విస్ట్రాన్ యాజమాన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. విస్ట్రాన్ భారత్‌లో అనుకున్నంత స్థాయిలో దీర్ఘకాలిక లాభాల్ని గడించడంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేలా వియాత్నం, మెక్సికో వంటి దేశాల్లో లాభదాయకమైన టెక్నాలజీ తయారీ సంబంధిత ప్రొడక్ట్‌లపై దృష్టి సారించినట్లు సమాచారం. ఐఫోన్‌తో జరిపిన చర్చలు విఫలం ఇక, ఐఫోన్ల తయారీ నిలిపివేతపై విస్ట్రాన్ ఎగ్జిక్యూటీవ్‌లు కీలక వ్యాఖ్యలు చేశారంటూ రిపోర్ట్లు పేర్కొన్నాయి. భారత్‌లో యాపిల్ చేస్తున్న బిజినెస్‌లో ప్రాఫిట్స్ రావడం లేదని, ఎక్కువ లాభాలు వచ్చేలా యాపిల్ సంస్థతో జరిపిన చర్చలు విఫలమైనట్లు హైలెట్ చేశాయి. అయితే అంతర్జాతీయ తయారీ సంస్థలైన ఫాక్స్‌కాన్, పెగాట్రాన్స్ స్థాయిలో విస్ట్రాన్ ఆదాయాన్ని అర్జించడంలో ఇబ్బందులు పడుతుందని సమాచారం. చదవండి👉 ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కూతురు.. ఇది కూడా ఎగతాళేనా? విస్ట్రాన్ భారత్‌లో యాపిల్ కోసం ఐఫోన్ ఎస్ఈలను తయారు చేయడమే కాదు..ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అంటే ఐఫోన్ల తయారీ, స్టోరేజ్ నిర్వహణ, అమ్మకాలు జరుపుతుంది. అయినప్పటికీ ఫ్రాఫిట్స్ పొందే విషయంలో ఇబ్బందులు పడుతుంది. వ్యాపారాన్ని మరింత విస్తరించలేకపోతుంది. వేధిస్తున్న అట్రిషన్ రేటు ఇంకా, కర్ణాటకలోని కోలార్ జిల్లా, అచ్చటనహళ్లి గ్రామ పారిశ్రామక వాడలో ఉన్న విస్ట్రాన్ తయారీ యూనిట్లో ఉద్యోగులు స్థిరంగా ఉండటం లేదు. అధిక వేతనం కోసం ఇతర సంస్థల్లో చేరుతున్న సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉంది. నివేదిక ప్రకారం.. చైనా - భారత్‌ల మధ్య వర్క్ కల్చర్ విషయంలో కంపెనీ అనేక సవాళ్లు విస్ట్రాన్ ఐఫోన్ తయారీ నిలిపివేయడానికి దోహదపడ్డాయి. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించకపోవడంతో అట్రిషన్ రేట్ పెరిగేందుకు దారి తీసింది. ఐఫోన్ 15 తయారు చేయనున్న టాటా! సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా, విస్ట్రాన్ తన ఐఫోన్ల తయారీని టాటా గ్రూప్‌కు విక్రయిస్తోంది. ట్రెండ్ ఫోర్స్ రిపోర్ట్ సైతం టాటా గ్రూప్ భారత్‌లో విడుదల కానున్న ఐఫోన్ 15 మోడళ్లను తయారు చేసేందుకు ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. చివరిగా.. 2008లో పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సర్వర్లతో సహా ఇతర సేవల్ని అందించేలా విస్ట్రాన్ భారతీయ మార్కెట్లో అడుగు పెట్టింది. 2017లో, కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించి యాపిల్ కోసం ఐఫోన్లను తయారు చేయడం ప్రారంభించింది. చదవండి👉‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వైరల్ -
పోర్టుల అభివృద్ధిలో ఏపీకి ఎకనామిక్ టైమ్స్ అవార్డు
-
ఆంధ్రప్రదేశ్‌కు ‘ఇన్ఫ్రా ఫోకస్’ అవార్డు
సాక్షి, అమరావతి: తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశీయ ఇన్ఫ్రా రంగంపై ప్రముఖ వాణిజ్య దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఏటా ప్రకటించే అవార్డు ఏపీ పోర్టులకు దక్కింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, అత్యుత్తమ ప్రగతికి గుర్తింపుగా ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు రాసిన లేఖలో ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. సెప్టెంబర్ 27న ఢిల్లీలోని హయత్ రెసిడెన్సీలో జరిగే 7వ ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి అమర్నాథ్ను టైమ్స్ గ్రూప్ ఆహ్వానించింది. నీతి ఆయోగ్ సలహాదారుడు సుధేందు జే సిన్హా అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న వివిధ ఇన్ఫ్రా ప్రాజెక్టులను