బీఈడి కోర్సుల్లో ప్రవేశాలకు గతనెల 30న నిర్వహించిన ఎడ్‌సెట్-2014 ఫలితాలను గురువారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు.
విశాఖపట్నం: బీఈడి కోర్సుల్లో ప్రవేశాలకు గతనెల 30న నిర్వహించిన ఎడ్‌సెట్-2014 ఫలితాలను గురువారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏయూలో సాయంత్రం 6.30 గంటలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, జి.జగదీష్‌రెడ్డి ర్యాంకులను విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఫలితాలను విద్యార్థులు www.apedcet.org, www.apsche.org, www.andhrauniversity.edu.in వెబ్‌సైట్‌ల నుంచి పొందవచ్చని తెలిపారు. ప్రవేశాల కౌన్సెలింగ్ విధివిధానాలను ఉన్నత విద్యామండలి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.