Edcet -2014
-
నేడు ఎడ్‌సెట్ ఫలితాల విడుదల
విశాఖపట్నం: బీఈడి కోర్సుల్లో ప్రవేశాలకు గతనెల 30న నిర్వహించిన ఎడ్‌సెట్-2014 ఫలితాలను గురువారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏయూలో సాయంత్రం 6.30 గంటలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, జి.జగదీష్‌రెడ్డి ర్యాంకులను విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఫలితాలను విద్యార్థులు www.apedcet.org, www.apsche.org, www.andhrauniversity.edu.in వెబ్సైట్ల నుంచి పొందవచ్చని తెలిపారు. ప్రవేశాల కౌన్సెలింగ్ విధివిధానాలను ఉన్నత విద్యామండలి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. -
ప్రశాంతంగా ఎడ్‌సెట్
నెల్లూరు (టౌన్), న్యూస్‌లైన్: బీఈడీ కోర్సులో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు శుక్రవారం నిర్వహించిన ఎడ్‌సెట్-14 ప్రశాంతంగా ముగిసింది. నెల్లూరులోని డీకేడబ్ల్యూ, సర్వోదయ, వీఆర్లా కళాశాలలతో పాటు సెయింట్ జోసఫ్, సంతపేటలోని మోడల్ హైస్కూల్లో పరీక్ష నిర్వహించారు. 2,323 మందికి గాను 1,983 మంది హాజరయ్యారు. కావలిలోని జేబీ కళాశాలలో నిర్వహించిన పరీక్షకు 275 మంది హాజరయ్యారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమని అధికారులు ముందే ప్రకటించడంతో అభ్యర్థులుందరూ ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. జిల్లా పరిశీలకురాలుగా ఇందిరా ప్రసూన వ్యవహరించారు.