పరిశీలించి అవార్డుకు ఎంపిక చేసింది. సముద్ర వాణిజ్యంపై దృష్టి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ.25,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులతో పాటు తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోంది. దీనికి తోడు పోర్టులను అనుసంధానిస్తూ జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. విశాఖ, అనంతపురం వద్ద రెండు భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడమే కాకుండా కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వీటితో పాటు విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో భాగంగా కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ పేరుతో భారీ పారిశ్రామిక వాడ నిర్మాణానికి సంబంధించి రూ.1,054.6 కోట్ల విలువైన పనులకు టెండర్లను పిలిచింది. కాకినాడ వద్ద బల్క్ డ్రగ్ పార్కు, విశాఖ అచ్యుతాపురం, నక్కపల్లి, రాంబిల్లి వద్ద పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోర్టు ఆథారిత అభివృద్ధి పనులను వివరిస్తూ ఎకనామిక్ టైమ్స్ జాతీయ స్థాయిలో కథనాన్ని ప్రచురించనున్నట్లు లేఖలో పేర్కొంది. ప్రతి 50 కి.మీ.కి పోర్టు లేదా హార్బర్: మంత్రి అమర్నాథ్ 974 కి.మీ పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి 50 కి.మీకి పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందదాయకం. సీఎం జగన్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రానికి, పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. -
ఐఎన్ఎస్ ప్రెసిడెంట్‌గా మోహిత్ జైన్
సాక్షి, న్యూఢిల్లీ: ది ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ప్రెసిడెంట్‌గా ఎకనమిక్ టైమ్స్‌కు చెందిన మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. ఐఎన్ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ‘సాక్షి’ దినపత్రిక అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ కె.రాజప్రసాద్ రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం వర్చువల్ విధానంలో జరిగిన సొసైటీ 82వ వార్షిక సాధారణ సమావేశంలో 2021–22 సంవత్సరానికి ఐఎన్ఎస్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగిన ‘హెల్త్ అండ్ యాంటిసెప్టిక్’కు చెందిన ఎల్.ఆదిమూలం నుంచి మోహిత్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. రాకేష్ శర్మ (ఆజ్ సమాజ్)ను వైస్ ప్రెసిడెంట్‌గా, తన్మయ్ మహేశ్వరి (అమర్ ఉజాలా)ని గౌరవ కోశాధికారిగా ఎన్నుకున్నట్లు సొసైటీ సెక్రటరీ జనరల్ మేరీ పాల్ తెలిపారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా ఎన్నికైన 41 మందిలో ‘అన్నదాత’.. ఐ. వెంకట్ ఉన్నారు. -
కరోనా ఉనికిని అంగీకరించాల్సిందే!
బెంగళూరు: లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు కొనసాగించడం సరికాదని ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. అలా చేస్తే.. కోవిడ్–19 మరణాల కన్నా ఆకలితో చనిపోయేవారి సంఖ్య ఎక్కువవుతుందని హెచ్చరించారు. ఇకపై కరోనా ఉనికిని అంగీకరించక తప్పదని స్పష్టం చేశారు. సాధారణ స్థితికి వెళ్లక తప్పదని, ఆరోగ్యవంతులు తమ విధులను నిర్వర్తించాలని, అదే సమయంలో, వైరస్ ప్రభావం తీవ్రంగా పడే వ్యక్తులను కాపాడుకునే చర్యలు చేపట్టాలని సూచించారు. ‘లాక్‌డౌన్‌ను ఎక్కువ కాలం కొనసాగించకూడదు. అదే జరిగితే కోవిడ్‌తో కన్నా ఆకలితోనే ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి తలెత్తుతుంది’ అని ‘ఎకనమిక్ టైమ్స్’ బుధవారం నిర్వహించిన ‘ఈటీ అన్వైర్డ్– రీఇమాజినింగ్ బిజినెస్’ అనే వెబినార్‌లో దేశ ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. -
