30న పరీక్ష... నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నోఎంట్రీ
హైదరాబాద్, న్యూస్‌లైన్: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 42 నగరాల్లోని 349 కేంద్రాల్లో ఈ నెల 30న నిర్వహించే ఎడ్‌సెట్-2014 ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు బుధవారం తెలిపారు. విద్యార్థులు www.apedcet.org వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిర్ణీత సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరుగుతుందని, సమాధానాలను హెచ్‌బీ పెన్సిల్‌తో మాత్రమే గుర్తించాల్సి ఉంటుందని వివరించారు. హాల్‌టికెట్‌పై ఫొటో రాని పక్షంలో విద్యార్థులు తమ వెంట గెజిటెడ్ అధికారి సంతకం చేసిన రెండు ఫోటోలు తీసుకుని రావాలని సూచించారు. ఈదఫా ఎడ్‌సెట్‌కు 1,65,781 మంది దరఖాస్తు చేయగా, ఉర్దూ మాధ్యమం వారికి కర్నూలు, హైదరాబాద్‌లలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తున్నారు.
వెబ్‌సైట్‌లో.. ఎడ్‌సెట్ హాల్‌టికెట్లు
Published Thu, May 22 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement
Advertisement