‘రద్దు’కే మద్దతు
నోట్లరద్దు నిర్ణయానికి ఏడాదైన సందర్భంగా ఎకనమిక్ టైమ్స్ వెబ్సైట్ చేసిన సర్వేలో ప్రజలు మోదీకే మద్దతు తెలిపారు. నోట్లరద్దు ద్వారా అవినీతి, నల్లధనంపై పోరాటంలో అడుగు ముందుకు పడిందని అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో పదివేల మంది పాల్గొన్నారు. సర్వేలో వేసిన ప్రశ్నలు, ప్రజాభిప్రాయాన్ని పరిశీలిస్తే.. ► నోట్లరద్దు నిర్ణయంపై మీ అభిప్రాయం? విజయవంతమైంది 38 శాతం మిశ్రమ ఫలితం 32శాతం విఫలమైంది 30 శాతం ► ఆర్థిక వ్యవస్థపై నోట్లరద్దు ప్రభావం? దీర్ఘకాల నష్టం 26 శాతం పారదర్శకత పెరిగింది 32 శాతం పారదర్శకత పెరిగినా కొన్ని సమస్యలున్నాయి 42శాతం ► ఉద్యోగాలపై నోట్లరద్దు ప్రభావం? ప్రభావమేమీ లేదు 32 శాతం దీర్ఘకాల నష్టం 23 శాతం స్వల్పకాల నష్టమే 45 శాతం ► ఉన్నపళంగా మోదీ రూ.2వేల నోటును రద్దుచేస్తే? నిజాయితీగా పనిచేసే వ్యాపారులకు నష్టం 12 శాతం ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం 31 శాతం అక్రమార్కులకే అసలు సమస్య 56 శాతం ► నోట్లరద్దు వెనక మోదీ వ్యూహం? మత ఘర్షణలనుంచి దృష్టి మరల్చటం 14 శాతం పేదల ఓట్లు గెలవటం 15 శాతం ఆర్థిక వ్యవస్థలో నల్లధనాన్ని తగ్గించటం 71 శాతం ► నోట్లరద్దుతో ప్రభుత్వ ప్రతిష్టపై ప్రభావం? ప్రతిష్ట పెరిగింది 55 శాతం పెద్ద ప్రభావమేమీ ఉండదు 19 శాతం మసకబారింది 26 శాతం -
బీజేపీకి కాదు ఆప్కే మొగ్గు!
34 నుంచి 37 స్థానాలు ఆప్‌కు వస్తాయని సర్వేల అంచనా సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గరవుతున్న కొద్దీ ప్రధాన పార్టీల విజయావకాశాలు అనూహ్యంగా తారుమారు అవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు నిర్వహించిన సర్వేల్లో బీజేపీది పైచేయి కాగా తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గాలి వీస్తున్నట్లు సర్వేల్లో తేలింది. హస్తిన ఓటర్లు ఆప్‌కు స్వల్ప మెజారిటీతో పట్టం కట్టనున్నట్లు ప్రధాన సర్వేల ఫలితాలపై చేసిన రెండు సగటు ఫలితాల సర్వేల్లో వెల్లడైంది. హిందుస్థాన్ టైమ్స్, ఎకనమిక్ టైమ్స్, ఏబీపీ న్యూస్‌ల సర్వేల ఫలితాల ఆధారంగా ఎన్డీటీవీ వేసిన సగటు అంచనా సర్వే ప్రకారం.. అసెంబ్లీలోని మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 37 సీట్ల సాధించి అధికారంలోకి వచ్చే అవకాశముంది. బీజేపీకి 29, కాంగ్రెస్‌కు 4 సీట్లు దక్కొచ్చు. అలాగే.. ఏబీపీ నీల్సన్, సీ-ఓటర్, ఈటీ-టీఎన్ఎస్, హెచ్‌టీ, ద వీక్ సర్వేల ఫలితాలపై ‘టైమ్స్ నౌ’ వేసిన సగటు ఫలితాల అంచనాల్లో ఆప్‌కు 34, బీజేపీకి 32, కాంగ్రెస్‌కు 2 సీట్లు రావొచ్చని తెలిసింది. మరోపక్క.. ఇండియా టుడే-సిసిరో తాజా సర్వేలో ఆప్ ఏకంగా 38 నుంచి 46 సాధించనున్నట్లు తేలింది. బీజే పీకి 19 నుంచి 25, కాంగ్రెస్‌కు 3 నుంచి 7 స్థానాలు దక్కొచ్చు. పాత సర్వేలు బీజేపీకి 38 నుంచి 37, ఆప్‌కు 28 నుంచి 29 సీట్లు రావొచ్చని అంచనా వేయడం తెలిసిందే. పోటీ ప్రధానంగా బీజేపీ, ఆప్‌ల మధ్యే కొనసాగుతున్నా...కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చీలటంపైనే వాటి గెలుపోటములు ఉన్నాయని తాజా సర్వేలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడంపైనే ఆప్ విజయం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ కచ్చితంగా గెలుచుకుంటుందని భావిస్తున్న 4 నుంచి 8 స్థానాల్లో కేజ్రీవాల్ పార్టీ పాగా వేయగలిగితే దాని విజయం ఖాయమని ఎకనమిక్ సర్వే అంచనా. గెలవడానికి కావాల్సిన ఆ కీలక స్థానాల్లో కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్‌ను మరోమారు నిలుపుకుంటే తమ విజయానికి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదన్నది బీజేపీ అంచనా.